Chiranjeevi: వై టార్గెట్ చిరంజీవి.. ? మెగా ఫ్యామిలీని కావాలనే టార్గెట్ చేశారా..?

Chiranjeevi: తెలుగు సినీ ఇండస్ట్రీలో చిరంజీవి టార్గెట్ గా మారారా..? తాజాగా మెగాస్టార్ తన ఫ్యామిలీకి సంబంధించి సరదాగా చేసిన కామెంట్స్ తో చిరును కొంత మంది పనిగట్టుకొని మరి  కొందరు ట్రోల్ చేసేస్తున్నారు. అసలు చిరంజీవిని టార్గెట్ చేయడాన్ని సినీ ప్రముఖులు తప్పు పడుతున్నారు సెలబ్రిటీలు.  ఏం మాట్లాడినా సెలబ్రిటీస్ ను కొందరు ఎందుకు టార్గెట్ చేస్తున్నారు. 

Written by - TA Kiran Kumar | Last Updated : Feb 13, 2025, 11:54 AM IST
Chiranjeevi: వై టార్గెట్ చిరంజీవి.. ? మెగా ఫ్యామిలీని కావాలనే టార్గెట్ చేశారా..?

Chiranjeevi: ఇటీవల కాలంలో చిరంజీవికి సంబంధించిన మెగా ఫ్యామిలీని కొందరు టార్గెట్ చేసినట్టు కనిపిస్తోంది. ఆయన ఏదో జోక్ గా అన్న మాటలను కూడా భూతద్దంలో పెట్టి  సోషల్ మీడియాలో రచ్చ చేస్తున్నారు. ముఖ్యంగా దాసరి నారాయణ రావు మరణం తర్వాత తెలుగు సినీ ఇండస్ట్రీకి చిరంజీవి పెద్ద దిక్కుగా మారారు. ఆయన పెద్దరికం తీసుకోవడాన్ని అదే ఇండస్ట్రీలో కొంత మంది జీర్ణించుకోలేకపోయారనే వాదన కూడా ఉంది. మరోవైపు తాజాగా తాను పెట్టిన ప్రజా రాజ్యం పార్టీకి సీక్వెల్ జనసేన అంటూ ప్రకటించడాన్ని కొన్ని పార్టీల నేతలకు కంటగింపుగా మారింది.

ముఖ్యంగా సెలబ్రిటీలు అయినంత మాత్రానా.. వాళ్లకు వాక్ స్వాతంత్రం లేదా అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. అయితే ఓ స్థాయికి వెళ్లిన తర్వాత పెద్దవాళ్లు కూడా ఏది పడితే అది మాట్లాడటం కూడా కరెక్ట్ కాదన్న విషయం చిరు విషయంలో మరోసారి ప్రూవ్ అయింది. తాజాగా ‘బ్రహ్మా ఆనందం’ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో   మా ఇంట్లో గ్రాండ్ డాటర్స్ ఉన్నట్టు ఉండదు ఒక లేడీస్ హాస్టల్ వార్డెన్ లాగా ఉంటుంది. లేడీస్ హాస్టల్ వార్డెన్ లాగా చుట్టూ ఆడపిల్లలే ఒక్క మగాడు.  అరేయ్ చరణ్ ఈసారి కైనా సరే ఇంకొక అబ్బాయిని కనరా.  మనం మన లెగసీ కంటిన్యూ అవ్వాలిరా అని సరదగా ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ మన మనసులోని  కోరికను బయట పెట్టారు చిరు. మళ్ళీ ఇంకో అమ్మాయిని కంటాడేమో నా భయం అని చిరు సరదగా ఈ వ్యాఖ్యలు చేశారు.

ముఖ్యంగా చిరుకు  తన ఇంట్లో వాళ్లకు అమ్మాయిలంటేనే ముద్దు అని  చెప్పారు. చిరంజీవి చాలా సరదాగా క్యాజువల్ గా వెరీ పర్సనల్ గా మాటలు ఇపుడు సోషల్ మీడియాలో దుమారం రేపుతున్నాయి. ఇంట్లో పిల్లలతో ఎలా ఉంటారు. ఇంట్లో అనేది జస్ట్ ఒక ఫీల్ ఫీలింగ్ పే ఎక్స్ ప్రెస్ చేస్తే దీన్ని ఇంత ట్రోల్ చేయడం దారుణమనే చెప్పాలి.  ఇక్కడ ఏం జరిగిందంటే చిరంజీవి అమ్మాయిలకు వ్యతిరేకం.  చిరంజీవి ఆడపిల్లలకు వ్యతిరేకం అన్న వాదన బలంగా ప్రజల్లో తీసుకెళ్లారు.  ఇప్పుడు చిరు అన్న  టోన్ చూడాలి.  ఆయన మాట్లాడుతుంది జోక్ గా అన్నారా సీరియస్ గా అన్నారా అన్నది ఒకటి చూడాలి.  

ఆయనకు చాలా క్యాజువల్ గా చాలా జోక్ గా మాట్లాడుతూ చెప్పిన మాటలకు వక్రభాష్యం ఇచ్చారు.   రెండోది ఏమైంది అంటే ఇప్పుడు ఏం మాట్లాడినా అందరు అందులో తప్పు వెతుకుతున్నారు.  రంద్రాన్వేషణం చేస్తే ఇక ఎవరు ఏం మాట్లాడుతారు.  అవును ఒకటి చిరంజీవి ఏదైనా సినిమాను ప్రమోట్ చేస్తే ఆ సినిమాకి డెఫినెట్ గా ఆడియన్స్ వస్తారు.  అంతేకాదు ఆ సినిమా పట్ల ప్రేక్షకులకు ఇంట్రెస్ట్ పెరుగుతుందనేది వాస్తవం.

ప్రస్తుతం దాసరి నారాయణ రావు తర్వాత  అఫీషియల్ గా ఇండస్ట్రీ పెద్ద ఎవరంటే చిరంజీవి పేరు చెబుతారు.  సో ఎవరైనా సరే ఇప్పుడు రెండు రోజుల వ్యవధిలో లైలా, బ్రహ్మా ఆనందం రెండు సినిమాలను ప్రమోట్ చేసారు చిరంజీవి.  తన ఫ్యామిలీ హీరోల సినిమాలే కాకుండా.. మిగతా హీరోల సినిమాలను కూడా ఎంకరేజ్ చేస్తుంటారు.

మరోవైపు రామ్ చరణ్ ‘గేమ్  ఛేంజర్’ మూవీకి చిరంజీవి పెద్దగా ప్రమోషన్ చేయలేదు. బ్రహ్మానందం కొడుకు మూవీ సో ఆయన ఏ సందర్భాల్లో అన్నదో కూడా చూడాలి కదా. అందులో ఆ బ్రహ్మానందం తాత క్యారెక్టర్ చేసారు.  వాళ్ళ మనవళ్లు సంబంధించి బ్రహ్మానందంకి అందరూ మనవళ్లు ఉన్నారు.  నాకేమో అందరూ మనవరాల్లు ఉన్నారు  అని చాలా క్యాజువల్ గా చెప్పుకొచ్చారు చిరంజీవి.  

నిజానికి ఇప్పుడు సోషల్ మీడియాలో వచ్చింది ఏంది. చిరంజీవి ఆడపిల్లలకు వ్యతిరేకమంటూ వార్తలు వచ్చాయి.  వారసత్వం

ఏంటి ? ఇంకా మగపిల్లలు ఏంటి ?  ఆడపిల్లలు ఏంటి ? నిజంగా చిరంజీవికి గనక ఆడపిల్లలు అంటే గనక అంత వ్యతిరేకత ఉంటే మనం ఒకటి అబ్సర్వ్ చేయాలి.  ఫస్ట్ చిరంజీవికి పుట్టింది ఎవరు ఆడపిల్ల సుస్మిత కదా.   సెకండ్ రామ్  చరణ్ సో ఒక కొడుకు పుట్టేసాడు.  కదా ఇంకా చాలు అనుకోవచ్చు కదా.  సుష్మిత రామ్ చరణ్ తర్వాత మరి శ్రీజా ను మూడో పిల్లని కూడా ఎందుకు కన్నారు. ఒకవేళ చిరంజీవి ఉద్దేశ్యం కొడుకుతో వారసత్వమే అన్నట్టే అనుకుంటే.. ఆయనకు నిజానికి చిన్న కూతురు శ్రీజా అంటే చాలా ఇష్టం.  చిరంజీవి కానీ చాలా సందర్భాల్లో ఆయన చెప్పడం జరిగింది.

అండ్ షి ఇస్ ఏ లక్కీ చామ్ ఆఫ్  ఫ్యామిలీ అని అన్న సందర్భాలు కూడా ఉన్నాయి.  కదా ఇక్కడే కామన్ సెన్స్ ఒకటి రెండోది జోవియల్ గా చెప్పడం దాన్ని కూడా మనం చూడాలి. మీడియా ట్రోల్ చేస్తే మీడియా నెగిటివ్ చేస్తే సరే మీడియా కంటే సోషల్ మీడియా ఎక్కువ చేస్తే గనుక ఇంకా ఎవరైనా ఏం మాట్లాడుతారు.  

ఇదీ చదవండి:   గడ్డకట్టే చలిలో నాగ సాదువులు నగ్నంగానే ఎందుకు ఉంటారు.. అసలు రహస్యం అదేనా..!

సినిమా రిలేటెడ్ గా చిరు సరదాగా మాట్లాడిన వ్యాఖ్యలను కూడా పనిగట్టుకొని మరి ట్రోల్ చేస్తున్నారు.  సో నిజానికి ఉపాసనే చాలా సార్లు చెప్పింది క్లింకార అంటే  చిరంజీవికి చాలా ఇష్టమని చెప్పారు. క్లీంకార పుట్టినప్పుడు చిరు స్వయంగా షేర్ చేసిన వీడియోస్ కూడా చూసాం. హాస్పిటల్ కి వెళ్లి ఎమోషనల్ అవ్వడం నిజంగా చిరంజీవికి గనక చిరంజీవి గనుక వంశోద్ధారకుడు కొడుకే పుట్టాలనుకుంటే మన దేశంలో కాకుండా విదేశాల్లో చెకప్ చేసి ఉండేవారు.

మన దేశంలో  ప్రెగ్నెన్సీ టైం లో ఆడబిడ్డో.. మగబిడ్డో  తెలుసుకోవడాన్ని పర్మిట్ చేయవు.  వాళ్ల చేతిలో అతిపెద్ద అపోలో హాస్పిటల్ కూడా ఉంది. చిరంజీవికి కరెక్ట్ గా తలుచుకంటే యూఎస్ లేకపోతే వేరే దేశాలకు వెళ్లి పుట్టబోయేది ఎవరో తెలుసుకోవచ్చు. వాళ్ళు అంత పెద్ద స్థాయిలో ఉన్న వాళ్ళు కేవలం  కొడుకే పుట్టాలి.  మనవడే పుట్టాలి ప్రపంచంలో ఎక్కడికైనా వెళ్లే స్థోమత వాళ్లకు ఉంది.  చిరంజీవి ట్రోల్ చేయడంలో వేరే హీరోలకు సంబంధించిన ఫ్యాన్స్ కూడా ఉండొచ్చు.మొత్తంగా చిరంజీవిని కావాలనే ట్రోల్ చేస్తున్నారనే విషయం ఇక్కడ స్పష్టమవుతోంది.  

మరోవైపు చిరంజీవికి ఆ చెల్లెల్ని కూడా ఎంత ప్రేమగా చూసుకుంటారనేది అందరికీ తెలిసిందే. తమ్ముళ్ళు కాకుండా చెల్లెల్ని
కూడా ప్రేమగా చూసుకుంటారు కదా. చిరుకు ఆడపిల్లలు అంటే చిన్న చూపు ఎందుకు ఉంటుంది. అంతేకాదు ఇంట్లో కానీ గుళ్లో కానీ అయ్యగార్లు  ఆశీర్వదించమంటే సుపుత్ర ప్రాప్తిరస్తు అంటారు. ఇట్స్ కామన్ అంత మాత్రాన పండితులకు  అమ్మాయిలు అంటే ఇష్టం ఉండదు అని అనుకోలేము కదా.  ఎస్ సో ఇప్పుడు సోషల్ మీడియా అన్నది ఈ విధంగా ప్రతి దానికి రియాక్ట్ కావడం అది కూడా నెగిటివ్ రియాక్ట్ అవడం మారుతున్న సమాజ పోకడకు నిదర్శనంగా నిలుస్తోంది.

మహిళల పట్ల నిజానికి ఇండస్ట్రీలో చాలా మంది చాలా అలిగేషన్స్ కూడా వస్తూ ఉంటాయి. నన్ను ఆ హీరో వేధించాడు. ఈ హీరో వేధించాడాని వార్తలు వస్తూనే ఉంటాయి.  దాదాపు 50 యేళ్లుగా ఇండస్ట్రీలో ఉన్నా.. 156 సినిమాలు చేసి కూడా ఎటువంటి మచ్చ లేకుండా ఏ కాంట్రవర్సీస్ లేన వ్యక్తి చిరంజీవి.  సో అటువంటి వ్యక్తి సరదాగా అన్న వ్యాఖ్యలపై లేని పోని అర్దాలు తీయడం కరెక్ట్ చేయాలి. మొత్తంగా ఆడ పిల్లల విషయంలో చిరు ఎంత రెస్పెక్ట్ గా ఉంటారో చెప్పాల్సిన అవసరం లేదు.

ఇదీ చదవండి : చిరంజీవి, కీర్తి సురేష్ తల్లితో రొమాన్స్ చేసిన ఈ సినిమా తెలుసా..! అందులో మెగాస్టార్ విలన్..

ఇదీ చదవండి : ప్రస్తుత మార్కెట్ వాల్యూ ప్రకారం నాగార్జున ‘అన్నపూర్ణ స్టూడియో’ మార్కెట్ విలువ ఎంతో తెలుసా..?

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

Trending News