Pushpa 2 Incident Arrest: పుష్ప 2 తొక్కిసలాట.. ముగ్గురు అరెస్ట్..

Pushpa 2 Incident Arrest: అల్లు అర్జున్ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ ‘పుష్ప 2’. ఈ మూవీ విడుదలకు ఒక రోజు ముందు హైదరాబాద్ సంధ్య థియేటర్ లో జరిగిన తొక్కిసలాటలో ఒక మహిళ మృతి చెందడంతో పాటు ఓ బాలుడు అపస్మారక స్థితికి చేరుకున్నాడు. ఈ ఘటనపై తాజాగా పోలీసులు ముగ్గురుని అరెస్ట్ చేసారు.

Written by - TA Kiran Kumar | Last Updated : Dec 9, 2024, 08:53 AM IST
Pushpa 2 Incident Arrest: పుష్ప 2 తొక్కిసలాట.. ముగ్గురు అరెస్ట్..

Pushpa 2 Incident Arrest: అల్లు అర్జున్ నటించిన ‘పుష్ప 2’ హిట్ అయ్యేందనే అనే సంతోషం కంటే.. ఈ సినిమా విడుదల సందర్బంగా హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్ లో అల్లు అర్జున్ రాక పురస్కరించుకొని జరిగిన తొక్కిసలాటలో ఓ మహిళ మృతి చెందడం దేశ వ్యాప్తంగా పెద్ద సంచలనమే అయింది. ఈ ఘటనపై పోలీసులు థియేటర్ యాజమాన్యం నిర్లక్ష్యం .. మరోవైపు పోలీసులు వైఫల్యం కొట్టొచ్చినట్టు కనిపిస్తోంది. అటు సినీ ఇండస్ట్రీకి కూడా తన వంతుగా ప్రభుత్వానికి టాక్సులు గట్రా పే చేస్తోంది. ఈ నేపథ్యంలో ఏదైనా పెద్ద సెలబ్రిటీ వచ్చినపుడు చూసుకోవాల్సిన బాధ్యత పోలీసులతో పాటు అక్కడ యాజమాన్యానికి కూడా ఉంది. ఇందులో తిలా పాపం తలా పిడికెడు అన్నట్టు ఈ వ్యవహారంపై  ఇపుడు అరెస్ట్ ల పర్వం కొనసాగుతుంది.

తాజాగా ఈ ఘటనలో తెలంగాణ పోలీసులు  ముగ్గురిని అరెస్టు చేశారు.  సంధ్య థియేటర్ యజమానిని అదుపులోకి తీసుకున్నారు. ఆయనతో  పాటు థియేటర్‌ మేనేజర్‌ , సెక్యూరిటీ మేనేజర్‌ను అరెస్టు చేశారు. ‘పుష్ప 2’ ప్రీమియర్స్ కు  సంబంధఇంచి సరైన భద్రతా చర్యలు చేపట్టడంలో వీరి వైఫల్యం కొట్టిచ్చినట్టు కనిపించందని వీరిపై అభియోగాలు మోపారు. ముగ్గురిని అరెస్టు చేసిన పోలీసులు వారిని రిమాండ్‌కు పంపారు.

పుష్ప 2 ప్రీమియర్ షో సందర్భంగా థియేటర్ యాజమాన్యం నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో తొక్కిసలాట జరిగింది. ఆ ఘటనలో ఓ మహిళ మృతి చెందింది. ఈ ఘటనపై అల్లు అర్జున్ స్పందించి బాధిత కుటుంబానికి అండగా ఉంటానని భరోసా ఇవ్వడంతో రూ. 25 లక్షల పరిహారం ప్రకటించారు. ఈ పరిహారంతో కుటుంబ సభ్యులను తిరిగి తీసుకురాకపోయినా.. వారి అండగా ఉంటానని భరోసా ఇచ్చారు. ఓ రకంగా అల్లు అర్జున్ చర్య కంటి తుడుపు చర్యగా భావిస్తున్నారు. సినిమాలకు కోట్లకు కోట్లు తీసుకునే హీరో.. కేవలం రూ. 25 లక్షల పరిహారం ఏమిటి అనే చర్చ నడుస్తోంది. పైగా చనిపోయినా మూడు రోజులకు కానీ బన్ని స్పందించలేదు. ఏది ఏమైనా పుష్ప 2 సంఘటనతో తెలంగాణలో ఇకపై బడా హీరోల సినిమాలకు ప్రీమియర్స్ కు ఎలాంటి అనుమతులు ఇవ్వమని ప్రభుత్వం తెగేసీ చెప్పింది. ఈ సినిమా హిందీలో మూడు రోజుల్లో రూ. 205 కోట్ల నెట్ వసూళ్లను రాబట్టి సంచలనం రేపింది. మరోవైపు మూడు రోజుల్లో రూ. 621 కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టినట్టు సినిమా నిర్మాతలు ప్రకటించారు. ఆదివారం రోజు ఆఫ్ లైన్.. ఆన్ లైన్ టికెట్ సేల్స్ బట్టి.. ఈ సినిమా రూ. 80 కోట్ల షేర్.. (రూ. 160 కోట్ల గ్రాస్) వసూళ్లను రాబట్టే అవకాశాలున్నాయని చెబుతున్నారు.

ఇదీ చదవండి: ముగ్గురు మొనగాళ్లు సినిమాలో చిరంజీవి డూప్ గా నటించింది వీళ్లా.. ఫ్యూజలు ఎగిరిపోవడం పక్కా..

ఇదీ చదవండి:  టాలీవుడ్ లో ఎక్కువ ప్రీ రిలీజ్ బిజినెస్ చేసిన చిత్రాలు.. ‘పుష్ప 2’ ప్లేస్ ఎక్కడంటే..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

Trending News