Eight year old girl dies of cardiac arrest in Gujarat: సాధారణంగా ఒకప్పుడు ఆరోగ్య సమస్యలు నలబై లేదా యాభై ఏళ్లు దాటిన వాళ్లలో ఎక్కువగా కన్పించేవి. కానీ ఇప్పుడు మాత్రం.. పరిస్థితి అందుకు పూర్తిగా భిన్నంగా మారిపోయింది. చిన్న పిల్లలు సైతం.. భయంకరమైన జబ్బుల బారిన పడుతున్నారు. ఈ క్రమంలో ఇటీవల గుండెపోటు ఘటనలు ఎక్కువయ్యాయి. చిన్న పిల్లలు సైతం.. హర్ట్ ఎటాక్ బారిన పడి చనిపోతున్నారు.
సీసీ ఫుటేజ్.. గుండెపోటుతో 8 ఏళ్ల చిన్నారి మృతి
గుజరాత్ - అహ్మదాబాద్‌లో
మూడో తరగతి విద్యార్థిని గార్గి(8) క్లాస్‌కి వెళ్తుండగా అస్వస్థతకు గురైందిఅయితే అక్కడే ఉన్న చైర్లో కూర్చున్న ఆమె అలాగే కుప్పకూలిపోయి మృతిచెందింది. pic.twitter.com/F4m2KfoJwr
— Telugu Scribe (@TeluguScribe) January 11, 2025
అప్పటి వరకు బాగానే ఉన్న వాళ్లు ఒక్కసారిగా కుప్పకూలీ పడి పోవడం ఆందోళన కల్గించే అంశంగా మారిందని చెప్పుకొవచ్చు. ఇటీవల జిమ్ చేస్తుండగా, ఆఫీసులో పనులు చేస్తు, పెళ్లిలో డ్యాన్స్ లు చేస్తు పడిపోయి, మరణించిన అనేక వీడియోలు ఎక్కువగా వార్తలలో నిలిచాయి. దీనిలో టీనేజ్ తో పాటు.. మధ్య వయస్సుల వారే ఎక్కువగా ఉన్నారు. ఈ క్రమంలో ఒక షాకింగ్ వీడియో ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్ గా మారింది. ఈ ఘటన గుజరాత్ లో చోటు చేసుకుంది.
పూర్తి వివరాలు..
గుజరాత్ లోని అహ్మదాబాద్ లోని స్థానిక పాఠశాలలో ఎనిమిదేళ్ల బాలిక హర్ట్ ఎటాక్ తో చనిపోవడం ప్రస్తుతం కలవరపెట్టె అంశంగా మారింది. గుజరాత్ లోని తల్తేజ్ ప్రాంతంలో.. జెబార్ స్కూల్ ఫర్ చిల్డ్రన్స్ లో మూడో తరగతి చదువుతున్న గార్గి రాన్ పారా అనే ఎనిమిదేళ్ల బాలిక.. ఉదయం తన స్కూల్ కు వచ్చింది. రోజులాగే.. ఆమె పాఠశాలకు వచ్చింది. కానీ కాస్తంతా ఆమెకు ఇబ్బందిగా అన్పించడంతో అక్కడున్న చేర్ లో కూర్చుంది.
కానీ ఒక్కసారిగా ఆమె చూస్తుండగా.. కుర్చీ మీద నుంచి కింద పడిపోయింది. దీంతో అక్కడున్న టీచర్ లు, సిబ్బంది దగ్గరలోని ఆస్పత్రికి తరలించారు. బాలికకు టెస్టులు చేసిన వైద్యులు.. హర్ట్ ఎటాక్ తో చనిపోయినట్లు వెల్లడించారు. దీంతో వారంతా షాక్ కు గురయ్యారు.
Read more: Viral Video: బాబోయ్.. తొండంతో ఎద్దులను దూరంగా విసిరి పారేస్తున్న ఏనుగు.. షాకింగ్ వీడియో వైరల్..
ఆ బాలిక తల్లిదండ్రులను ఓదార్చడం ఎవరి వల్ల కావడంలేదు. బాలికకు గుండె నొప్పి ఏంటని .. అక్కడి వారంతా వింతగా మాట్లాడుకుంటున్నారంట. అయితే..
బాలిక హర్ట్ ఎటాక్ కు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Facebook, Twitter