Pushpa The Rule:
అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన పుష్ప చిత్రం తెలుగులోనే కాకుండా ఇతర భాషలలో కూడా మంచి సక్సెస్ సాధించింది. ముఖ్యంగా ఈ సినిమా నార్త్ సైడ్ లో ఎక్కువగా కలెక్షన్స్ తెచ్చి పెట్టుకుంది. అయితే పుష్ప 1 చిత్రం విడుదల అయ్యే సమయానికి బాలీవుడ్ లో పోటీ కాస్త లిమిటెడ్ గానే ఉంది. అక్కడ అప్పుడు స్టార్ హీరోల సినిమాలు ఏపీ విడుదల కాలేదు. దీంతో ఆ మూవీకి మంచి సానుకూల మార్కెట్ ఏర్పడింది. కోలీవుడ్ లో కూడా అప్పట్లో పరిస్థితి దాదాపు అలానే ఉనిండి. అందుకే కలెక్షన్స్ పరంగా తెలుగు తో పాటు ఇతర భాషల్లో కూడా ఈ చిత్రం అద్భుతంగా వసూలు రాబట్టింది.
అయితే రాబోయే మూవీ సీక్వెల్ కి మాత్రం గట్టి పోటీ తప్పేలా.. కనిపించడం లేదు. ఇటు బాలీవుడ్ లో.. అటు తమిళ్ మార్కెట్ లో.. ఈ చిత్రానికి పోటీగా రావడానికి పెద్ద మూవీలు సిద్ధంగా ఉన్నాయి. ఈ నేపథ్యంలో పుష్ప 2 కలెక్షన్స్ పై వీటి ప్రభావం భారీగా పడే అవకాశం ఉంది అంటున్నారు సినీ విశ్లేషకులు.
పుష్ప 2 విడుదల సమయానికి రోహిత్ శెట్టి, తలపతి విజయ్, సూపర్ స్టార్ రజనీకాంత్ మూవీస్ విడుదల అయ్యే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. రోహిత్ శెట్టి సక్సెస్ఫుల్ కాప్ యూనివర్స్‌లో భాగమైన మసింగం ఎగైన్, రాజకీయ రంగ ప్రవేశానికి ముందు విజయ్ నటించిన గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్, సూపర్ స్టార్ రజినీకాంత్ వేట్టైయన్ ఆగస్టు విడుదలకు పోటీ పడుతున్నాయి. ఈ భారీ ప్రాజెక్టులు తమిళ్..ఇంక హిందీ మార్కెట్స్ పై తీవ్ర ప్రభావాన్ని చూపిస్తాయి కాబట్టి అక్కడ పుష్ప కలెక్షన్స్ విషయం అయోమయంలో పడే అవకాశం ఎక్కువగా ఉంది. పుష్ప పేరుకు తెలుగు చిత్రం అయినా హిందీ ,తమిళ్ భాషలలో విశేష ఆదరణ అందుకుంది కాబట్టే పార్ట్ వన్ కలెక్షన్స్ పరంగా సెన్సేషన్ సాధించగలిగింది.
ఇక మొదటి చిత్రం సూపర్ డూపర్ సక్సెస్ సాధించడంతో సీక్వెల్ గా వస్తున్న ఈ మూవీకి బడ్జెట్ భారీగానే పెట్టారు. ఎన్నో రిస్కీ షార్ట్స్ తో.. భారీ సెట్స్ మధ్య ఈ చిత్రాన్ని అద్భుతంగా తెరకెక్కించుతున్నారు అని టాక్. పుష్ప ది రైజ్ బాక్సాఫీస్ వద్ద 373 కోట్లకు పైగా వసూలు చేసి.. 2021లో అత్యధికంగా కలెక్షన్స్ సాధించిన ఇండియన్ మూవీ గా రికార్డ్ సృష్టించింది. దీంతో ప్రస్తుతం పుష్ప1 రికార్డ్స్ ని పుష్ప2 పునరావృతం చేయడంలో సక్సెస్ సాధిస్తుందా లేదా పోటీ వల్ల సమస్యలు ఏర్పరుతాయా అన్న విషయం పెద్ద ప్రశ్నార్ధకంగా మారింది.
Read More: Pragya Jaiswal Bikini Pics: బికినీలో బ్లాస్ట్ చేసిన ప్రగ్యా జైస్వాల్.. మరి ఇంతలానా..!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link: https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link: https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook