టొమాటో వినియోగం అనేది దేశంలో చాలా ఎక్కువ. దాదాపు ప్రతి కూరలోనూ విరివిగా ఉపయోగిస్తుంటారు. టొమాటో ఎరుపు, పచ్చ రంగుల్లో ఉంటాయి. ఇందులో గ్రీన్ కలర్ టొమాటో ఆరోగ్యానికి చాలా మంచిది. ఆ వివరాలు మీ కోసం..
గ్రీన్ టొమాటోలో విటమిన్లు, యాంటీ ఆక్సిడెంట్లు, కాల్షియం, పొటాషియం, ప్రోటీన్లు, మెగ్నీషియం, ఫాస్పరస్ వంటి న్యూట్రియంట్లు పెద్ద మొత్తంలో ఉంటాయి. ఇవి ఆరోగ్యానికి చాలా మంచివి. గ్రీన్ టొమాటోలో బీటా కెరోటిన్, విటమిన్ ఎ ఉంటాయి. ఇవి కంటి వెలుగును పెంచుతాయి. గ్రీన్ టొమాటోను చట్నీ లేదా సలాడ్ రూపంలో రోజూ తీసుకుంటే కంటి వెలుగు మెరుగవుతుంది.
గ్రీన్ టొమాటో చర్మానికి చాలా ప్రయోజనం చేకూరుస్తుంది. ఇందులో విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. చర్మ కణాల్నియాక్టివ్ చేస్తాయి. గ్రీన్ టొమాటో తినడం వల్ల చర్మంపై ముడతల సమస్య పోతుంది. చర్మం మరింత అందంగా తయారవుతుంది.
గ్రీన్ టొమాటోలో విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా లభించడం వల్ల ఇవి క్రమం తప్పకుండా తీసుకుంటే ఇమ్యూనిటీ పెరుగుతుంది. గ్రీన్ టొమాటో తినడం వల్ల జలుబు, దగ్గు వంటి సమస్యల్నించి ఉపశమనం పొందవచ్చు. అంటువ్యాధుల ముప్పు తొలగిపోతుంది. గ్రీన్ టొమాటో తినడం వల్ల రక్తపోటు నియంత్రణలో ఉంటుంది. ఇందులో పొటాషియం తగిన మోతాదులో ఉండటం వల్ల రక్తపోటు నియంత్రణలో ఉంటుంది. బ్లడ్ ప్రెషర్ నియంత్రణలో ఉందంటే..గుండెవ్యాధుల ముప్పు తగ్గినట్టే.
గ్రీన్ టొమాటోలో ఉండే పోషక పదార్ధాలు బ్లడ్ క్లాటింగ్‌కు దోహదపడతాయి. ఇందులో విటమిన్ కే కారణంగా రక్తం క్లాట్ అవుతుంది. అంటే ఏదైనా గాయం తగిలినప్పుడు రక్తం అదే పనిగా వృధా పోకుండా నియంత్రితమవుతుంది.
Also read: Potato Juice: రోజూ క్రమం తప్పకుండా తాగితే నెలల వ్యవధిలో గంభీరమైన వ్యాధులు కూడా మాయం
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook