Thala:‘తల’ మూవీ నుంచి ‘ప్రేమ కుట్టిందంటే’ లిరికల్ వీడియో సాంగ్ కు సూపర్ రెస్పాన్స్..

Thala: అమ్మ రాజశేఖర్ డైరెక్షన్ లో  ఆయన కుమారుడు అమ్మ రాగిన్ రాజ్ హీరోగా తెరకెక్కిన చిత్రం ‘తల’. రీసెంట్ గా తమిళ హీరో విజయ్ సేతుపతి చేతుల మీదుగా విడుదలైన ఈ మూవీ తమిళ్, తెలుగు ట్రైలర్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. రణం తర్వాత ఆ రేంజ్ బ్లాక్ బస్టర్ ఈ సినిమాతో అందుకోవడం పక్కా అని చెబుతున్నారు ఇండస్ట్రీ వర్గాలు. తాజాగా ఈ సినిమా నుంచి ‘ప్రేమ కుట్టిందంటే’ లిరికల్ వీడియో సాంగ్ ను విడుదల చేస్తే మంచి రెస్పాన్స్ వస్తోంది.    

Written by - TA Kiran Kumar | Last Updated : Feb 9, 2025, 10:40 AM IST
Thala:‘తల’  మూవీ నుంచి ‘ప్రేమ కుట్టిందంటే’ లిరికల్ వీడియో సాంగ్ కు సూపర్ రెస్పాన్స్..

Thala: సినీ ఇండస్ట్రీలో  హీరోలు, నిర్మాతలు, దర్శకుల తనయులు హీరోగా పరిచయం కావడం అనేది ఎప్పటి నుంచో ఉంది. ఈ కోవలో సినీ ఇండస్ట్రీలో హీరోగా అడుగుపెడుతున్నాడు డైరెక్టర్ కమ్ కొరియోగ్రాఫర్ అమ్మ రాజశేఖర్ కుమారుడు   అమ్మ రాగిన్ రాజ్. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా ట్రైలర్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. తాజాగా ఈ సినిమా నుంచి ‘ప్రేమ కుట్టిందంటే’ అనే లిరికల్ వీడియో సాంగ్ ను విడుదల చేస్తే మంచి రెస్పాన్స్ వస్తోంది.

బిగ్ బాస్ ఫేమ్ ఎనర్జిటిక్ సింగర్ భోలే షావలీ ఈ పాటను పాడారు. మ్యూజిక్ డైరెక్టర్ ధర్మతేజ రాశాడు. విశేషం ఏంటంటే.. ఈ పాటను తమిళ్ లో మల్టీ టాలెంటెడ్ లెజెండరీ పర్సనాలిటీ టి రాజేందర్ పాడటం విశేషం. ఇలాంటి హుషారైన గీతాలకు టి. రాజేందర్ పెట్టింది పేరు. అందుకే ఈ పాట తమిళ్ లోనూ ఊపేస్తుందనడంలో సందేహం లేదు.
 
ప్రధానంగా ఈ పాటను కమెడియన్ ముక్కు అవినాష్ పై పిక్చరైజ్ చేశారు. ప్రేమలో పడితే ఎదురయ్యే సమస్యలు, కష్టాలు ఎలా ఉంటాయో అతను వివరిస్తున్నట్టుగా ఉంది ఈ  పాట లిరిక్స్. రణం చిత్రంలో అలీపై చిత్రీకరించిన ‘నమ్మొద్దు నమ్మొద్దూ ఆడవాళ్లను నమ్మొద్దూ’ అనే పాట ఎంత పెద్ద హిట్ అయిందో అంతకు మించిన హిట్ గా ఈ పాట నిలిచేలా ఉంది.

ఇదీ చదవండి : ప్రస్తుత మార్కెట్ వాల్యూ ప్రకారం నాగార్జున ‘అన్నపూర్ణ స్టూడియో’ మార్కెట్ విలువ ఎంతో తెలుసా..?
 
‘చీమ ఎక్కడ కుడితే అక్కడే మంట పడుతుందయా.. దోమ కుట్టిందంటే వస్తుంది మలేరియా.. కానీ ప్రేమ కుట్టిందంటే పిచ్చెక్కిపోతుందయా’ అంటూ మొదలైన ఈ పాట ఇప్పటి జనరేషన్ యూత్ ను అట్రాక్ట్ చేసే విధంగా ఉంది. ప్రేమలో పడితే అమ్మాయిలు పెట్టించే ఖర్చులు, వారు పెట్టే ఇబ్బందులు తెలుపుతూ ఆఖర్లో ప్రేమ గురించి అడిగితే ‘హూ ఆర్ యూ’ అందిరా అంటూ వచ్చే ఫినిషింగ్ టచ్ ఆకట్టుకునే విధంగా ఉంది. ఈ చిత్రాన్ని ఈ నెల 14న వాలెంటైన్స్ డే సందర్భంగా రిలీజ్ చేస్తున్నారు.

ఇదీ చదవండి:   గడ్డకట్టే చలిలో నాగ సాదువులు నగ్నంగానే ఎందుకు ఉంటారు.. అసలు రహస్యం అదేనా..!

ఇదీ చదవండి : చిరంజీవి, కీర్తి సురేష్ తల్లితో రొమాన్స్ చేసిన ఈ సినిమా తెలుసా..! అందులో మెగాస్టార్ విలన్..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

Trending News