Devineni Uma Maheswara Rao Vs Vasantha Krishna Prasad: ఆంధ్రప్రదేశ్‌లో కూటమి సర్కార్ కొలువుదీరి ఎనిమిది నెలలు దాటింది. ఈ సమయంలో మూడు పార్టీల నుంచి చాలా మంది లీడర్లకు పదవులు దక్కాయి. కానీ కృష్ణా జిల్లాకు చెందని టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి దేవినేని ఉమ మహేశ్వర రావుకు మాత్రం ఏ పోస్టు దక్కలేదు. ఇటీవల నామినేటేడ్ పోస్టుల పంపకాల్లోనూ ఆయన పేరు ఎక్కడా కనిపించలేదు. అయితే నామినేటేడ్ పోస్టు అయితే దేవినేని అర్హతకు సరిపోదనే కారణంగా ఆయనకు ఇంకా పెద్ద పదవి ఇస్తారని ప్రచారం సాగింది. కానీ ఇప్పటివరకు అలాంటి ఊసే కనిపించకపోవడంతో.. ఆయన అసంతృప్తికి బయటకు వచ్చినట్టు తెలుస్తోంది.
తాజాగా దేవినేని ఉమ సొంత పార్టీ ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్‌ను టార్గెట్ చేశారు. ట్విటర్ వేదికగా రేషన్ మాఫియాపై దేవినేని ఉమా రెచ్చిపోయారు. గత ప్రభుత్వంలో రేషన్ మాఫియా ఆగడాలు హద్దుమీరాయి.. వేల కోట్ల రూపాయ రేషన్ బియ్యాన్ని వైసీపీ నేతలు దేశం దాటించారు. ఆ కేసులు వైసీపీ నేతలను జైలుకు పంపేలా చేశాయి. ఈ ఆగడాలన్నీ గమనించిన రాష్ట్ర ప్రజలు కూటమి సర్కార్‌కు అధికారాన్ని కట్టబెట్టారు. కానీ రాష్ట్రంలో సర్కార్ మారిన రేషన్ మాఫియా దోపిడీ మాత్రం ఆగలేదని ట్వీట్ చేశారు. అంతేకాదు రెండు రోజుల క్రితం ఓ వాహనంలో పట్టుబడిన 22 క్వింటాళ్ల రేషన్ బియ్యం తాలుకూ వీడియోను సీఎం చంద్రబాబు, సివిల్ సఫ్లై మినిస్టర్ నాదెండ్ల మనోహర్‌కు ట్యాగ్ చేశారు. ఈ ట్వీట్‌తో మాజీమంత్రి దేవినేని ఉమ సొంత పార్టీ ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్‌ను టార్గెట్ చేశారని మైలవరం నియోజకవర్గంలో జోరుగా ప్రచారం జరుగుతోంది.
గతంలో ఎన్టీఆర్ జిల్లా నందిగామలో రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిచారు దేవినేని ఉమ.. ఆ తర్వాత చంద్రబాబు కేబినెట్‌లో మంత్రిగా పనిచేశారు. ఆ తర్వాత నందిగామ నియోజకవర్గం ఎస్సీకి రిజర్వ్ కావడంతో మైలవరంకు మారిపోయారు.. అక్కడ ఒకసారి ఎమ్మెల్యేగా గెలిచారు. కానీ.. గత అసెంబ్లీ ఎన్నికల్లో మైలవరంలో దేవినేని ఉమకు టికెట్ దక్కలేదు. అక్కడ వైసీపీ నుంచి టీడీపీలోకి మారిన వసంత కృష్ణ ప్రసాద్‌కు టికెట్ దక్కింది. అయితే టికెట్ త్యాగం చేసిన దేవినేని ఉమకు ప్రభుత్వంలో కీలక పోస్టు దక్కబోతుందని చాలా రోజులుగా ప్రచారం జరుగుతోంది. అయితే ఆయన పోస్టు అంశం కేవలం ప్రచారానికే పరిమితం అయ్యందన్న టాక్ ఉంది. అయితే మైలవరంలో దేవినేని ఉమకు పదవి దక్కకుండా ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ అడ్డుకుంటున్నారని నియోజకవర్గంలో టాక్ వినిపిస్తోంది.
అయితే కొద్దిరోజులుగా పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు మాజీమంత్రి దేవినేని ఉమ. ఇందుకు కారణం ఆయనకు పదవి దక్కకపోవడంంతో సైలెంట్ అయ్యారని అనుచరులు చెబుతున్నారు. ఇటీవల నందిగామలో అన్నా క్యాంటీన్ ప్రారంభోత్సవానికి దేవినేని ఉమ డుమ్మా కొట్టారు. అయితే నియోజకవర్గంలో ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్‌ను కాదని దేవినేని ఉమ రాజకీయం చేయలేని పరిస్థితి అక్కడ నెలకొందట. అందుకే ఆయన పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారట. అందుకే తనకు ఎమ్మెల్సీ పదవి ఇవ్వాలని పార్టీ అధినేతపై ఒత్తిడి పెంచే ప్రయత్నం చేస్తున్నారట. కానీ హైకమాండ్ నుంచి ఎలాంటి స్పందన లేకపోవడంతో తన అసంతృప్తిని ట్వీట్ రూపంలో వెళ్లగక్కినట్టు ప్రచారం జరుగుతోంది. మొత్తంగా ఈ ట్వీట్ తర్వాత అయినా.. పార్టీ నేతలు దేవినేనిని బుజ్జగిస్తారా.. లేక ఇలాగే వదిలేస్తారా అనేది తెలియాలంటూ మాత్రం కొద్దిరోజులుగా వేచి చూడాల్సిందే..
Also Read: School Girl Gang Rape: టీచర్లు కాదు..కీచకులు, విద్యార్థినిపై గ్యాంగ్‌రేప్ ఆలస్యంగా వెలుగు చూసిన ఘటన
Also Read: Foreign Liquor: మద్యం ప్రియులకు జాక్‌పాట్.. ఒకే దుకాణం మూడు బ్రాండ్ల మద్యం
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి