How To Grow A Beard: ఈ టిప్స్‌ పాటిస్తే గడ్డం ఒత్తుగా పెరిగి.. స్టైలిష్‌గా కనిపించడం ఖాయం..!

Easy Tips To Grow A Beard: గడ్డం అనేది నేటి తరంలో ఒక ఫ్యాషన్‌. సినిమా హీరోలను చూసిన చాలా మంది గడ్డం పెంచుకోవడానికి ఇష్టపడుతుంటారు. కానీ గడ్డం పెంచడంలో ఎంతో సంరక్షణ తీసుకోవాల్సి ఉంటుంది. లేదంటే గడ్డం సరిగా పెరగకపోవడం, రాలిపోవడం వంటి సమస్యలు కలుగుతాయి. అయితే కొన్ని టిప్స్‌ను పాటించడం వల్ల ఒత్తైనా గడ్డం మీసొంతం చేసుకోవచ్చు. అది ఎలాగో తెలుసుకోండి.  

Written by - Shashi Maheshwarapu | Last Updated : Oct 21, 2024, 01:04 PM IST
How To Grow A Beard: ఈ టిప్స్‌ పాటిస్తే గడ్డం ఒత్తుగా పెరిగి.. స్టైలిష్‌గా కనిపించడం ఖాయం..!

Easy Tips to Grow a Beard: గడ్డం ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఒక ఫ్యాషన్ ట్రెండ్‌గా మారింది. ఒకప్పుడు గడ్డం పెంచడం అంటే లవ్ ఫెయిల్యూర్‌కు సంకేతంగా భావించేవారు. కానీ ఇప్పుడు కాలాలు మారిపోయాయి. గడ్డం పెంచడం అనేది ఒక స్టైలిష్‌గా, మ్యాన్లీగా కనిపించడానికి ఒక మార్గంగా మారింది. ఒక రకంగా సినిమాల్లో హీరోలు గడ్డంతో కనిపించడం వల్ల యువతలో గడ్డంపై ఆకర్షణ పెరిగిందని చెప్పవచ్చు.  ప్రస్తుతం సోషల్ మీడియాలో గడ్డం ఉన్న వారి ఫోటోలు ఎక్కువగా వైరల్ అవుతుండటం వల్ల ఇది ఒక ట్రెండ్‌గా మారిందని చెప్పవచ్చు. 

గడ్డం పెంచడం అనేది మగతనానికి ఒక ప్రతీకగా భావిస్తారు. గడ్డం పెంచడంలో చాలా రకాల స్టైల్స్ ఉన్నాయి. దీని వల్ల ప్రతి ఒక్కరూ తమకు నచ్చిన స్టైల్‌ను ఎంచుకోవచ్చు. కానీ గడ్డం పెంచేటప్పుడు కొన్ని విషయాలు గుర్తుంచుకోవాలి ఉంటుంది.  ప్రతి ఒక్కరి ముఖానికి తగిన గడ్డం స్టైల్ ఉంటుంది. తమ ముఖానికి తగిన స్టైల్‌ను ఎంచుకోవడం ముఖ్యం. గడ్డం పెంచిన వారు దాన్ని శుభ్రంగా ఉంచడం చాలా ముఖ్యం. కొంతమందికి గడ్డం పెంచడం వల్ల చర్మ సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది. అందుకే ఆరోగ్యం పరంగా జాగ్రత్తలు తీసుకోవడం మంచిది. అయితే కొంతమందిలో గడ్డం పెరగడానికి కొంత సమయం పడుతుంది. ఈ సమస్య ఉన్నవారు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. ముఖ్యంగా ఆహార అలవాట్లు పట్ల జాగ్రత్త తీసుకోవాలి. 

ఎలాంటి ఆహారపదార్థాలు తీసుకోవాలి: 

గడ్డం ఆరోగ్యంగా, ఒత్తుగా పెరగాలంటే పోషకరమైన ఆహారపదార్ధాలు తీసుకోవడం చాలా ముఖ్యం. ముఖ్యంగా గుడ్లు, బాదం, జీడిపప్పు వంటి పదార్థాలు  తీసుకోవడం మంచిది. ఇవి గడ్డం వెంట్రుకలను రాలకుండా తగ్గిస్తాయి. ఒత్తైన గడ్డం పెరగడంలో సహాయపడుతాయి. దీంతో పాటు ఆకుకూరలు, క్యారెట్‌ తీసుకోవాలి. ఇందులో విటమిన్ ఏ ఎక్కువగా ఉంటుంది. వీటితో పాటు బియర్డ్ ఆయిల్స్‌తో మసాజ్ చేయాల్సి ఉంటుంది. మసాజ్‌ చేసుకోవడం కూడా అవసరం. ఈ విధంగా చేయడం వల్ల గడ్డం అందంగా పెరుగుతుంది. గడ్డం ఆరోగ్యంగా పెరగాలంటే మొదట చేయాల్సి పని ట్రిమ్‌ చేయడం చాలా అవసరం. వారంలో ఒక సారి ట్రిమ్‌ చేయడం వల్ల గడ్డం శుభ్రంగా, సమానంగా పెరుగుతుంది. ముఖ్యంగా చర్మం పొడి బారకుండా ఉంటుంది. ట్రిమ్ చేసిన తరువాత బియర్డ్‌ ఆయిల్‌తో మసాజ్‌ చేయడం వల్ల చర్మం తేమగా ఉంటుంది. ఎలాంటి ఇన్ఫెక్షన్ లు రాకుండా ఉంటాయి. 

దీంతో పాటు ప్రొటీన్‌ కలిగిన ఆహారపదార్థాలు తీసుకోవడం చాలా అవసరం. ఇది గడ్డం పెరగడంలో సహాయపడుతుంది.  గడ్డం కేవలం ఒక ఫ్యాషన్ ట్రెండ్ మాత్రమే కాదు, అనేక ఆరోగ్య ప్రయోజనాలను కూడా కలిగి ఉంటుంది. గడ్డం ముఖ చర్మాన్ని సూర్యకిరణాలు, ధూళి, కాలుష్యం వంటి వాటి నుంచి రక్షిస్తుంది. దీని వల్ల ముఖం పొడిబారడం, మొటిమలు రావడం తగ్గుతుంది. చలికాలంలో గడ్డం ముఖాన్ని వెచ్చగా ఉంచుతుంది.
గడ్డం ధూళి కణాలను ఫిల్టర్ చేయడంలో సహాయపడుతుంది. దీని వల్ల అలెర్జీల ప్రభావం తగ్గుతుంది. గడ్డం  వ్యక్తిత్వాన్ని ప్రతిబింబిస్తుంది.  ఎలాంటి వ్యక్తి అనేది గడ్డం ద్వారా తెలుస్తుంది.

Also Read: Tight Bra: బిగుతు బ్రా వేస్తే సౌకర్యం అనుకుంటున్నారా? ఈ ఆరోగ్య సమస్యలు వస్తాయి జాగ్రత్త...!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter, Facebook 

Trending News