Fruits Timings: పండ్లు ఆరోగ్యానికి చాలా మంచివి. మనిషికి కావల్సిన పోషక పదార్ధాలు పుష్కలంగా ఉంటాయి. అయితే కొన్ని రకాల పండ్లు తినేందుకు నిర్ధిష్ట సమయం తప్పకుండా ఉంటుంది. ఆ వివరాలు పరిశీలిద్దాం
యాపిల్ ఎ డే..కీప్స్ డాక్టర్ ఎవే. యాపిల్స్ గురించి తరచూ ప్రతి ఒక్కరూ చెప్పే మాట. నిజమే. ఇందులో సందేహం లేదు. అయితే నిర్ధిష్ట సమయం ఉందంటున్నారు ఆరోగ్య నిపుణులు. రాత్రిపూట మాత్రం యాపిల్ తినకూడదని చెబుతున్నారు. రాత్రి వేళల్లో తినడం వల్ల జీర్ణ వ్యవస్థలో సమస్యలేర్పడతాయి. ఇందులో ఉండే ఫైబర్ కారణంగా..తిన్న వెంటనే పడుకోవడం వల్ల గ్యాస్ లేదా ఎసిడిటీ తలెత్తవచ్చు.
ఇక రాత్రి పూట తినకూడని మరో పండు సపోటా. సపోటా అనేది సహజంగానే మధుమేహ వ్యాధిగ్రస్థులు తినకూడదు. ఇందులో షుగర్ కంటెంట్ అధికంగా ఉంటుంది. అటువంటిది రాత్రి సమయాల్లో సపోటా తింటే..రక్తంలో బ్లడ్ షుగర్ లెవెల్స్ అధికమౌతాయి. డయాబెటిస్ రోగులైతే మొత్తానికి సపోటా దూరంగా పెట్టాల్సి ఉంటుంది.
ఇక సాధారణంగా చాలామంది ఇష్టంగా తినే అరటి పండ్లు. హై ప్రోటీన్ ఫ్రూట్ ఇది. ఆరోగ్యానికి చాలా మంచిది. చాలామంది రాత్రి పడుకునే ముందు తింటుంటారు. ఇది ఏ మాత్రం మంచి అలవాటు కాదంటున్నారు నిపుణులు. రాత్రి సమయంలో అరటిపండు ఏ రూపంలో తీసుకున్నా..ఒంట్లో వేడి పెరుగుతుందని..ఫలితంగా నిద్ర పట్టదంటున్నారు. అందుకే సాధ్యమైనంతవరకూ కొన్ని రకాల పండ్లను రాత్రి పూట తినకూడటమే మంచిది.
Also read: Weight Loss Drinks At Home: లెమన్ వాటర్‌ను తాగుతున్నారా..అయితే ఈ ప్రయోజనాన్ని తెలుసుకోండి..!!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook