Discount On Liquor: కరోనా టీకాను విస్తృతంగా పంపిణీ చేసేందుకు ప్రభుత్వాలు అన్ని విధాలా ప్రయత్నిస్తున్నా.. అనేక చోట్ల ప్రజలు టీకా తీసుకునేందుకు ఇంకా ఆసక్తి చూపడం లేదు. చాలామంది ఒక డోసు టీకాకే పరిమితమయ్యారు. ఈ నేపథ్యంలో రెండో డోసు తీసుకున్న వారికి మద్యం సీసాలపై 10 శాతం డిస్కౌంట్ ఇస్తామంటూ మధ్యప్రదేశ్ మందసుర్ జిల్లా అధికారులు ఆఫర్ చేస్తున్నారు.
బుధవారం (నవంబరు 24) రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వం భారీ ఎత్తున టీకా పంపిణీ కార్యక్రమం చేపట్టనుంది. ఈ సందర్భంగా ఎక్కువమంది రెండో డోసు తీసుకునేలా అధికారులు చర్యలు చేపడుతున్నారు. తాము ప్రకటించిన ఆఫర్‌కు మంచి స్పందన లభిస్తే భవిష్యత్తులో రాష్ట్రంలోని మిగతా జిల్లాల్లో కూడా దీనిని అమలు చేస్తామని మందసుర్ జిల్లా ఎక్సైజ్ ఆఫీసర్ అనిల్ సచిన్ వెల్లడించారు.
అధికారుల ప్రతిపాదనను మందసుర్ బీజేపీ ఎమ్మెల్యే యశ్పాల్ సింగ్ తప్పుపట్టారు. ఇది ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం కాదని.. దీని వల్ల మద్యం వినియోగాన్ని మరింత ప్రోత్సహించినట్టు అవుతుందని అభిప్రాయపడ్డారు. ఇదే విషయాన్ని బీజేపీ ఎమ్మెల్యే ట్వీట్ చేశారు.
Also Read:FIR Against Kangana Ranaut: మరో వివాదంలో కంగనా రనౌత్.. ముంబయిలో ఆమెపై కేసు నమోదు
Also Read: త్వరలో తగ్గనున్న ఇంధన ధరలు, చమురు నిల్వలు తీసేందుకు కేంద్రం నిర్ణయం
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook