Singer Chinmayi Husband : చిన్మయి మొగుడ్ని రకుల్ అలా పిలుస్తుందా?.. ఇద్దరి మధ్య రిలేషన్ ఇదే.. ట్వీట్ వైరల్

Rakul Preet Singh with Rahul Ravindran రకుల్ ప్రీత్ సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్‌గా ఉంటుంది. రాహుల్ రవీంద్రన్‌ తీసిన మన్మథుడు 2 సినిమాలో నాగార్జునకు జోడిగా రకుల్ నటించిన విషయం తెలిసిందే.

Written by - ZH Telugu Desk | Last Updated : Nov 16, 2022, 05:20 PM IST
  • నెట్టింట్లో రకుల్ సందడి
  • రకుల్‌ అవార్డులపై రాహుల్ రవీంద్రన్
  • ఇద్దరి మధ్య రిలేషన్ ఇదే
Singer Chinmayi Husband : చిన్మయి మొగుడ్ని రకుల్ అలా పిలుస్తుందా?.. ఇద్దరి మధ్య రిలేషన్ ఇదే.. ట్వీట్ వైరల్

Rakul Preet Realtion With Rahul Ravindran : రకుల్ ప్రీత్ ప్రస్తుతం తెలుగు సినిమాలకు కాస్త దూరంగా ఉన్నా కూడా అభిమానులకు మాత్రం అందుబాటులోనే ఉంటోంది. నెట్టింట్లో రకుల్ చేసే అందాల ప్రదర్శనతో అభిమానులు ఎంటర్టైన్ అవుతూనే ఉన్నారు. తాజాగా రకుల్ మరోసారి వార్తల్లోకి ఎక్కేసింది. ఓ మీడియా సంస్థ ఇచ్చిన అవార్డును తీసుకుంటూ రకుల్ మురిసిపోయింది. దీని కారణమైన వారందరికీ, నా వెంటే ఉండి నన్ను ప్రోత్సహించిన వారందరికీ థాంక్స్ అంటూ రకుల్ ప్రీత్ ట్వీట్ వేసింది.

రకుల్ వేసిన ఈ ట్వీట్ మీద రాహుల్ రవీంద్రన్ స్పందించాడు. కంగ్రాట్స్ రకుల్ అంటూ నవ్వుతున్న ఎమోజీలను షేర్ చేశాడు. ఇక రాహుల్ వేసిన ట్వీట్‌కు రకుల్ వెంటనే స్పందించింది. థాంక్యూ బడే భయ్యా (పెద్దన్న) అంటూ రెడ్  హార్ట్ సింబల్స్‌ను షేర్ చేసింది. దీనికి రాహుల్ రిప్లై ఇస్తూ హగ్గింగ్ ఎమోజీలను షేర్ చేశాడు. మొత్తానికి చిన్మయి మొగుడ్ని రకుల్ ఇలా బడే భయ్యా అని పిలుస్తుందన్న మాట. ఈ ఇద్దరి మధ్య బ్రదర్ అండ్ సిస్టర్ రిలేషన్ ఉందన్న మాట.

 

రకుల్ పాత్రకు చిన్మయి డబ్బింగ్ చెబుతుందన్న సంగతి తెలిసిందే. రాహుల్ రవీంద్రన్ తెరకెక్కించిన మన్మథుడు 2 సినిమాలో రకుల్ ప్రీత్ హీరోయిన్‌గా నటించింది. నాగార్జున సరసన రకుల్ ప్రీత్ నటించిన ఈ చిత్రం దారుణాతి దారుణంగా డిజాస్టర్‌గా నిలిచింది. ఇందులో సమంత స్పెషల్ అప్పియరెన్స్ చేసింది. నాగార్జున, రాహుల్, చిన్మయి ఇలా అందరి కోసం సమంత ఆ పాత్రను చేసి ఉంటుంది.

కానీ అవుట్ డెటెడ్ స్టోరీ అవ్వడం, కథనం మరింత నాసిరకంగా ఉండటం, రకుల్ లుక్స్, స్మోకింగ్ వంటి సీన్ల మీద విపరీతమైన నెగెటివిటీ రావడంతో మొదటికే మోసం వచ్చింది. చిలసౌ ద్వారా రాహుల్‌కు వచ్చిన క్రేజ్ అంతా కూడా ఈ చిత్రంతో పోయినట్టు అయింది.

Also Read : Deepika Pilli Video : దీపిక పిల్లి.. మరీ ఇంత బుల్లి డ్రెస్సా?.. తెగ ఊపేస్తోన్న హాట్ యాంకర్

Also Read : Mrunal Thakur Photoshoot : ఇంతందం దారి మళ్లిందా?.. సీతారామం బ్యూటీ అందాల ప్రదర్శన.. హాట్ యాంగిల్  

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook

Trending News