Vitamin D Deficiency: శరీరంలో పోషకాలు పూర్తిగా ఉండేట్టు చూసుకోవాలి. విటమిన్లు, మినరల్స్ లోపం గురించి చాలామంది పసిగట్టలేరు. కొన్ని లక్షణాల ద్వారా విటమిన్ల లోపాన్ని సులభంగా పసిగట్టవచ్చు. ఇందులో అతి ముఖ్యమైంది విటమిన్ డి. విటమిన్ డి అనేది శరీరానికి అత్యవసరమైన విటమిన్లలో కీలకమైంది. ఇది లేకుండా కాల్షియం సంగ్రహణే ఉండదు.
శరీరంలో విటమిన్ డి కారణంగా ఎముకలకు బలం చేకూరుతుంది. జన్యువులు, కణాల ఎదుగుదలను నియంత్రించడంతో పాటు రికెట్స్ , ఆస్టియోపోరోసిస్ వంటి వ్యాధుల్ని తగ్గించడం, ఇమ్యూనిటీ వ్యవస్థను మెరుగుపర్చడంలో విటమిన్ డి దోహదపడుతుంది. ముఖ్యంగా చలికాలంలో శరీరంలో ఇమ్యూనిటీ తగ్గడం వల్ల వివిధ రకాల వ్యాధులు చుట్టుముడుతుంటాయి. చలికాలంలో చలికి భయపడి బయటకు రాకుండా ఉంటుంటారు. దాంతో సూర్యరశ్మి నుంచి పెద్దఎత్తున లభించే విటమిన్ డి దక్కదు. విటమిన్ డికు బెస్ట్ సోర్స్ సూర్యరశ్మి ఒక్కటే. రోజుకు కనీసం 20-30 నిమిషాలుంటే చాలు శరీరానికి కావల్సినంత విటమిన్ డి లభిస్తుంది. సూర్యరశ్మి కాకుండా ఫ్యాటీ ఫిష్, యానిమల్ లివర్, గుడ్లు, పాలు, బాదం పాలు, సోయా మిల్క్, ఆరెంజ్ జ్యూస్‌లో కావల్సినంత విటమిన్ డి దొరుకుతుంది.
విటమిన్ డి అనేది కేవలం ఎముకల పటిష్టత, కాల్షియం సంగ్రహణకే కాకుండా ఒత్తిడి, ఆందోళన తగ్గించేందుకు అద్భుతంగా ఉపయోగపడుతుంది. ప్రపంచవ్యాప్తంగా సూర్యోదయం జరగని దేశాల్లో ఎక్కువగా విటమిన్ డి కోసం ఆహార పదార్ధాలనే ఆశ్రయిస్తుంటారు. శరీరంలో ఇమ్యూనిటీ రోగ నిరోధక శక్తిని పటిష్టం చేస్తుంది. జలుబు, దగ్గు, జ్వరం వంటి వైరల్ వ్యాధుల ముప్పు తగ్గిస్తుంది. విటమిన్ డి అనేది కన్పించని ఎన్నో వ్యాధుల్ని నయం చేస్తుంది. విటమిన్ డి కావల్సినంతగా లేకపోతే కీళ్ల నొప్పులు పెరుగుతాయి. రోజూ ఉదయం వేళ ఎండలో ఉంటే విటమిన్ డి లోపం తలెత్తదు.
విటమిన్ డి లోపముంటే శరీరంలో కండరాలు, ఎముకలు బలహీనపడతాయి. ఎందుకంటే మనం తీసుకునే ఆహారంలో లభించే కాల్షియం సంగ్రహణ తగ్గిపోతుంది. దాంతో ఎముకలు బలహీనమౌతుంటాయి. అంతేకాకుండా అకారణంగా అలసట తలెత్తుతుంది. ఎముకలు పటిష్టం చేసుకునేందుకు కాల్షియం సంగ్రహణ ఉండాల్సిందే.
Also read: EPFO Big Decision: పీఎఫ్ సభ్యులకు గుడ్‌న్యూస్, ఇక నుంచి అదనపు వడ్డీ
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.