Mohan babu attacks on journalist at jalpally case: మంచు మోహన్ బాబు, మంచు మనోజ్ ల ఫ్యామిలీ గొడవలు ఇటీవల ఎక్కువగా వార్తలలో నిలిచాయి. గత ఏడాది డిసెంబర్ 10న మంచు మనోజ్ మీడియా ప్రతినిధుల్ని పిలిపించాడు. తన తండ్రి జల్ పల్లిలోని తన ఇంటికి రానీయ్యకుండా బౌన్సర్ లను పెట్టుకున్నాడని కూడా తన బాధను వెలిబుచ్చాడు. ఈ క్రమంలో పెద్ద మొత్తంలో మీడియా ప్రతినిధులు కవరేజ్లో భాగంగా జల్ పల్లికి వెళ్లారు. అప్పటికే మోహన్ బాబు తన కొడుకుపై పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
మంచు మనోజ్ సైతం.. తన తండ్రి మీద ఇరు రాష్ట్రాల సీఎంలు, డిప్యూటీ సీఎంలు, తెలంగాణ డీజీపీలకు కూడా ఎక్స్ వేదికగా తనకు న్యాయం చేయాలని కూడా కోరాడు. ఈ క్రమంలో జల్ పల్లి దగ్గర భారీగా మంచు మనోజ్, మంచు మోహన్ బాబుకు చెందిన బౌన్సర్ ల మధ్య తోపులాట చోటు చేసుకుంది. దీంతో మోహన్ బాబు అప్పుడు బైటకు వచ్చారు. ఆయనను ఒక మీడియా ప్రతినిధి.. కొన్ని ప్రశ్నలు అడిగేందుకు ప్రయత్నించారు .
దీంతో కోపంలో మోహన్ బాబు.. లోగోతో మీడియా ప్రతినిధి తలపై బలంగా కొట్టారు. దీంతో ఆయన పుర్రె భాగంలో లోతుగా ఫ్యాక్చర్ అయ్యింది. ఆయన ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటుకుంటున్నారు. దీనిపై జర్నలిస్ట్ సంఘాలన్ని ఫైర్ అయ్యారు. మంచు మనోజ్ పెట్టిన కేసులే కాకుండా.. జర్నలిస్ట్ లపై చేసిన దాడులపై కూడా పోలీసులు కేసుల్ని నమోదు చేశారు.
ఈ ఘటనలో ఇప్పటికే మోహన్ బాబు జర్నలిస్ట్ కుటుంబాన్ని కలిశారు. ఆవేషంలో జరిగిందని సారీ చెప్పారు. జర్నలిస్ట్ కుటుంబానికి అండగా ఉంటానని, ట్రీట్మెంట్ ఖర్చు తానే భరిస్తానని తెల్చి చెప్పారు. ఈ క్రమంలో మోహన్ బాబు ఈ కేసులో తెలంగాణ హైకోర్టులో వేసిన పిటిషన్ ను కోర్టు కొట్టేసింది. దీనిపై మోహన్ బాబు సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు. ఈ క్రమంలో దీనిపై విచారణ జరిపిన అత్యున్నత ధర్మాసనం.. మోహన్ బాబుకు ముందస్తు బెయిల్ ఇస్తు ఆదేశాలు జారీ చేసింది.
అదే విధంగా జర్నలిస్ట్ హెల్త్ ఎలా ఉందని కోర్టు.. మోహన్ బాబు తరపు లాయర్ లను ప్రశ్నించింది. ఆయన కోలుకుంటున్నారని చెప్పారు. మరొవైపు ఈ రోజు తెలంగాణ హైకోర్టులో పహాడీ షరీఫ్ లో నమోదైన కేసులో విచారణ జరిగింది.
దీనిలో కూడా మోహన్ బాబు తరపు లాయర్ లు.. సుప్రీంకోర్గు ముందస్తు బెయిల్ ఇచ్చిన విషయాన్ని తెలియజేశారు. ఈ కేసులో తమకు మరింత సమయం కావాలని కోరారు . దీనిపై హైకోర్టు విచారణను మార్చి 4కు వాయిదా వేసింది. అయితే..మొత్తానికి జర్నలిస్ట్ కేసులో మాత్రం మోహన్ బాబుకు బిగ్ రిలీఫ్ దొరికిందని చెప్పుకొవచ్చు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Facebook, Twitter