Atal Pension Yojana: కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న ఈ పెన్షన్ పధకం చాలా సురక్షితమైంది. అటల్ పెన్షన్ యోజన పథకం రిటైర్మెంట్ తరువాత ఆర్ధికపరమైన సెక్యూరిటీ అందిస్తుంది. ముఖ్యంగా అసంఘటిత రంగంలోని సిబ్బందికి ఇది చాలా అవసరం. ఈ పధకంలో రోజుకు కేవలం 7 రూపాయలు పెట్టబుడి ఇన్వెస్ట్ చేస్తే చాలు..జీవితాంతం 60 వేల రూపాయలు పెన్షన్ అందుకోవచ్చు.
అటల్ పెన్షన్ యోజన అనేది కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో నడుస్తున్న పధకం. ఈ పధకంలో రోజుకు 7 రూపాయలు జమ చేస్తే లైఫ్‌టైమ్ పెన్షన్ 60 వేల రూపాయలు అందుతుంది. అసంఘటిత రంగంలోని కార్మికులకు రిటైర్మెంట్ తరువాత ఆదాయం పొందేందుకు ఇది మంచి పధకం. 32 ఏళ్ల వయస్సులో నెలకు 689 రూపాయలు జమ చేస్తుంటే 60 ఏళ్ల వయస్సు వచ్చాక నెలకు 5 వేల రూపాయలు పెన్షన్ లభిస్తుంది. అదే 18 ఏళ్ల వయస్సులో ప్రారంభిస్తే రోజుకు 7 రూపాయలు అంటే నెలకు 2100 జమ చేస్తే చాలు..60 ఏళ్ల వయస్సులో నెలకు 5 వేల రూపాయలు పెన్షన్ అందుకోవచ్చు.
ఈ పధకం 2015-16లో లాంచ్ అయింది. అసంఘటిక రంగంలోని కార్మికులకు సెక్యూరిటీ అందించే ఉద్దేశ్యంతో ఈ పధకం ప్రారంభమైంది. ఈ పధకం పెన్షన్ ఫండ్ రెగ్యులేటరీ అండ్ డెవలప్‌మెంట్ అథారిటీ నిర్వహిస్తోంది. ఈ పథకంలో నెలకు 1000 నుంచి 5 వేల రూపాయలు పెన్షన్ లభిస్తుంది. ఇది కేంద్ర ప్రభుత్వం గ్యారంటీ ఇస్తున్న పధకం. ఈ పధకంలో పెట్టుబడి చాలా తక్కువ ఉంటుంది. 18 ఏళ్లకు ప్రారంభిస్తే నెలకు 210 రూపాయలు జమ చేస్తే చాలు. 60 ఏళ్లు వచ్చేసరికి నెలకు 5 వేల రూపాయలు పొందవచ్చు. అదే 32 ఏళ్ల వయస్సులో ప్రారంభిస్తే నెలకు 689 రూపాయలు జమ చేయాలి. అదే 40 ఏళ్ల వయస్సులో ప్రారంభిస్తే నెలకు 1454 రూపాయలు జమ చేయాలి.
ఈ పధకంలో ప్రభుత్వం నుంచి కూడా వాటా ఉంటుంది. ఏడాదికి 1000 రూపాయలు లేదా మీరు డిపాజిట్ చేసే మొత్తంలో 50 శాతం ప్రభుత్వం జమ చేస్తుంది. ట్యాక్స్ పేయర్లకు ఇది వర్తించదు. ఈ పధకంలో జాయిన్ అయ్యేందుకు వయస్సు 18 నుంచి 40 ఏళ్లుండాలి. ఒకసారి ఈ పధకంలో చేరితే 60 ఏళ్ల వరకు ప్రతి నెలా కంట్రిబ్యూట్ చేయాల్సి ఉంటుంది. ఆ తరువాత అంటే మీ రిటైర్మెంట్ తరువాత నెలకు 5 వేల రూపాయలు పెన్షన్ అందుతుంది.
Also read: Heavy Rains Alert: ఏపీకు బిగ్ అలర్ట్, ప్రభుత్వ యంత్రాంగం అప్రమత్తం, ఈ జిల్లాల్లో అతి భారీ వర్షాలు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.