Strawberry: ఈ ఎర్ర పండు ఆరోగ్యానికి మాత్రమే కాదు.. అందానికి కూడా బోలెడు ప్రయోజనాలు

Strawbberry Benefit: స్ట్రాబెర్రీ పండ్లు రుచిగా ఉంటాయి ఎరుపు రంగులో ఉండే ఈ పండ్లలో ఆరోగ్య ప్రయోజనాలు పుష్కలం. ఇది ఆరోగ్యానికి మాత్రమే కాకుండా అందానికి కూడా లాభాలు తెచ్చి పెడుతుంది. స్ట్రాబెర్రీ పండ్లు డైట్ లో చేర్చుకోవడం వల్ల కలిగే ప్రయోజనాలు తెలుసుకుందాం

Written by - Renuka Godugu | Last Updated : Feb 15, 2025, 11:53 AM IST
Strawberry: ఈ ఎర్ర పండు ఆరోగ్యానికి మాత్రమే కాదు.. అందానికి కూడా బోలెడు ప్రయోజనాలు

Strawbberry Benefit: స్ట్రాబెర్రీ పండ్లలో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. ఇమ్యూనిటీ వ్యవస్థను బలపరుస్తుంది. వీటిని డైట్ లో చేర్చుకోవడం వల్ల ఆరోగ్యానికి ప్రయోజనాలు మెండు.. ఇది సీజనల్ జబ్బులకు చెక్ పెడుతుంది. స్ట్రాబెర్రీ పండ్లు తీసుకోవడం వల్ల అందానికి ఆరోగ్యానికి చేసే మేలు తెలుసుకుందాం..

చర్మ ఆరోగ్యం..
స్ట్రాబెర్రీ పండ్లు డైట్లో చేర్చుకోవడం వల్ల చర్మ ఆరోగ్యానికి మేలు చేస్తుంది. ఇందులో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. విటమిన్ సి, ఎలిజిక్ యాసిడ్ కూడా ఉంటుంది.. ఇది ఫ్రీ రాడికల్ డామేజ్ కాకుండా కాపాడుతుంది. వృద్ధాప్య ఛాయలు త్వరగా రాకుండా నివారిస్తుంది. రెగ్యులర్‌గా స్ట్రాబెర్రీ పండ్లు తీసుకోవడం వల్ల మీ చర్మం యవ్వనంగా కనిపిస్తుంది. ముఖంపై ఉండే గీతలు కూడా తొలగిపోతాయి.

స్ట్రాబెర్రీలో ఉండే విటమిన్ సి ఇమ్యూనిటీ వ్యవస్థను బలపరుస్తుంది. ఇది పవర్‌ఫుల్‌ యాంటీ ఆక్సిడెంట్ ఇన్ఫెక్షన్ సమస్యలను దరచేరనివ్వదు. త్వరగా జబ్బులు నయం అయ్యేలా ప్రేరేపిస్తుంది. అంతేకాదు ఇందులో యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు కూడా కలిగి ఉండటం వల్ల ఇది ఇన్‌ఫ్లమేషన్‌ సమస్యను తగ్గిస్తుంది. ఆర్థరైటిస్, చర్మ సమస్యలను నివారిస్తుంది.

స్ట్రాబెర్రీ పండ్లు డైట్లో చేర్చుకోవడం వల్ల బరువు నిర్వహిస్తుంది ఇందులో నీటి శాతం అధికంగా ఉంటుంది. స్నాక్ రూపంలో తీసుకోవడం వల్ల అతిగా తినకుండా ఉంటారు.. ఇది కడుపునిండా అనుభూతిని ఎక్కువ సమయం పాటు కలిగిస్తుంది. దీంతో అనారోగ్య ఫుడ్స్ తినకుండా ఉంటారు. కేలరీలు తక్కువగా ఉంటాయి.. షుగర్ కూడా తక్కువ మోతాదులో ఉంటుంది.

స్ట్రాబెర్రీ పండు తరచుగా తీసుకోవడం వల్ల ఇందులోని ఫ్లేవనాయిడ్స్ గుండె ఆరోగ్యానికి మేలు చేస్తుంది. ఇది కొలెస్ట్రాల్ లెవెల్స్ ని తగ్గించి బ్లడ్ ప్రెషర్ ని అదుపులో ఉంచుతుంది. దీంతో కార్డియో సమస్యలను దరిచేరకుండా ఉంటాయి.

 స్ట్రాబెరీ పనులు తినడం వల్ల ఇందులోని ఫైబర్ ఆరోగ్యానికి మేలు చేస్తాయి. తరచూ డైట్లో చేర్చుకోవడం వల్ల పేగు ఆరోగ్యానికి తోడ్పడుతుంది.. దీర్ఘకాలిక మలబద్ధక సమస్యకు కూడా స్ట్రాబెరీ పండు ఎఫెక్టివ్ రెమిడీ.

ఇదీ చదవండి: ద్రాక్ష మీ బ్యూటీ రొటీన్‌లో ఉందా? మీకు నిత్యయవ్వనం.. మచ్చలేని అందం..

స్ట్రాబెర్రీ పండ్లు రెగ్యులర్ గా చేర్చుకోవడం వల్ల ఇందులోని సహజసిద్ధమైన యాసిడ్ గుణాలు కలిగి ఉంటుంది.స్ట్రాబెర్రీ పల్ప్ తీసి ముఖానికి అప్లై చేయడం వల్ల మీకు ముఖం కాంతివంతంగా మారుతుంది.. జీవం లేని చర్మానికి పునరజ్జీవనం అందిస్తుంది. దీంతో మీ చర్మం ఆరోగ్యంగా మెరుస్తూ కనిపిస్తుంది.

స్ట్రాబెర్రీ పండ్లలో 90% పైగా నీరు కలిగి ఉంటుంది ఇది మన శరీరానికి కావాల్సిన హైడ్రేషన్ అందిస్తుంది. ముఖ్యంగా ఎండాకాలం స్ట్రాబెరీ పనులను తీసుకోవాలి లేదా వర్కౌట్ చేసిన తర్వాత కూడా స్ట్రాబెర్రీ పండ్లను స్నాక్ రూపంలో తీసుకోవడం వల్ల మంచి ఫలితాలు కలుగుతాయి..

ఇదీ చదవండి: బామ్మ చెప్పిన సీక్రెట్‌.. ఇలా చేస్తే జుట్టు వేగంగా, ఒత్తుగా పెరుగుతుంది..!

స్ట్రాబెర్రీ పండ్లలో బయోటిన్ కూడా ఉంటుంది. ఇందులో విటమిన్స్, మినరల్స్ పుష్కలంగా ఉంటాయి. ఇది జుట్టు పెరుగుదలకు బలపరచడానికి కూడా తోడ్పడుతుంది. దీంతో తరచుగా తీసుకోవడం వల్ల చర్మ కణాలు కూడా ఆరోగ్యంగా ఉంటాయి.
 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.FacebookTwitter

Trending News