Chiranjeevi And Balakrishna Absence For TFI Meet: టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో జరుగుతున్న పరిణామాలను దృష్టిలో..పెట్టుకొని సినీ పెద్దలంతా కలిసి నేడు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలవడానికి వెళ్తున్న విషయం తెలిసిందే.. ఇక నిన్ననే అల్లు అర్జున్, చిరంజీవి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలుస్తారంటూ వార్తలు వచ్చినా.. ఇవన్నీ కేవలం రూమర్స్ అని తెలుస్తోంది.
మరొకవైపు టాలీవుడ్ సీనియర్ స్టార్ హీరోలతో పాటు సినీ దర్శకుడు, నిర్మాతలు.. కూడా ఈ రోజు సీఎం రేవంత్ రెడ్డి ని కలవనున్నారు. కానీ బాలకృష్ణ, చిరంజీవి ఈ మీటింగ్ కి దూరంగా ఉన్నట్లు సమాచారం.
అసలు విషయంలోకి వెళితే సీఎం గా రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత.. అక్రమ కట్టడాలు అంటూ చాలామంది హీరోలకు సంబంధించిన నిర్మాణాలపై వేటు వేసిన విషయం తెలిసిందే. ముఖ్యంగా నాగార్జున N- కన్వెన్షన్ హాల్లోని కొంత భాగం కూల్చివేశారు.
అలాగే బాలకృష్ణ ఇంటి చుట్టూ కూడా మార్క్ వేయడంతో.. అవమానంగా భావించిన బాలయ్య ఇప్పుడు ఈ మీటింగ్ కి రావడం లేదని వార్తలు వినిపిస్తున్నాయి. ఒక బాలయ్య ఈ కారణంగానే ముఖ్యమంత్రిని కలవడం లేదని సమాచారం. అలాగే చిరంజీవి కూడా ఇప్పుడు ఈ మీటింగ్ కి హాజరు కావడం లేదని తెలుస్తోంది
ఎందుకంటే గతంలో కూడా సినిమా ఇండస్ట్రీలో సమస్యలు వచ్చినప్పుడు.. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని కలిసి అక్కడ చేతులు కట్టుకొని నిలుచున్నారు మెగాస్టార్. ఆ సమయంలో అది అవమానంగా భావించిన అభిమానులు పెద్ద ఎత్తున.. ఆ వీడియో వైరల్ చేస్తూ.. కామెంట్ చేశారు. అంతేకాదు చాలామంది విమర్శిస్తూ ట్రోల్స్ కూడా వేశాడు. దానితో అవమానంగా ఫీల్ అయిన చిరంజీవి ఇప్పుడు ఇలాంటివి జరగకుండా.. ఈ మీటింగ్ కి రాలేదని తెలుస్తోంది.
దీనికి తోడు తన మేనల్లుడు అల్లు అర్జున్ విషయం ఒకటి చర్చనీయాంశంగా మారుతున్న నేపథ్యంలో.. ఈ రెండింటిని దృష్టిలో పెట్టుకొని చిరంజీవి రేవంత్ రెడ్డిని కలవడానికి రాకపోయి ఉండొచ్చు అని గట్టిగా వార్తలు వినిపిస్తున్నాయి. మరి ఏది ఏమైనా ఇండస్ట్రీ దిగ్గజాలైన చిరంజీవి, బాలకృష్ణ.. ఇద్దరు కూడా మీటింగుకి వెళ్లకపోవడం పై పలు అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి.
Also Read: Jr NTR Fan: జూనియర్ ఎన్టీఆర్‌పై విమర్శలపై యూటర్న్.. కౌశిక్ తల్లి వివరణ ఇదే!
Also Read: Dil Raju: సంధ్య థియేటర్ బాధిత రేవతి భర్తకు దిల్ రాజు బంపర్ ఆఫర్.. సినిమా ఛాన్స్
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.