Traffic E Challan Discounts: ప్రతి ఏడాది మాదిరి ఈ సంవత్సరం కూడా ట్రాఫిక్ చలాన్లపై రాయితీ ఉంటుందని ప్రజలు భావిస్తున్న వేళ కొన్ని సందేశాలు వస్తుండడంతో అవి వైరల్‌గా మారాయి. సామాజిక మాధ్యమాల్లో ట్రాఫిక్ చలాన్లపై విస్తృతంగా చర్చ జరుగుతున్న వేళ తెలంగాణ పోలీస్ శాఖ సంచలన ప్రకటన జారీ చేసింది. ఈ ఏడాది కూడా చలాన్ల రాయితీ ఉంటుందని జరుగుతున్న ప్రచారంపై పోలీస్ శాఖ ఒక ప్రకటన విడుదల చేసింది. చలాన్లపై ఎలాంటి రాయితీ లేదని ప్రకటించింది. అటువంటి సందేశాలు నమ్మవద్దని సూచించింది.
ట్రాఫిక్ చలాన్ల రాయితీపై జరుగుతున్న ప్రచారం హైదరాబాద్ ట్రాఫిక్ పోలీస్ అదనపు కమిషనర్ పి విశ్వప్రసాద్ కీలక ప్రకటన విడుదల చేశారు. ఈ సందర్భంగా వాహనదారులకు కీలక సూచనలు చేశారు. ట్రాఫిక్ చలాన్ల డిస్కౌంట్లపై ఆన్‌లైన్‌లో మెసేజ్‌లు.. వార్తలు వస్తున్నాయని.. అవన్నీ తప్పు అంటూ కొట్టిపారేశారు. అవన్నీ అసత్య వార్తలని కొట్టిపారేశారు. సోషల్ మీడియాలో.. ఆన్‌లైన్ ప్లాట్‌ఫారమ్‌లలో తప్పుడు.. తప్పుదోవ పట్టించే వార్తలు ప్రచారం అవుతున్నాయని.. అవన్నీ అసత్యం అని పోలీస్ శాఖ స్పష్టం చేసింది.
Also Read: BRS Party MLA: ఆంధ్ర ప్రాంతవాసుల మనోభావాలు దెబ్బతీస్తే.. తాటతీస్తా
పోలీస్ శాఖ సూచనలు
- పెండింగ్ ఈ చలాన్లపై ఎలాంటి డిస్కౌంట్లు లేవు. చలాన్లపై రాయితీలు అంటూ వస్తున్న వార్తలు, ప్రచారాన్ని ఎవరూ నమ్మవద్దు. తప్పుదోవ పట్టించే వార్తలను ప్రజలు విశ్వసించరాదు.
- ఏ అధికారిక ప్రకటన అయినా కూడా తెలంగాణ పోలీస్ శాఖ నుంచి వస్తుంది. ఏదైనా సమాచారం కావాలంటే తెలంగాణ పోలీస్ అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించండి. అధికారిక సామాజిక మాధ్యమాల్లో ప్రకటనలు చూడవచ్చు.
- ఇలాంటి తప్పుడు వార్తలు విన్నా.. ఫార్వాడ్ చేసినా చట్టరీత్యా బాధ్యులవుతారు. శిక్షార్హులు కూడా. ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. ఇతరులకు ఫార్వార్డ్ చేసేముందు.. పంచుకునేముందు ఒకసారి నిర్ధారించుకోండి.
- ఏమైనా అనుమానాలు.. సందేహాలు ఉన్నా నివృత్తి చేసుకోవడానికి సహాయ కేంద్రాలను సంప్రదించండి. సందేహాలు ఉంటే 040-27852772, 27852721 నంబర్‌లో సంప్రదించాలని పోలీస్ శాఖ సూచించింది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.