Madhya Pradesh: దివ్యాంగుల కోటాలో కలెక్టర్ జాబ్.. లేడీ అధికారిణి డ్యాన్స్‌లపై విచారణకు ఆదేశించిన ప్రభుత్వం..స్టోరీ ఏంటంటే..?

Mppsc Priyanka kadam: మధ్యప్రదేశ్ లో ఇటీవల ఒక అధికారిణి దివ్యాంగుల కోటాలో మధ్య ప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ లో ఉద్యోగం పొందింది.  ఈ ఘటనలో ప్రభుత్వం విచారణకు ఆదేశించింది.

Written by - Inamdar Paresh | Last Updated : Feb 17, 2025, 07:21 PM IST
  • తెర మీదకు మరో అధికారిణి వివాదం..
  • విచారణకు ఆదేశించిన మధ్య ప్రదేశ్..
Madhya Pradesh: దివ్యాంగుల కోటాలో కలెక్టర్ జాబ్.. లేడీ అధికారిణి డ్యాన్స్‌లపై విచారణకు ఆదేశించిన ప్రభుత్వం..స్టోరీ ఏంటంటే..?

Disabled doctor dance Priyanka kadam controversy: సాధారణంగా సమాజంలో దివ్యాంగులు ఇతరుల్లా అన్ని పనులు తమకు తాముగా చేసుకొవడంలో చాలా ఇబ్బందులు పడతారు. వీరు ప్రతిరోజు కూడా అనేక సవాళ్లను ఎదుర్కొంటు ఉంటారు. అందుకే కేంద్ర, రాష్ట్రప్రభుత్వాలు వీరికి ఉద్యోగాలు,పథకాలలో రిజర్వేషన్ లను ఏర్పాటు చేసి.. కొంత మేరకు వారికి అండగా నిలుస్తున్నాయి. అయితే.. దీన్ని కొందరు మిస్ యూజ్ చేస్తున్నారు.

కొన్నినెలల క్రితం మహారాష్ట్ర కెడర్ అధికారిణి పూజా ఖేడ్కర్ ఘటన దేశంలో సంచలనంగా మారింది. ఆమె వివాదాస్పదంగా ప్రవర్తించింది. దీంతో అధికారులు ఆమె సర్టిఫికేట్ లపై, ఉద్యోగం ఎలా పొందింది అనే అంశాలపై లోతుగా విచారణ చేపట్టారు.  ఆమె దివ్యాంగుల కోటాలో ఉద్యోగం పొందింది. దీంతో ఆమెపై విచారణ చేపట్టగా ఆమె నకిలీసర్టిఫికేట్ ల బండారం అంతా బైటపడింది. దీంతో ఆమెను ఏకంగా యూపీఎస్సీ సర్వీసు నుంచి డిబార్ చేసింది. ఈ క్రమంలో ప్రస్తుతం మరో అధికారిణి ఘటన వివాదం తెరమీదకు వచ్చింది. 

 

మ‌ధ్య‌ప్ర‌దేశ్‌లో ఇటీవ‌ల ప్రియాంక క‌దమ్ అనే మ‌హిళ .. దివ్యాంగ కోటాలో ప్ర‌భుత్వ ఉద్యోగిగా ఎంపికైంది. అయితే ఆమె ఎంపిక ప‌ట్ల విమ‌ర్శ‌లు వ‌స్తున్నాయి. ఆమె ఓ ఫంక్ష‌న్‌లో డ్యాన్స్ చేస్తున్న వీడియో ఒక‌టి వైర‌ల్ అయ్యింది. అయితే.. ఆమె కార్యక్రమంలో మాస్ స్టెప్పులు వేస్తొందని, దివ్యాంగుల కోటాలో ఆమెకు ఉద్యోగం ఎలా ఇచ్చారని, దీనిపై విచారణ చేపట్టాలని డిమాండ్ చేశారు.

మ‌ధ్య‌ప్ర‌దేశ్ ప‌బ్లిక్ స‌ర్వీస్ క‌మీష‌న్ నిర్వ‌హించిన ప‌రీక్ష‌లో ఆమె ఉత్తీర్ణురాలై ఉద్యోగం సంపాదించింది. అయితే దివ్యాంగ కోటా కింద ఆమె సెలెక్ట్ అయ్యింది. గ‌త నెల‌లో ఫ‌లితాలు ప్ర‌క‌టించ‌గా ఆమె జిల్లా ఎక్సైజ్ ఆఫీస‌ర్‌గా జాబ్ కొట్టింది. ఆమె ఇటీవల ఒక కార్యక్రమంలో చేసిన డ్యాన్స్ వైరల్ గా మారింది. దీనిపై వివాదం తలెత్తడంతో దీనిపై మధ్య ప్రదేశ్ సర్కారు విచారణకు ఆదేశించింది.

మరోవైపు అధికారిణి మాత్రం.. తన కాలికి గాయమైనట్లు ఉన్న ఎక్స్ రేలు, డాక్టర్ సర్టిఫికేట్ లను చూపిస్తుంది. 2017లో బాత్రూమ్‌లో ప‌డ‌డం వ‌ల్ల త‌న తుంటీ భాగానికి గాయ‌మైంద‌ని, ఎంఆర్ఐ స్కానింగ్‌లో త‌న‌కు ఎవాస్కూలార్ నెక్రోసిస్ ఉన్న‌ట్లు గుర్తించార‌ని స్పష్టం చేసింది.

Read more: Viral Video: ఏంటమ్మా.. రోటీలు చేసేందుకు మరెక్కడ ప్లేస్ దొరకలేదా..?.. నెట్టింట హల్ చల్ చేస్తున్న ఫన్నీ వీడియో..

ఇప్పటి వరకు నాలుగు సార్లు  సర్జరీలు జ‌రిగింద‌న్నారు. చూడ‌టానికి సాధార‌ణ మ‌హిళ‌లా ఉన్నా.. స‌ర్జ‌రీలో అమ‌ర్చిన ఇంప్లాట్స్ వ‌ల్ల తాను న‌డ‌వ‌గ‌లుగుతున్న‌ట్లు చెప్పింది. ఒక ఐదు నిమిషాలు డ్యాన్స్ చేస్తే పెద్దగా ఇబ్బంది ఉండదని.. ఎక్కువ సేపు చేయలేనని ప్రియాంక క్లారీటీ ఇచ్చారు. దీనిపై ప్రస్తుతం విచారణ కొనసాగుతుంది.

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.FacebookTwitter

Trending News