Karnataka Road Accident: కర్ణాటకలో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. రాష్ట్ర మంత్రి ప్రయాణిస్తున్న కారు ప్రమాదానికి గురైంది. ఇవాళ తెల్లవారుజామున జరిగిన ఈ ప్రమాదంలో కారు ముందు భాగం నుజ్జునుజ్జయిపోయింది. ప్రమాదం జరిగినప్పుడు కారులో మహిళా మంత్రి లక్ష్మీ హెబ్బాల్కర్, ఆమె సోదరుడు ఎమ్మెల్సీ చెన్నరాజు ఉన్నారు.
కర్ణాటకలో మహిళా మంత్రి లక్ష్మీ హెబ్బాల్కర్ ప్రయాణిస్తున్న కారు ప్రమాదానికి గురైంది. ఇవాళ జనవరి 14 ఉదయం 5.30 గంటలకు బెళగావి జిల్లా కిత్తూరు తాలూకా అంబద్ గట్టిలో ఈ ప్రమాదం జరిగింది. కారు వేగంగా వెళ్తున్న సమయంలో కుక్క ఒక్కసారిగా అడ్డురావడంతో తప్పించే ప్రయత్నంలో కారు అదుపు తప్పి రోడ్డు పక్కనున్న చెట్టును ఢీ కొట్టింది. కారు మందు భాగం పూర్తిగా నుజ్జయింది. ప్రమాద తీవ్రత చాలా ఎక్కువగా ఉంది. అయితే అదృష్టవశాత్తూ కారులోని సేఫ్టీ ఎయిర్ బ్యాగ్‌లు తెర్చుకోవడంతో ప్రాణాపాయం తప్పింది. కర్ణాటక మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి లక్ష్మీ హెబ్బాల్కర్, ఆమె సోదరుడు చెన్నరాజుకు గాయాలయ్యాయి. లక్ష్మీ హెబ్బాల్కర్‌కు వీపు, ముఖంపై గాయాలవగా, చెన్నరాజు తలకు స్వల్ప గాయాలయ్యారు.
వెంటనే ఈ ఇద్దరినీ సమీపంలోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఇద్దరూ చికిత్స తీసుకుంటున్నారు. బెంగళూరులో జరిగన పార్టీ సీఎల్పీ కార్యక్రమానికి హాజరై తిరిగి వెళ్తున్న క్రమంలో ఈ ప్రమాదం జరిగింది. సేఫ్టీ ఎయిర్ బ్యాగ్స్ కారణంగా ప్రాణాపాయం తప్పింది.
Also read: AAP Freebies: మహిళలకు నెలకు 2100, ఢిల్లీ ఎన్నికల్లో ఆప్ ఉచితాల వర్షం
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.