Delimitation: దేశంలో ఇప్పుడు అసెంబ్లీ, లోక్‌సభ నియోజకవర్గాల పునర్విభజనపై చర్చ జరుగుతోంది. ముఖ్యంగా లోక్‌సభ నియోజకవర్గాల పునర్విభజనతో ఉత్తరాది రాష్ట్రాలు భారీగా లబ్ది పొందనున్నాయని తెలుస్తోంది. జనాభా నియంత్రణపై దక్షిణాది రాష్ట్రాలు చూపించిన ఆసక్తి ఆ రాష్ట్రాలకు శాపంగా మారనుంది. జనాభా ప్రాతిపదికన జరిగే డీ లిమిటేషన్ కచ్చితంగా ఉత్తరాదికి మేలు చేకూర్చనుంది. ఏ రాష్ట్రాల్లో ఎన్ని సీట్లు పెరగవచ్చో చూద్దాం.
ప్రస్తుతం లోక్‌సభలో సీట్లు మొత్తం 543 ఉన్నాయి. డీ లిమిటేషన్ పూర్తయితే ఈ సంఖ్య ఏకంగా 846కు చేరుతుందనేది అంచనా. ఇందులో ఉత్తరాది రాష్ట్రాల్లో 461 సీట్లు ఉంటే దక్షిణాది రాష్ట్రాల నుంచి కేవలం 192 సీట్లే ఉంటాయి. ఒక్క ఉత్తరప్రదేశ్, బీహార్ రాష్ట్రాల సీట్లే 222 సీట్లు ఉంటాయంటే పరిస్థితి ఏంటో అర్దం చేసుకోవచ్చు. అంటే లోక్‌సభలో దక్షిణాది రాష్ట్రాల ప్రాతినిధ్యం చాలా తక్కువగా ఉంటుంది. ఉత్తరాది రాష్ట్రాలతో పోలిస్తే సగం కూడా ఉండని పరిస్థితి. అందుకే దక్షిణాది రాష్ట్రాల్లో ఇప్పుడు ఆందోళన వ్యక్తమౌతోంది.
ఏ రాష్ట్రంలో ఎన్ని సీట్లు
జమ్ము కాశ్మీర్‌లో ఎంపీల సంఖ్య 9, హిమాచల్ ప్రదేశ్‌లో 4, పంజాబ్‌లో 18, ఉత్తరాఖండ్‌లో 7, హర్యానాలో 18, ఢిల్లీలో 13, యూపీలో 143, బీహార్‌లో 79, రాజస్థాన్‌లో 50, మధ్యప్రదేశ్‌లో 52, గుజరాత్‌లో 43, జార్ఖండ్‌లో 24, ఛత్తీస్‌గఢ్‌లో 19, పశ్చిమ బెంగాల్‌లో 60, సిక్కింలో 1, అరుణాచల్ ప్రదేశ్‌లో 2, అస్సోంలో 21, నాగాలాండ్ 1, మణిపూర్ 2, మిజోరాంలో 2, త్రిపుర 2, మేఘాలయ 2, ఒడిశాలో 28, మహారాష్ట్రలో 70, ఏపీ-తెలంగాణలో 54, కర్ణాటకలో 41, తమిళనాడులో 49, పుదుచ్చేరి 1, కేరళలో 20, లక్షద్వీప్‌లో 1 , గోవాలో 2, అండమాన్ 1, దాద్రానగర్ హవేలీ 2 నియోజకవర్గాలు కానున్నాయి.
అంటే ఏపీ తెలంగాణలో ప్రస్తుతం 42 ఉంటే డీ లిమిటేషన్ తరువాత ఆ సంఖ్య మరో 12 పెరుగుతుంది. తమిళనాడులో 39 స్థానాలుంటే మరో 10 స్థానాలు పెరగనున్నాయి. ఒడిశాలో ప్రస్తుతం 21 లోక్‌సభ స్థానాలుండగా మరో 7 పెరగనున్నాయి. కర్ణాటకలో ప్రస్తుతం 28 స్థానాలుండగా డీ లిమిటేషన్ తరువాత ఆ సంఖ్య 41కు పెరగనుంది. దక్షిణాది రాష్ట్రాల్లో డీ లిమిటేషన్ తరువాత పెరిగే లోక్‌సభ స్థానాలు మొత్తం పదుల సంఖ్యలో ఉంటే ఉత్తరాదిలో మాత్రం వందల్లో పెరుగుదల కన్పిస్తోంది. అందుకే దక్షిణాది రాష్ట్రాల్లో ఆందోళన పెరుగుతోంది.
Also read: Supreme Court: క్రిమినల్ రాజకీయ నేతలకు కేంద్రం నుంచి బిగ్ రిలీఫ్, ఆరేళ్లు చాలని అఫిడవిట్
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి