Star Heroin: తాగుడుకు బానిసై సినీ కెరీర్ నాశనం.. 44 ఏళ్ల వయసులో స్టార్ హీరోయిన్ రెండో పెళ్లి..

Star Heroin: బాలయ్య, చిరంజీవి వంటి స్టార్ హీరోల సరసన యాక్ట్ చేసిన స్టార్ హీరోయిన్. అంతేకాదు తాగుడుకు బానిసై సినీ కెరీర్ ను నాశనం చేసుకుంది. ఇంతకీ ఎవరా కథానాయిక అనే విషయానికొస్తే..

1 /7

Star Heroin: ఊర్వశి.. స్వతహాగా మలయాళీ అయినా.. కన్నడ, తెలుగు, తమిళ సినీ పరిశ్రమలో కథానాయికగా రాణించింది. ముఖ్యంగా తమిళ, కన్నడ, మలయాళంలో స్టార్ హీరోయిన్ గా సత్తా చాటింది.  

2 /7

తెలుగులో మాత్రం చిరంజీవి హీరోగా నటించిన ‘రుస్తుం’ సినిమాతో కథానాయికగా పరిచయమైంది. ఆ తర్వాత బాలయ్య సరసన ‘భలే తమ్ముడు’ సినిమాలో నటించింది. ఆ తర్వాత తెలుగులో అడపాదడపా క్యారెక్టర్  ఆర్టిస్ట్ గా తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమే.

3 /7

ముఖ్యంగా మలయాళం, కన్నడ ప్రేక్షకుల హృదయాలను గెలుచుకున్న ఈమె ‘న్యూ ఢిల్లీ’ అనే హిందీ చిత్రంలో కూడా నటించింది. అంతేకాదు 2006లో బెస్ట్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా జాతీయ అవార్డు కూడా గెలుచుకుంది. ఊర్వశి అసలు పేరు కవితా రెంజినీ. ఈమె స్వస్థలం కేరళలోని కొల్లాంలో జన్మించింది. ముందుగా బాలనటిగా సినీ రంగ ప్రవేశం చేసి హీరోయిన్ గా సత్తా చాటింది.

4 /7

సుధీర్ఘ కెరీర్ లో ఈమె దాదాపు 700 చిత్రాల్లో హీరోయిన్ గా.. క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా పలు చిత్రాల్లో నటించి మెప్పించింది. ఈమె దక్షిణాది స్టార్ హీరోలైన చిరంజీవి, బాలకృష్ణ,  రజనీకాంత్, కమల్ హాసన్,  విష్ణువర్ధన్, అంబరీష్, రవిచంద్రన్, రమేష్ అరవింద్, మోహన్ లాల్, మమ్ముట్టి, డాక్టర్ రాజ్ కుమార్ వంటి స్టార్ హీరోల సరసన నటించి మెప్పించింది.

5 /7

హీరోయిన్ గా ప్రవేశించిన అతి తక్కువ సమయంలోనే మంచి డిమాండ్ ఉన్న నటిగా మారింది ఊర్వశి. వృత్తిగత జీవితంలో ఎన్నో బ్లాక్ బస్టర్ విజయాలను అందుకున్న ఈమె వ్యక్తిగత జీవితంలో ఎన్నో ఒడిదుడుకులను ఫేస్ చేసింది. ముఖ్యంగా కెరీర్ పీక్స్ లో ఉన్న సమయంలోనే తాగుడుకు బానిసై కెరీర్ ను నాశనం చేసుకుంది.

6 /7

నటి ఊర్వశి 2000 యేడాదిలో  మనోజ్ కె జయన్‌ను మొదటి వివాహం చేసుకుంది. అంతేకాదు అతనితో  ఈమె  వైవాహిక జీవితం అంత సాఫీగా సాగలేదు. మొదటి భర్త ఆమె ఎన్నో చిత్ర హింసలకు గురిచేసినట్టు పలు సందర్భాల్లో వెల్లడించారు. ఆ తర్వాత అతనికి విడాకులు ఇచ్చింది. ఈ దంపతులకు ఒక ఆడపిల్ల ఉంది.

7 /7

మొదటి భర్తకు విడాకులు ఇచ్చిన తర్వతా 44 యేళ్ల వయసులో 2016లో చెన్నైకి చెందిన వ్యాపారవేత్త శివప్రసాద్‌ను రెండో  వివాహం చేసుకుంది. ఊర్వశి మరియు శివప్రసాద్ దంపతులకు ఇహాన్ ప్రజాపతి అనే మగబిడ్డ పుట్టాడు.రెండవ పెళ్లి  తర్వాత ఊర్వశి ఆనందకరమైన జీవితాన్ని గడుపుతోంది. లావుగా ఉన్న.. తన ఆహార్యానికి తగ్గ పాత్రల్లో సినిమాల్లో రాణిస్తోంది ఊర్వశి.