Ram Charan: స్టార్ట్ డైరెక్టర్ సినిమా నుంచి రామ్ చరణ్ అవుట్.. మెగా అభిమానులకు గేమ్ చేంజర్ కన్నా పెద్ద షాక్..!

Ram Charan Upcoming Movie: గేమ్ చేంజెర్ సినిమాతో రామ్ చరణ్ డిజాస్టర్ చవిచూసిన సంగతి తెలిసిందే. దీంతో ప్రస్తుతం మెగా అభిమానులు ఆశలన్నీ రాబోయే సినిమాల పైన పెట్టుకో ఉన్నారు.. ఈ క్రమంలో వారికి ఇప్పుడు మరో వార్త షాక్ గురిచేస్తోంది. 

Written by - Vishnupriya Chowdhary | Last Updated : Feb 18, 2025, 02:59 PM IST
Ram Charan: స్టార్ట్ డైరెక్టర్ సినిమా నుంచి రామ్ చరణ్ అవుట్.. మెగా అభిమానులకు గేమ్ చేంజర్ కన్నా పెద్ద షాక్..!

Ram Charan Out of Star Director Movie : ఆర్ఆర్ఆర్ సినిమాతో  తెలుగులోనే కాకుండా నేషనల్ పరంగా ఎంతో పేరు తెచ్చుకున్నారు హీరో రామ్ చరణ్. తెరంగేత్రం చేసింది చిరంజీవి కొడుకుగానే ఆయన.. తన స్వయంకృషి, నటన ద్వారా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు.వరుస సినిమాలు చేస్తూ పాన్ ఇండియా హీరోగా ఎదిగారు ఈ మెగా పవర్ స్టార్. అయితే రామ్ చరణ్ గత చిత్రం గేమ్ చేంజర్ మాత్రం.. ఆయనను, ఆయన అభిమానులను నిరాశకు గురిచేసింది. 
 

ఆర్ఆర్ఆర్ సినిమా తరువాత రామ్ చరణ్ హీరోగా వచ్చిన ఈ చిత్రం మరో బ్లాక్ బస్టర్ గా నిలుస్తుంది అని అందరూ ఎదురు చూస్తుండగా.. ఈ చిత్రం ఎవరు ఊహించని అంత డిజాస్టర్ గా మిగిలింది. దీంతో రామ్ చరణ్ నుంచి రాబోయే సినిమాల పైన ఆశలన్నీ పెట్టుకున్నారు మెగా ఫ్యాన్స్. 

ఇందులో భాగంగా ప్రస్తుతం రామ్ చరణ్ బుచ్చిబాబు సానా తో తన 16వ సినిమా చేస్తున్నారు. ఈ చిత్రం తర్వాత సుకుమార్ దర్శకత్వంతో పాటు ఒక ప్రముఖ బాలీవుడ్ దర్శకుడు దర్శకత్వంలో అత్యంత భారీ బడ్జెట్ మైథాలాజికల్ సినిమా రామ్ చరణ్ చేయబోతున్నారు అనే వార్తలు ఈ మధ్య తెగ జోరుగా వినిపించాయి.

నికిల్ నాగేష్ భట్‌తో కలిసి ఒక పురాణ గాధపై ఆధారిత చిత్రంలో రామ్ చరణ్ కనిపించబోతున్నారని వార్తలు వచ్చాయి. అయితే ఇప్పుడు ఈ సినిమా నుంచి రామ్ చరణ్ బయటకు వెళ్లిపోయారని.. ఈ స్థానంలో విజయ్ దేవరకొండ వచ్చి చేరారని వినికిడి.

ఇటీవల హైదరాబాదులో విజయ్ దేవరకొండతో సమావేశమైన నికిల్, తన పురాణ సినిమాపై చర్చలు జరిపారని, అయితే ప్రాజెక్ట్ గురించి మరింత వివరాలు ఇప్పుడు గోప్యంగా ఉంచబడినట్లు తెలుస్తోంది. ఈ చిత్రం భారీ బడ్జెట్‌తో రూపొందనుంది, అలాగే భారతీయ పురాణాల్లోని ఒక ముఖ్యమైన పాత్రపై ఆధారితంగా ఉంటుంది అని తెలుస్తోంది. ఈ క్రమంలో ఈ సినిమా మిస్ అయినందుకు మెగా అభిమానులు మరింత ఫీలవుతున్నారు. ఇలాంటి చిత్రం రామ్ చరణ్ చేసుంటే మరో మగధీర లేదా ఆర్ఆర్ఆర్ అయిందు  అనేది వారి వాదన.

Also Read: Viral Video: వెన్నులో వణుకు పుట్టిస్తున్న వీడియో.. రెప్పపాటులో ఘోర ప్రమాదం నుంచి బైటపడ్డ బుడ్డొడు..

Also Read: One Nation One Gold Rate: గోల్డ్ రేట్స్ ను కంట్రోల్ చేసేందుకు మాస్టర్ ప్లాన్..అదేంటో తెలుసా?

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

Trending News