Nag Ashwin Alia Bhatt Movie: ప్రభాస్ పేరు ఇప్పుడు బాలీవుడ్ టాప్ స్టార్స్‌కంటే పెద్ద స్థాయికి చేరుకుంది. దేశవ్యాప్తంగా అభిమానులను సంపాదించుకుంటూ..పాన్ ఇండియా స్టార్‌గా ఎదుగుతున్నారు. ప్రస్తుతం ఆయన రాజా సాబ్, ఫౌజీ అనే రెండు సినిమాల్లో నటిస్తున్నారు. మరో సినిమా స్పిరిట్, సందీప్ వంగా దర్శకత్వంలో ఈ ఏడాది ప్రారంభం కానుంది. ఇలా వచ్చే రెండు సంవత్సరాల పాటు ప్రభాస్ షెడ్యూల్ పూర్తిగా బిజీగా ఉంది.
ఇక కల్కి 2, సలార్ 2 సినిమాలు కూడా ప్రభాస్ చేయాల్సిన ప్రాజెక్ట్స్‌లో ఉన్నాయి. అయితే, వీటి స్థితిగతుల పై ఇప్పటి వరకు క్లారిటీ రాలేదు. ముఖ్యంగా కల్కి 2 కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇందులో ప్రభాస్ పాత్ర ఏ విధంగా ఉండబోతుందనే అంశంపై ఉత్కంఠ నెలకొంది. దర్శకుడు నాగ్ అశ్విన్, ప్రభాస్‌ని మహాభారతం నుంచి కర్ణుడిగా చూపించనున్నారా అనే ప్రశ్న అభిమానుల్లో ఉంది. కల్కి 2898 ఏ.డి మొదటి భాగం రూ. 1100 కోట్ల వసూళ్లు సాధించింది. అందుకే రెండో భాగం మరింత భారీగా ఉంటుందనే అంచనాలు ఉన్నాయి.
అయితే, నాగ్ అశ్విన్ తన తదుపరి ప్రాజెక్ట్‌ను కల్కి 2 పూర్తయ్యే వరకు ప్రారంభించబోనని చెప్పినా, తాజా సమాచారం ప్రకారం అతను ఇప్పుడు కల్కి పక్కనపెట్టి.. మరో సినిమా ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తోంది. ప్రభాస్ బిజీ షెడ్యూల్ కారణంగా కల్కి 2 ప్రస్తుతం నిలిచిపోయింది. అయితే, బాలీవుడ్ వర్గాల సమాచారం ప్రకారం, నాగ్ అశ్విన్ ఇప్పుడు అలియా భట్‌తో ఓ సినిమా చేసేందుకు సిద్ధమవుతున్నారని వార్తలు వస్తున్నాయి.
అలియా భట్ గతంలో రాజమౌళి RRR చిత్రంలో నటించి దేశవ్యాప్తంగా పేరు తెచ్చుకుంది. ఇప్పుడు నాగ్ అశ్విన్ ఆమెకు ఓ స్టోరీ నేరేట్ చేశారని తెలుస్తోంది. ఈ కథ అలియాకు ఎంతో నచ్చిందని, ఇద్దరి మధ్య అనేక చర్చలు జరిగినట్లు సమాచారం. ఇక ఈ సినిమా బడ్జెట్ ఫైనల్ అయిన తర్వాత అధికారికంగా ప్రకటించనున్నారని అంటున్నారు. అయితే ఈ వార్త తెలుసుకొని ప్రభాస్ అభిమానులు నిరాశ వ్యక్తం చేస్తున్నారు. తాము ఎన్నో ఆశలు పెట్టుకున్న ప్రభాస్ సినిమాను పక్కనపెట్టి.. నాగ్ అశ్విన్ ఆలియా సినిమా కోసం ప్రస్తుతం టైం కేటాయించడం పై అసహనం వ్యక్తం చేస్తున్నారు.
కాగా ప్రస్తుతం ప్రభాస్ రెండు సినిమాలతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ది రాజా సాబ్, సలార్ పార్ట్ 2 – శౌర్యాంగ పర్వం రెండు సినిమాల మీద భారీ అంచనాలున్నాయి. ది రాజా సాబ్ తెలుగు హారర్ కామెడీ సినిమా. మారుతి దర్శకత్వంలో పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మిస్తోంది. ఇందులో ప్రభాస్ డబుల్ రోల్ చేస్తున్నారని సమాచారం. నిధి అగర్వాల్, మాళవిక మోహనన్, రిధి కుమార్, బాబీ డియోల్, సంజయ్ దత్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు.
Also Read: KTR Letter To Nirmala: 'మిమ్మల్ని ప్రజలు క్షమించరు.. తెలంగాణ ముమ్మాటికి మిగులు రాష్ట్రమే!'
Also Read: Schools Holiday: ఈనెల 19న పాఠశాలలకు సెలవు.. ఎందుకంటే తెలుసా?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.