Black Rice For Diabetes: ప్రపంచవ్యాప్తంగా అన్నాన్ని ఎక్కువగా భారతీయులే తింటారు. అంతేకాకుండా ప్రపంచ వ్యాప్తంగా మధుమేహంతో బాధపడేవారి సంఖ్య ఎక్కువగా భారత్‌లో ఉంది. కాబట్టి మధుమేహంతో బాధపడుతున్నవారు ఎక్కువగా తెల్ల బియ్యంలో తయారు చేసిన ఆహారాలు తింటున్నారు. ఇందులో స్టార్చ్ అధిక పరిమాణంలో లభిస్తుంది. కాబట్టి ఆహారంలో ఎక్కువగా అన్నాన్ని తీసుకోవడం వల్ల రక్తంలో చక్కెర పరిమాణాలు క్రమంగా పెరుగుతాయి. కాబట్టి రక్తంలో చక్కెర పరిమాణాలను అదుపులో ఉంచుకోవడానికి ఈ పలు రకాల చిట్కాలు పాటించాల్సి ఉంటుంది.
బ్రౌన్ రైస్ తీసుకోవచ్చా?:
డయాబెటిస్ సమస్యలతో బాధపడుతున్నవారు తప్పకుండా వైట్ రైస్‌కి బదులుగా బ్రౌన్ రైస్ తీసుకోవచ్చని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. అంతేకాకుండా ప్రస్తుతం మార్కెట్లో బ్లాక్ రైస్ కూడా అందుబాటులో ఉన్నాయి. వీటిని తీసుకోవడం వల్ల కూడా సులభంగా రక్తంలో చక్కెర పరిమాణాలు కూడా నియంత్రణలో ఉంటాయి. బ్లాక్ రైస్ లో ఫైబర్, ఐరన్, ప్రొటీన్లు, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా లభిస్తాయి. కాబట్టి వీటిని క్రమం మధుమేహంతో బాధపడుతున్నవారు ఆహారంగా తీసుకోవడం వల్ల శరీరానికి చాలా రకాల ప్రయోజనాలు కలుగుతాయి.
బ్రౌన్ రైస్ ప్రయోజనాలు:
మధుమేహం:
ప్రతి రోజు రక్తంలో చక్కెర పరిమాణాలు క్రమంగా పెరిగితే తప్పకుండా వైట్ రైస్‌కు బదులుగా బ్లాక్ రైస్ తీసుకోవాల్సి ఉంటుంది. ఇందులో ఉండే ఫైబర్ మధుమేహంతో బాధపడుతున్నవారికి ప్రభావంతంగా సహాయపడుతుందని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు.
కొలెస్ట్రాల్:
శరీరంలో కొలెస్ట్రాల్ పరిమాణాలు అతిగా పెరగడం కారణంగా తీవ్ర అనారోగ్య సమస్యలు వస్తాయి. దీని కారణంగా గుండెపోటు, తీవ్ర దీర్ఘకాలిక వ్యాధులు కూడా వస్తాయి. కాబట్టి కొలెస్ట్రాల్ నియంత్రించుకోవడానికి క్రమం తప్పకుండా బ్లాక్ రైస్‌ను ఆహారంలో తీసుకోవాల్సి ఉంటుంది.
మలబద్ధకం:
మలబద్ధకం సమస్యలను తగ్గించడానికి కూడా బ్లాక్ రైస్ ప్రభావంతంగా సహాయపడుతుందని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. ఇందులో ఉండే ఫైబర్ మలబద్ధకం, జీర్ణక్రియ సమస్యలను తగ్గించేందుకు కీలక పాత్ర పోషిస్తుంది. అంతేకాకుండా మలబద్ధకం, గ్యాస్ సమస్యలను తగ్గించేందుకు కూడా సహాయపడుతుంది.
(నోట్: ఇక్కడ ఇవ్వబడిన సమాచారం ఇంటి నివారణలు, సాధారణ సమాచారంపై ఆధారపడి ఉంటుంది. దానిని స్వీకరించే ముందు తప్పనిసరిగా వైద్య సలహా తీసుకోవాలి. ZEE NEWS దానిని ధృవీకరించలేదు.)
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి