Naga Chaitanya cooks chepala pulusu video: నాగచైతన్య, సాయిపల్లవిలు హీరో, హీరోయిన్లుగా నటిస్తున్న తండేల్ మూవీ ఫిబ్రవరి 7న అభిమానుల ముందుకు రానుంది. ఈ మూవీకి చందు మొండెటి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ మూవీ షూటింగ్ లో భాగంగా ఇటీవల చిత్ర యూనిట్ విశాఖ పట్నం, శ్రీకాకుళంకు వెళ్లారు. అక్కడ చిత్రీకరణ సమయంలో చైతు.. మత్య్సకారుల కోసం చేపలు పులుసు వండారు.
Chepela Pulusu by Thandel Raju aka #NagaChaitanya.#Thandel pic.twitter.com/Wg2xeUysJi
— Gulte (@GulteOfficial) January 17, 2025
ఈ షూటింగ్ లో గతంలో చైతు.. స్థానికులతో చేపల కూర వండిపెడతానని మాటిచ్చారు. ఆయన ఇచ్చిన మాట ప్రకారం.. కట్టెల పోయి మీద.. కడయ్ లో చేపల పులుసు వండి అక్కడి వాళ్లకు ఆప్యాయంగా పెట్టారు. దీంతో స్థానికులు.. లొట్టలేసుకుంటూ.. చైతు వండిన చేపల పులుసును తినేశారు. చేపల పులుసు కమ్మగా ఉందని..ఈ మూవీకోసం చైతు, మూవీ టీమ్ బాగా కష్టపడుతున్నారని.. ఈ సినిమా మంచి హిట్ కొట్టాలని అభిమానులు ఎమోషనల్ గా మాట్లాడారు.
అయితే... చైతు చేపల పులుసు వండటం, అక్కడి వాళ్లకు ప్రేమతో వడ్డించిన వీడియో సామాజిక మాధ్యమాలలో వైరల్ గా మారింది. దీన్ని చూసిన అభిమానులు మాత్రం.. భలే వండాడ్రా.. అంటూ ఫన్నీగా కామెట్లు చేస్తున్నారు..
ఇదిలా ఉండగా.. సాయిపల్లవి ప్రస్తుతం ఒక వైపు తెలుగులో తండేల్ మూవీతో పాటు.. బాలీవుడ్ లో రామయణ్ షూటింగ్ లో బిజీగా ఉన్నారు. ఈ మూవీ రెండు పార్ట్ లుగా విడుదలు కానుంది. మొదటి పార్ట్ దీపావళికి కానుకగా రానుందని మేకర్స్ ప్రకటించారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Facebook, Twitter