Black Pepper: నల్ల మిరియాలు ఇలా తిన్నారంటే వారంలో బరువు తగ్గిపోతారు.. నమ్మలేని ఈ ఆరోగ్య ప్రయోజనాలు కూడా..

Black Pepper Health Benefits: నల్లమిరియాలు గత ఎన్నో ఏళ్లుగా వంటల్లో వినియోగిస్తున్నారు. ఇందులో ఔషధ గుణాలు కూడా పుష్కలంగా ఉంటాయి. కొన్ని వంటల్లో కూడా నల్లమిరియాలు వేసుకుని తింటాం. అయితే, నల్ల మిరియాలు తీసుకోవడం వల్ల ఆరోగ్యం మాత్రమే కాదు అందంపరంగా కూడా అనేక లాభాలు అవేంటో తెలుసుకుందాం...

Written by - Renuka Godugu | Last Updated : Feb 10, 2025, 07:52 AM IST
Black Pepper: నల్ల మిరియాలు ఇలా తిన్నారంటే వారంలో బరువు తగ్గిపోతారు.. నమ్మలేని ఈ ఆరోగ్య ప్రయోజనాలు కూడా..

Black Pepper Health Benefits: నల్ల మిరియాలను 'కింగ్ ఆఫ్ స్పైస్‌' అని కూడా పిలుస్తారు. ఇందులో అద్భుత పోషకాలు ఉంటాయి.. అనేక ఆరోగ్య ప్రయోజనాలు కలిగిస్తాయి. నల్ల మిరియాలు మన డైట్ లో చేర్చుకోవడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు తెలుసుకుందాం..

 నల్ల మిరియాలు డైట్ లో చేర్చుకోవడం వల్ల మన జీర్ణ ఆరోగ్యం మెరుగుపడుతుంది. జీర్ణ ఎంజైమ్‌ల ఉత్పత్తికి తోడ్పడుతుంది. ఖనిజాలు గ్రహించేలా ప్రేరేపిస్తుంది. నల్ల మిరియాలు తినడం వల్ల కడుపులో గ్యాస్, అజీర్తి, జీర్ణ సమస్యలు మాయం అవుతాయి. ఇది జీర్ణ సమస్యలకు న్యాచురల్ రెమిడీ అని చెప్పొచ్చు.

నల్ల మిరియాలు యాంటీ ఆక్సిడెంట్లు కూడా పుష్కలంగా ఉంటాయి. దీని వల్ల ఆక్సిడేటివ్ స్ట్రెస్ రాకుండా ఇది కణాలకు రక్షణ కవచంల కాపాడుతుంది. ఫ్రీ రాడికల్ డామేజ్ కాకుండా నివారిస్తుంది. నల్ల మిరియాల తినడం వల్ల ప్రాణాంతక గుండె, క్యాన్సర్ వ్యాధులకు వ్యతిరేకంగా పోరాడుతుంది.

 నల్ల మిరియాలు తరచూ డైట్ లో చేర్చుకోవడం వల్ల ఇందులో ఉన్న పెప్పరీన్‌ ఖనిజాల మన శరీరం గ్రహించేలా ప్రేరేపిస్తుంది. నల్ల మిరియాల్లో విటమిన్ ఏ, విటమిన్ సి, సెలీనియం, విటమిన్ బి కూడా ఉంటుంది. ఇది డైట్ లో చేర్చుకోవడం వల్ల సమతుల ఆహారం మన శరీరానికి అందుతుంది.

 మిరియాలు తీసుకోవటం వల్ల వెయిట్ లాస్ జర్నీలో ఉన్నవారికి మంచిది. ఇందులోనే పెప్పరీన్‌ మన శరీరంలో కొవ్వు పేరుకోకుండా కాపాడుతుంది. మెటబాలిజం రేటును పెంచుతుంది. నల్ల మిరియాలు ఆహారం పైన చల్లుకొని తీసుకోవచ్చు .రెగ్యులర్గా తీసుకోవడం వల్ల వెయిట్ లాస్ జర్నీలో ఉన్న వారికి మేలు చేస్తుంది.

ఇదీ చదవండి:  పాలకూరతో ఇవి కలిపి తింటే రెట్టింపు ఆరోగ్య ప్రయోజనాలు.. ఆరోగ్యానికి తిరుగుండదు..

నల్ల మిరియాలు తరుచూ తీసుకోవడం వల్ల ఇందులోని యాంటీ బ్యాక్టీరియాల్‌ గుణాలు ఇమ్యూనిటీ వ్యవస్థను బలపరుస్తాయి.వీటిని డైట్‌లో చేర్చుకోవడం వల్ల సీజనల్ జబ్బులు రాకుండా తగ్గిస్తుంది. దీంతో జలుబు సమస్యలు రాకుండా నివారిస్తుంది. అంతే కాదు రెస్పిరేటరీ సమస్యలు ఉన్నవాళ్లు కూడా నల్ల మిరియాలు తీసుకోవాలి. మన బామ్మల కాలం నాటి నుంచి కూడా ఈ నల్ల మిరియాలను మెడిసినల్ పరంగా ఉపయోగిస్తున్నారు. దీంతో ఆస్తమా, బ్రోంకైటీస్‌ వ్యాధులు ఉన్నవాళ్లు నల్ల మిరియాలు డైట్లు తప్పకుండా ఉండాల్సిందే. నల్ల మిరియాలు శ్వాస నాళాలను కూడా క్లియర్ చేస్తుంది. 

అయితే ఆరోగ్యపరంగా మాత్రమే కాదు అందం పరంగా కూడా నల్ల మిరియాల్లో అనేక లాభాలు ఉన్నాయి. ఇది స్కిన్ డామేజ్ కాకుండా.. త్వరగా వృద్ధాప్య ఛాయలు రాకుండా నివారిస్తుంది. ఇందులో యాంటీ మైక్రోబియల్ గుణాలు కూడా ఉంటాయి. దీంతో చర్మం యవ్వనంగా ఆరోగ్యంగా కనిపిస్తుంది. నల్ల మిరియాలు చారు, ఇతర నాన్‌ వెజ్‌ వంటకాల్లో కూడా వేసుకోవచ్చు. వీటిని సలాడ్‌పై కూడా చల్లుకుని తినవచ్చు.

ఇదీ చదవండి:  ఈ పండు తింటే 80  ఏళ్లు అయినా కంటికి అద్దాల అవసరమే ఉండదు..

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.FacebookTwitter

Trending News