Weight Loss Healthy Tips: అధిక బరువు అనేక ఆరోగ్య సమస్యలకు దారితీస్తుంది వీటిలో డయాబెటిస్, హృదయ వ్యాధులు, అధిక రక్తపోటు, కీళ్ల నొప్పులు ఉన్నాయి. సోషల్ మీడియా , ఇంటర్నెట్లో బరువు తగ్గించే లడ్డుల గురించి అనేక రకాల వంటకాలు ప్రచారాలు కనిపిస్తాయి. ఈ లడ్డులు సాధారారణంగా వివిధ రకాల గింజలు, పప్పులు ఇతర పదార్థాలతో తయారు చేస్తారు. అవి ఆరోగ్యకరమైన పదార్థాలతో తయారు చేస్తారు బరువు తగ్గడానికి ఇవి ఒక అద్భుతమైన పరిష్కారం అని ఆరోగ్యనిపుణులు చెబుతున్నారు.
బరువు తగ్గడం అనేది కేవలం ఏదో ఒక ఆహారాన్ని తినడం ద్వారా సాధ్యం కాదు. బరువు తగ్గడానికి సమతుల్య ఆహారం, రెగ్యులర్ వ్యాయామం, ఆరోగ్యకరమైన జీవనశైలి అవసరం. ఏ ఆహారమైనా అధికంగా తీసుకుంటే బరువు పెరుగుతుంది. లడ్డులు ఆరోగ్యకరమైన పదార్థాలతో తయారు చేసినప్పటికి అధికంగా తీసుకుంటే కేలరీలు అధికంగా అవుతాయి. బరువు తగ్గడానికి ముందు వైద్యుడిని సంప్రదించడం చాలా ముఖ్యం. వారు మీ శరీర ద్రవ్యరాశి సూచిక (BMI)ని కొలిచి, మీకు సరైన ఆహారం, వ్యాయామం గురించి సలహా ఇస్తారు.
కావల్సిన పదార్థాలు:
ఒక కప్పు- నువ్వులు
పావు కప్పు- అవిసె గింజలు
రెండు టేబుల్ స్పూన్స్- గుమ్మడి గింజలు
రెండు టేబుల్ స్పూన్స్ - బాదం
రెండు టేబుల్ స్పూన్స్- పిస్తా
రెండు టేబుల్ స్పూన్స్- జీడిపప్పు
ఒక టీ స్పూన్ - సోంపు గింజలు
మూడు - యాలకులు
రెండు టేబుల్ స్పూన్స్- పల్లీలు
పావు కప్పు- బెల్లం
ఒక కప్పు-ఖర్జూర పండ్లు
తయారీ విధానం:
ఒక కళాయిని తీసుకుని నువ్వులు వేయించుకోవాలి ఆ తరువాత పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు ఇందులోకి బెల్లం తురుము, ఖర్జూరం పండ్లు, ఇతర పైన తెలిపిన పదార్థాలు వేయించుకోవాలి. ఇవి చల్లారిన తరువాత ఒక జార్‌లోకి తీసుకోని మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు ఈ పొడిని లడ్డూలుగా చుట్టుకోవాలి. ఇలా తయారు చేసిన లడ్డు ప్రతిరోజు తినడం వల్ల ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. బరువు తగ్గాలని అనుకొనే వారు ప్రతిరోజు తినడం వల్ల సులువుగా రెండు కిలోల బరువు తగ్గుతారు. కేవలం బరువు మాత్రమే కాకుండా వివిధ రకాలు అనారోగ్య సమస్యలను కూడా తగ్గిస్తాయి. కాబట్టి ప్రతిరోజు ఒక లడ్డు తినడం వల్ల ఆరోగ్యానికి మేలు కలుగుతుంది.
Disclaimer: ఈ సమాచారం కేవలం సాధారణ సమాచారం కోసం మాత్రమే. ఏదైనా ఆరోగ్య సమస్య కోసం వైద్యుడిని సంప్రదించండి.
Read more: KTR Case: నేను సాదాసీదా వ్యక్తి కాదు.. కొండా సురేఖను శిక్షించాల్సిందే: కోర్టులో కేటీఆర్
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.