Mumbai on High Alert: ముంబయికి ఉగ్రదాడి ముప్పు- అప్రమత్తమైన పోలీసులు!

Mumbai on High Alert: ముంబయిలో ఉగ్రదాడి జరగొచ్చని నిఘా వర్గాలు సమాచారమిచ్చాయి. ఈ నేపథ్యంలో పోలీసులు అప్రమత్తమయ్యారు. సున్నితమైన ప్రాంతాల్లో భద్రతను కట్టుదిట్టం చేశారు.

Written by - ZH Telugu Desk | Edited by - ZH Telugu Desk | Last Updated : Dec 30, 2021, 11:55 PM IST
  • దేశ ఆర్థిక రాజధానికి ఉగ్ర ముప్పు
  • అప్రమత్తమైన ముంబయి పోలీసులు
  • సున్నితమైన ప్రాంతాల్లో భద్రత కట్టుదిట్టం
  • ఇప్పటికే న్యూ ఇయర్ వేడుకలపై నిషేధం
Mumbai on High Alert: ముంబయికి ఉగ్రదాడి ముప్పు- అప్రమత్తమైన పోలీసులు!

Mumbai on High Alert: ముంబయిలో హై అలర్ట్ ప్రకటించారు పోలీసులు. ఖలిస్థాన్ ఉగ్రవాదులు దాడులకు తెగబడొచ్చని నిఘా వర్గాల సమాచారం మేరకు పోలీసులంతా అప్రమత్తమయ్యారు. ఈ మేరకు వార్తా సంస్థ ఏఎన్​ఐకి ఇచ్చిన సమాచారం ప్రకారం.. నగర పోలీసులందరికి వీక్లీ ఆఫ్​, ఇతర సెలవులు రద్దు చేసినట్లు ముంబయి పోలీస్ విభాగం పేర్కొంది. శుక్రవారానికి సంబంధించి అన్ని రకాల సెలవులను రద్దు చేసినట్లు తెలిపింది. ఈ నేపథ్యంలో సెలవులో ఉన్న ప్రతి పోలీసూ తక్షణమే విధుల్లో చేరాలని (Mumbai security high alert) ఆదేశించారు పోలీస్ ఉన్నతాధికారులు.

ఉగ్ర దాడి అలర్ట్​ మేరకు.. రద్దీ ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేస్తున్నారు పోలీసులు. ముఖ్యంగా నగరంలోని ప్రధాన రైల్వే స్టేషన్లు అయిన.. ముంబయి, దాదర్​, బాంద్రా, చర్చ్​ గేట్​, సీఎస్​ఎంటీ, కుర్లాల వద్ద భారీగా బలగాలను మోహరించినట్లు ముంబయి రైల్వే కమిషనర్​ ఖైజర్ ఖలీద్​ (New Year security alert) వెల్లడించారు.

శుక్రవారం మొత్తం 3,000 మంది రైల్వే అధికారులను వేర్వేరు చోట్ల మోహరించనున్నట్లు తెలిపారు ఖలీద్​.

ఇప్పటికే 144 సెక్షన్​..

ఒమిక్రాన్ వేరియంట్​ (Omicorn fears) విజృంభణ భయాలతో మహారాష్ట ప్రభుత్వం ఇప్పటికే ముంబయి నగరంలో 144 సెక్షన్​ విధించింది. కొత్త సంవత్సర వేడుకల (New year Eve) నేపథ్యంలో కేసులు పెరగకుండా ఈ నిర్ణయం తీసుకుంది.

న్యూ ఇయర్ వేడుకలపై నిషేధం కూడా విధించింది (Ban on New Year Celebrations) ప్రభుత్వం. బహిరంగ ప్రదేశాలతో పాటు, ఇండోర్​లోనూ వేడుకలు జరపుకోవద్దని స్పష్టం చేసింది. హోటళ్లు, ఫంక్షన్ హాళ్లు, రెస్టారెట్లలో వేడుకలకు అనుమతి రద్దు చేసింది. జనవరి 7 వరకు ఈ ఆంక్షలు కొనసాగనున్నాయి.

Also read: తస్మాస్ జాగ్రత్త.. నాలుగు డోసులు తీసుకున్న మహిళకు పాజిటివ్‌! విమానం ఎక్కకుండా అడ్డుకున్న అధికారులు!!

Also read: Kalicharan Maharaj: గాంధీని చంపిన గాడ్సేకి నమస్కరిస్తున్నా.. ఆధ్యాత్మిక గురువు అనుచిత వ్యాఖ్యలు, అరెస్ట్

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News