Wayanad Landslides: వాయనాడ్ ల్యాండ్‌స్లైడ్ రిలీఫ్‌కు బజాజ్ ఫిన్‌సర్వ్ భారీ విరాళం..

Wayanad Landslides: వాయనాడ్ ల్యాండ్‌స్లైడ్ రిలీఫ్‌కు బజాజ్ ఫిన్‌సర్వ్ చీఫ్ ఎకనామిస్ట్ డాక్టర్ ఎన్ శ్రీనివాసరావు రూ.2 కోట్లలను విరాళాన్ని అందించారు. అంతేకాకుండా తమ కంపెనీ బాధితులను ఆదుకునేందుకు ఎప్పుడూ ముందుంటుందని ఆయన తెలిపారు. అలాగే తమ కంపెనీ సేవలను బాధితులకు వెంటనే అందించేందుకు ప్రత్యేకమైన చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు.

Written by - Dharmaraju Dhurishetty | Last Updated : Sep 28, 2024, 12:07 PM IST
Wayanad Landslides: వాయనాడ్ ల్యాండ్‌స్లైడ్ రిలీఫ్‌కు బజాజ్ ఫిన్‌సర్వ్ భారీ విరాళం..

Wayanad Landslides: అన్ని విపత్తుల్లో అతి ప్రమాదకరమైనది కేరళ వాయనాడ్ ల్యాండ్‌స్లైడ్ .. ఈ విపత్తులో భాగంగా చాలామంది ప్రాణాలు కోల్పోయారు. అంతేకాకుండా వరద ప్రవాహం కారణంగా కొన్ని గ్రామాలే సర్వనాశనం అయ్యాయి. దీంతో ఊహించని ఆస్తి నష్టం సంభవించింది. అలాగే ఈ వరద బీభత్సం కారణంగా కొన్ని లక్షల జంతువులు ప్రాణాలు కోల్పోయాయి. ఈ ముప్పు నుంచి చాలామంది తప్పించుకొని బయటపడ్డారు కానీ వారు వారి సొంత నివాసాలు, తినడానికి తిండి ఇలా ఒకటి కాదు రెండు కాదు సర్వం కోల్పోయారు. వీరికి అండగా నిలిచేందుకు దేశంలోని చాలామంది విరాళాల రూపంలో ముందుకు వస్తున్నారు. విరాళాలు సేకరిస్తూ వారికి ఎంతో కొంత అండగా నిలుస్తున్నారు. ఇదిలా ఉంటే వాయనాడ్ ల్యాండ్‌స్లైడ్ రిలీఫ్‌కు ఇటీవల బజాజ్ ఫిన్‌సర్వ్ కంపెనీ చీఫ్ ఎకనామిస్ట్ డాక్టర్ ఎన్ శ్రీనివాసరావు రూ.2 కోట్లలను విరాళంగా ప్రకటించారు. కేరళ స్టేట్ డిజాస్టర్ మిటిగేషన్ ఫండ్‌కు విరాళం అందించినట్లు తెలిపారు. 

అంతేకాకుండా తమ వంతు సహాయంగా బజాజ్ ఫిన్‌సర్వ్ వాయనాడ్‌లో ప్రభావితమైన కస్టమర్‌ల క్లెయిమ్‌లను వేగవంతం చేస్తోంది. ఇప్పటికే బజాజ్ ఫైనాన్స్ వాయనాడ్‌కు చెందిన కస్టమర్‌ల కోసం అన్ని రుణ చెల్లింపులపై మారటోరియం ప్రకటించింది. అయితే దీనిపై డాక్టర్ శ్రీనివాసరావు మాట్లాడుతూ.." విపత్తుల సంభవించినప్పుడు మన సమాజంలో సామాజిక కార్యక్రమాలు కూడా కీలకపాత్ర పోషిస్తాయి.. అంతేకాకుండా వీటి ద్వారానే బాధితుల అవసరాలు తీర్చడానికి కూడా దృష్టి సాధించాలి. వాయనాడ్‌లో కొండచరియలు విరిగిపడటం వల్ల నివాసితుల ఇళ్లు, జీవితాలు, జీవనోపాధి పోయింది. మా విరాళం వల్ల కొంతమందికైనా..ఉపాధి జీవన అవకాశాలు లభిస్తాయని మేము ఆశిస్తున్నాము" అని అన్నారు.

ఇది కూడా చదవండి: Big Billion Days 2024: కళ్లు జిగేల్‌ అనే డిస్కౌంట్‌.. ఫ్లిఫ్‌కార్ట్‌లో రూ.6,000కే iPhone సిరీస్‌ మొబైల్స్ ప్రారంభం!

అలాగే వరద బాధితుల కోసం టాలీవుడ్ తో పాటు పలువురు వ్యాపారవేత్తలు కూడా విరాళాల రూపంలో ముందుకు వచ్చారు. ముఖ్యంగా సినీ పెద్దలు చిరంజీవితో పాటు చాలామంది దర్శక నిర్మాత కూడా ఆర్థిక సహాయం చేశారు. ఇక అల్లు అర్జున్ రామ్ చరణ్ సైతం టాలీవుడ్ నుంచి విరాళాలు ఇచ్చారు. ఇక ఫ్యాన్ ఇండియా హీరో ప్రభాస్ కూడా విరాళం ప్రకటించారు. ఏకంగా రూ.2 కోట్ల రూపాయలను సీఎం రిలీఫ్ ఫండ్ కి అందించారు. ఇదిలా ఉంటే వరద బాధితుల కోసం అల్లు అర్జున్ రూ.25 లక్షలు విరాళం ఇవ్వగా.. రామ్ చరణ్, చిరంజీవిలు కూడా సీఎం రిలీఫ్ ఫండ్ కు విరాళాలు పంపారు. ఇక దక్షిణాది నుంచి నయనతార, సూర్య, జ్యోతిక ఇతర ప్రముఖ నిర్మాతలు కూడా విరాళాలను అందించారు.

ఇది కూడా చదవండి: Big Billion Days 2024: కళ్లు జిగేల్‌ అనే డిస్కౌంట్‌.. ఫ్లిఫ్‌కార్ట్‌లో రూ.6,000కే iPhone సిరీస్‌ మొబైల్స్ ప్రారంభం!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

Trending News