White Hair Treatment: 40 నుండు 45 సంవత్సరాల వయస్సులో వెంట్రుకలు తెల్లబడడం పెద్ద సమస్య కాదు. కానీ, ఈ మధ్య కాలంలో వృద్దులకు మాత్రమే కాకుండా.. యువతలో కూడా ఎక్కువగా తెల్ల జుట్టు వస్తుంది. నిజానికి మన జుట్టులో మెలనిన్ అనే పిగ్మెంట్ ఉంటుంది. ఇది వయస్సు పెరిగే కొలది తగ్గుతూ వస్తుంది. దీని తగ్గుదల వల్లనే.. జుట్టు సమస్యలు ప్రారంభం అవుతాయి. ప్రస్తుతం మనం అనుసరిస్తున్న ఆహారపు అలవాట్లు మరియు జీవన శైలి జుట్టుకు తీవ్ర నష్టాన్ని కలిగిస్తాయి.
చిన్న వయసులో తెల్ల జుట్టు రాకుండా ఉండాలంటే కొన్ని రకాలా ఆహార పదార్థాలను మన డైట్ లో చేర్చుకోవాలి. ముఖ్యంగా పచ్చని ఆకుకూరలు పక్కాగా మన ఆహారంలో ఉండాల్సిందే. ఇక్కడ తెలిపిన ఆకుపచ్చని ఆకుకూరలు మరియు కూరగాయలు తెల్ల జుట్టు రాకుండా చూడటమే కాకుండా.. ఆరోగ్యాన్ని పెంపొందిస్తాయి.
బ్రోకలీ
బ్రోకలీ వలన చాలా రకాల ఆరోగ్య సమస్యలు తగ్గుతాయి. ముఖ్యంగా ఇందులో ఉండే ఫోలిక్ యాసిడ్ జుట్టు తొందరగా తెల్లబడటాన్ని నివారిస్తుంది. బ్రోకలీలో ఫోలిక్ యాసిడ్ పుష్కలంగా ఉంటుంది. అందుకోసమే మీరు అనుసరించే డైట్ లో బ్రోకలీ తప్పకుండా ఉంటాలి.
కరివేపాకు
దాదాపు మనం వండుకునే వంటల్లో కరివేపాకు తప్పక ఉంటుంది. కరివేపాకులో ఫోలిక్ ఆసిడ్ మరియు ఐరన్ అధిక మొత్తంలో ఉంటాయి. కావున రోజు కరివేపాకును తింటే తెల్ల జుట్టు సహజంగా నల్లగా మారుతుంది.
Also Read: Samantha Pet Dog: నాగచైతన్య దగ్గర సమంత పెట్ డాగ్ ఉందేంటి? వాళ్లిద్దరూ కలిసిపోయారా..?
ఆకుకూరలు
ఆకుకూరలు చాలా రకాలుగా ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి. వైద్యులు కూడా చాలా మందికి పచ్చని ఆకుకూరలు డైట్ లో చేర్చుకోవాలని సలహా ఇస్తుంటారు. ఆకుకూరల్లో ఫోలిక్ ఆసిడ్ మూలకం పుష్కలంగా ఉంటుంది. దీని వలన జుట్టు తొందరగా తెల్లబడే ప్రక్రియ ఆలస్యం అవుతుంది. కావున మనం రోజు అనుసరించే డైట్ లో పాలకూర, మెంతి మరియు కొత్తిమీర వంటివి జోడించాలి.
ఐరన్ & కాపర్ ఆహారాలు
జుట్టు ఆరోగ్యంగా ఉండాలంటే ఐరన్ మరియు కాపర్ మూలకాలు తప్పక అవసరం. ఐరన్ & కాపర్ మూలకాలు తగిన స్థాయిలో లేకపోవటం వలన జుట్టు త్వరగా తెల్లబడుతుంది. ఐరన్ & కాపర్ అధికంగా ఉండే.. పుట్టగొడుగులు, బంగాళదుంపలు మరియు వాల్ నట్స్ వంటి వాటిని రోజు అనుసరించే డైట్ లో చేర్చుకోవాలి.
బ్లూ బెర్రీస్
జుట్టు ఆరోగ్యంగా ఉండటానికి సరైన మొత్తంలో జింక్, అయోడిన్ వంటి మూలకాలు అవసరం. షరీరంలో వీటి కొరత వలన కూడా జుట్టు త్వరగా తెల్లబడుతుంది. కావున ఈ మూలకాలను అధికంగా కలిగి ఉండే బ్లూ బెర్రీస్ డైట్ లో చేర్చుకోవాలి. బ్లూ బెర్రీస్ లో జింక్, అయోడిన్ తో పాటు విటమిన్ B12 కూడా పుష్కలంగా ఉంటుంది.
Also Read: Health Care: పాదాలు, అరికాళ్లు మండుతుంటే...రోజూ ఈ డ్రింక్ తాగితే చాలు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook