Rashmika Mandanna Shocking Comments On Allu Arjun: సినీ పరిశ్రమలో అల్లు అర్జున్ వివాదం కొనసాగుతున్న సమయంలో అతడి తోటి నటి రష్మిక మందన్నా సంచలన వ్యాఖ్యలు చేశారు. పుష్ప 2: ది రూల్ షూటింగ్ సమయంలో తనకు ఎదురైన అనుభవాన్ని పంచుకుంది. ఈ సందర్భంగా బన్నీపై షాకింగ్ కామెంట్స్ చేశారు. ఇప్పుడు ఆ హీరోయిన్ చేసిన ప్రకటన సోషల్ మీడియాలో సంచలనం సృష్టిస్తోంది.
అల్లు అర్జున్‌పై రష్మిక మందన్నా హాట్ కామెంట్స్ చేసిందనే చర్చ సామాజిక మాధ్యమాల్లో జరుగుతోంది. అల్లు అర్జున్‌తో తాను అసౌకర్యానికి గురైనట్లు చెప్పినట్లు తెలుస్తోంది.
పుష్ప 2 సినిమాల్లో అల్లు అర్జున్ భార్యగా రష్మిక మందన్నా నటించిన విషయం తెలిసిందే. వీరిద్దరి జంట ప్రేక్షకులకు కనువిందు చేసింది.
2016లో 'కిర్రాక్ పార్టీ' సినిమాతో సినీ పరిశ్రమలోకి రష్మిక అడుగుపెట్టింది. ఆ తర్వాత వరుసగా సినిమా అవకాశాలు పొంది ఇప్పుడు నేషనల్ క్రష్‌గా రష్మిక గుర్తింపు తెచ్చుకుంది.
కన్నడ సినిమాలకు దూరమైన నటి రష్మిక ప్రస్తుతం తమిళం, తెలుగు, హిందీ చిత్రాల్లో ఫుల్ బిజీగా ఉంది.
గీత గోవిందంతో తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చిన రష్మిక పుష్ప సినిమాలతో యావత్ ప్రపంచం దృష్టిని ఆకర్షించారు.
పుష్ప 2 షూటింగ్‌లో తనకు ఎదురైన అనుభవాల గురించి నటి రష్మిక మందన్నా ఊహించని వ్యాఖ్యలు చేసింది. ఈ క్రమంలోనే 'పుష్ప 2'లో తనకు ఎదురైన ఇబ్బందికర పరిస్థితులను రష్మిక పంచుకుంది. ఈ సందర్భంగా అల్లు అర్జున్‌పై షాకింగ్ కామెంట్స్ చేసింది.
పుష్ప 2లోని ఫీలింగ్స్ పాట హైలెట్‌గా నిలిచిన విషయం తెలిసిందే. అయితే షూటింగ్ సమయంలో తనకు అసౌకర్యం కలిగిందని రష్మిక చెప్పింది. 'నన్ను ఎవరైనా ఎత్తుకుపోతే నాకు భయం వేసింది. అల్లు అర్జున్ నన్ను ఎత్తుకుని బాటిల్‌తో డ్యాన్స్ చేసినప్పుడు భయపడ్డాను' అని రష్మిక తెలిపింది.