Tsunami 2004 Photos: హిందూ మహాసముద్రంలో ఏర్పడిన అతిపెద్ద భూకంపం చరిత్రలో మరచిపోలేనిది. రిక్టారు స్కేలుపై 9.1 నమోదైంది. ఫలితంగా రెండు లక్షలకు పైగా ప్రాణాలు తీసింది. దాదాపు 14 తీర ప్రాంత దేశాలు ప్రభావితం చెందాయి. ముఖ్యంగా ఇండోనేషియా, శ్రీలంక, భారత్, థాయిల్యాండ్పై ఎక్కువ ప్రభావం చూపింది.
కొన్ని నివేదికల ప్రకారం హిందూ మహాసముద్రంలో ఈ భూకంపం 10 నిమిషాలకు పైగా సంభవించింది. 9.1 రిక్టారు స్కేలుపై నమోదైంది.
120 అడుగుల పెద్ద అల సృష్టించిన భీభత్సం ఇప్పటికీ సదరు బాధితులు పేరు చెబితేనే వణికిపోతున్నారు.
కేవలం ఇండోనేషియాలోనే లక్ష 70 వేల మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. సుమత్ర దివుల్లో శకలాలు మాత్రమే మిగిలాయి.
ఇక ఈ సునామీ విధ్వంసం వల్ల ఆంధ్రప్రదేశ్‌లో 107, కేరళ 177, తమిళనాడులో 8009, పాండిచ్చేరిలో 599, అండమాన్ నీకోబార్ దివుల్లో అయితే 3513 మంచి చనిపోయారు.
2004 డిసెంబర్ 26 క్రిస్మస్ మరుసటి రోజు అంటే నేటికి 20 ఏళ్లు పూర్తి. సునామీ విధ్వంసానికి ఎత్తైన భవనాలు సైతం క్షణాల్లో నేలకూలిపోయాయి.
అంతకు ముందు సునామీ హెచ్చరికలు ముందుస్తుగా వాడుకలో లేదు దీంతో ప్రమాదంలో నష్టం భారీగా వాటిల్లింది.
థాయిలాండ్‌లోని సముద్రతీర హోటళ్లు, రిసార్ట్‌లకు వచ్చిన టూరిస్టులు ఎక్కువగా ప్రాణాలు కోల్పోయారు.
ఇక ఇండోనేషియా, భారత్, శ్రీలంక మొత్తం కలిపి 18 లక్షలకు పైగా నిరాశ్రయులయ్యారు. ఒక నివేదిక ప్రకారం దాదాపు 50 వేల మంది మిస్సయ్యారు.
ప్రసిద్ధ దేవాలయాలు, స్టేడియం వంటివి కూడా కుప్పకూలిపోయాయి. కేవలం తమిళనాడు నాగపట్టణంలోనే ఆరువేల మందికి పైగా మరణించారు.
అంతేకాదు ఈ సునామీ ధాటికి శ్రీలంకలో ప్రయాణీకులతో వెళ్తున్న ఓషన్ క్వీన్ ఎక్స్‌ప్రెస్ ఈ కెరటా ధాటికి రైలులో ఉన్న ప్రయాణీకులు మొత్తం మునిగిపోయారు ప్రాణాలు కోల్పోయారు.