Special Bonus: ప్రభుత్వ ఉద్యోగులకు బంపర్‌ గిఫ్ట్‌.. రూ.10 వేల ప్రత్యేక బోనస్‌ ప్రకటన

Govt Declares Special Bonus Of Rs 10000: ప్రభుత్వం ఉద్యోగులకు బంపర్‌ గిఫ్ట్‌ అందించింది. అత్యుత్తమ సేవలు అందించిన ఉద్యోగులకు ప్రత్యేక బోనస్‌ ప్రకటిస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. దీంతో ఉద్యోగులకు భారీ ప్రయోజనం లభించనుంది.

Written by - Ravi Kumar Sargam | Last Updated : Feb 27, 2025, 11:51 PM IST
Special Bonus: ప్రభుత్వ ఉద్యోగులకు బంపర్‌ గిఫ్ట్‌.. రూ.10 వేల ప్రత్యేక బోనస్‌ ప్రకటన

Govt Employees Special Bonus: ప్రభుత్వ ఉద్యోగులకు తీయటి కబురు ఇది. ఉద్యోగులకు రూ.10 వేల ప్రత్యేక బోనస్‌ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయంతో ఉద్యోగులకు భారీ లబ్ధి చేకూరనుంది. దేశాన్ని గర్వించేలా చేశారని.. ఎలాంటి లోటుపాట్లు లేకుండా ప్రజలందరికీ అద్భుతంగా సేవలు అందించిన ఉద్యోగులకు ప్రభుత్వం ప్రత్యేక కానుక ఇచ్చింది. అంతేకాకుండా ప్రత్యేకంగా 7 రోజుల సెలవు ఇస్తూ సంచలన నిర్ణయం తీసుకుంది. ఈ బంపర్‌ ఆఫర్‌ ఏ ఉద్యోగులకు? ఎక్కడ? అనే వివరాలు తెలుసుకుందాం.

Also Read: AP Budget: రేపే రూ.3.25 లక్షల కోట్ల బడ్జెట్? ఏపీ ఉద్యోగులకు లభించే ప్రయోజనాలు ఇవే?

ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో 45 రోజుల పాటు మహా కుంభమేళ జరిగిన విషయం తెలిసిందే. మహా శివరాత్రితో ముగిసిన కుంభమేళకు బందోబస్తు, రక్షణ దళాలు, భద్రతా సిబ్బంది ఇలా అందరూ కలిసి ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా అద్భుతంగా పని చేశారని ప్రభుత్వం ప్రశంసించింది. ఈ సందర్భంగా పోలీస్‌ శాఖతోపాటు ఇతర భద్రతా దళాలను ప్రభుత్వం అభినందించింది. అభినందనలతోపాటు రెండు బంపర్‌ ఆఫర్లు ప్రకటించారు.

Also Read: Holiday: గుడ్‌న్యూస్‌.. ఎల్లుండి ప్రభుత్వ ఉద్యోగులు, టీచర్లకు సెలవు

శక్తి వంచన లేకుండా.. క్రమశిక్షణతో విజయవంతంగా మహా కుంభమేళను ముగించిన పోలీస్‌ సిబ్బందికి ఉత్తరప్రదేశ్‌ ప్రభుత్వం రూ.10 వేలు ప్రత్యేక బోనస్‌గా ఇస్తూ ప్రకటన చేసింది. అంతేకాకుండా అవార్డులు ప్రకటించింది. ఈ విషయాలను అక్కడి ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ ప్రకటించారు. మహా కుంభమేళాలో విధులు నిర్వహించిన దాదాపు 75 వేల మంది పోలీసులకు రూ.10 వేల చొప్పున ప్రత్యేక బోనస్‌ ఇస్తున్నట్లు తెలిపారు. అంతేకాకుండా 'మహా కుంభ్‌ సేవా మెడల్‌' ఇస్తామని ప్రకటించారు.

ప్రయాగ్ రాజ్ లో 45 రోజుల పాటు సాగిన మహాకుంభమేళలో 60 కోట్ల మందికి పైగా ప్రజలు కుంభమేళాలో పుణ్యస్నానాలు ఆచరించినట్లు అధికారులు చెబుతున్నారు. ఇప్పుడే ముగియడంతో ఇంకా లెక్కలు రాలేదు. త్వరలోనే మహాకుంభ మేళకు సంబంధించి అధికారికంగా వివరాలు వెల్లడయ్యే అవకాశం ఉంది. కాగా ప్రయాగ్‌రాజ్‌లో సౌకర్యాల కల్పనకు యూపీ ప్రభుత్వం రూ.7,500 కోట్లు ఖర్చు చేసింది. దీనికి ప్రతిగా యూపీతోపాటు దేశానికి ఎంతో లాభం జరిగిందని యూపీ సీఎం యోగి తెలిపారు.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

Trending News