Samantha Latest Pics : సమంత ప్రస్తుతం మయోసైటిస్ అనే వ్యాధితో బాధపడుతున్న సంగతి తెలిసిందే. యశోద సినిమా నవంబర్ 11న విడుదల కాబోతోంది. ఇంకా నాలుగు రోజులు మాత్రమే ఉంది. అయినా కూడా సమంత ప్రమోషన్స్‌కు వచ్చే స్థితిలో లేదు. సమంతకు ప్రస్తుతం బెడ్ రెస్ట్ అవసరం. అసలు సమంత తన మొహాన్ని కూడా చూపించకుండా ఫోటోను షేర్ చేసింది. తన వ్యాధి గురించి చెప్పింది. అయితే ఇప్పుడు మాత్రం సమంత తన సినిమా కోసం ఓ అడుగు ముందుకు వేసింది.
Like my good friend @rajndk Raj says , no matter what the day is like, and how shitty things are, his motto is to
Shower
Shave
Show up !!
I borrowed it for a day ♥️
For #yashodathemovie promotions ..
see you on the 11th pic.twitter.com/9u6bZK3cd2— Samantha (@Samanthaprabhu2) November 7, 2022
ప్రమోషన్స్‌లోకి వచ్చేట్టుగా కనిపిస్తోంది. ఈ మేరకు సమంత షేర్ చేసిన ఫోటోలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. చాలా రోజుల తరువాత మళ్లీ సమంత ఇలా కనిపించింది. సమంత మొహంలో చాలానే మార్పులు కనిపిస్తోన్నాయి. ఇంతకు ముందున్నట్టుగా సమంత ఇప్పుడు లేదు. ఆమె ముక్కు, మొహం ఇలా అన్నింట్లోనూ మార్పులు కనిపిస్తున్నాయి. మొత్తానికి మయోసైటిస్ ఎఫెక్ట్ మాత్రం సమంత మీద పడ్డట్టు కనిపిస్తోంది.
అయితే సమంత తన యశోద సినిమా కోసం బయటకు వస్తున్నట్టుగా చెబుతూ ఓ ట్వీట్ వేసింది. ఇందులో తన ఫ్యామిలీ మెన్ దర్శకులైనా రాజ్ అండ్ డీకేలు చెప్పిన సూత్రాన్ని ఇక్కడ చెప్పింది. వారు చెప్పిన మాటలు తనలో ధైర్యాన్ని నింపినట్టుగా చెప్పుకొచ్చింది. నా ఫ్రెండ్స్ రాజ్ అండ్ డీకేలు చెప్పినట్టుగా.. జీవితంలో ఏ రోజు ఏం జరిగినా, ఎంత దరిద్రంగా ఉన్నా.. ఎలాంటి పరిస్థితులు వచ్చినా కూడా.. మనం వాటిని ఎదుర్కొంటూ వెళ్లాలి.. మన సత్తా ఏంటో చూపించాలి.. అదే మాటలు ఈ రోజు నేను తీసుకుంటున్నాను.. అనుసరిస్తున్నాను.. యశోద ప్రమోషన్స్ కోసం వస్తున్నా.. నవంబర్ 11న యశోద చిత్రం రాబోతోంది అంటూ సమంత చెప్పుకొచ్చింది.
సమంత ఎంత డెడికేటెడ్‌గా పని చేసిందో ఉన్ని ముకుందన్ చెబితే.. ఎలాంటి పరిస్థితుల్లో సమంత డబ్బింగ్ చెప్పింది.. ఎంత కష్టపడిందనే విషయాలను నిర్మాత బయటకు చెప్పేశాడు. మరి సమంత కష్టానికి తగ్గ ప్రతిఫలాన్ని యశోద చిత్రం ఇస్తుందా? లేదా? అన్నది చూడాలి.
Also Read : Bigg Boss 6 Nominations List : నామినేషన్స్ హీట్.. మారని శ్రీహాన్, సత్య.. ఈ సారి మూడేది ఎవరికి?
Also Read : Trivikram Birthday : త్రివిక్రమ్ బర్త్ డే స్పెషల్.. సామీ నీ దర్శనం.. ఇది నిదర్శనం
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3P3R74U
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook