Anil-Chiru Movie: వెంకటేశ్, ఐశ్వర్య రాజేశ్, మీనాక్షి చౌదరి నటీనటులుగా అనిల్ రావిపూడి తెరకెక్కించిన సంక్రాంతికి వస్తున్నాం ఎంత హిట్ సాధించిందో అందరికీ తెలుసు. ఇప్పుడు మెగాస్టార్ చిరుతో భారీ సినిమా ప్రకటన వచ్చేసింది. ఈ వేసవిలో సినిమా షూటింగ్ ప్రారంభం కానుందని చిరంజీవి స్వయంగా ప్రకటించడం విశేషం.
సంక్రాంతికి వస్తున్నాం సినిమా సాధించిన సక్సెస్‌తో దర్శకుడు అనిల్ రావిపూడి పేరు మార్మోగిపోతోంది. మంచి హాస్యం, ఫ్యామిలీ స్టోరీ నేపధ్యంతో అనిల్ రావిపూడి సినిమాలకు క్రేజ్ పెరుగుతోంది. ఈ క్రమంలో అనిల్ రావిపూడి తన తదుపరి సినిమాను మెగాస్టార్ చిరంజీవితో చేయనున్నట్టు వార్తలు ప్రచారంలో ఉన్నాయి కానీ అధికారికంగా ఇప్పటి వరకూ ఎలాంటి ప్రకటన రాలేదు. కానీ ఇప్పుడు స్వయంగా చిరంజీవి ఆ ప్రకటన చేశారు. షైన్ స్క్రీన్స్ బ్యానర్‌పై విశ్వక్ సేన్ హీరోగా సాహు గారపాటి నిర్మించిన లైలా చిత్రం ప్రీ రిలీజ్ వేడుకకు చిరంజీవి హాజరయ్యారు. ఆయనతో పాటు అనిల్ రావిపూడి కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా చిరంజీవి స్వయంగా తన 157వ సినిమా అనిల్ రావిపూడితో వస్తోందని వెల్లడించారు.
ఈ వేసవిలో అనిల్ రావిపూడితో సినిమా షూటింగ్ ప్రారంభం కానుందని తెలిపారు. ఈ సినిమా పూర్తిగా హాస్యం ప్రధానంగా ఉంటుందని చిరంజీవి తెలిపారు. సినిమా చూసినంతసేపు కడుపుబ్బా నవ్వించే సన్నివేశాలు ఉంటాయన్నారు. కధ చెప్పినప్పుడు నవ్వకుండా ఉండలేకపోయానన్నారు. తనకు కూడా ఎప్పుడెప్పుడు ఈ సినిమాలో నటించాలా అనే ఆసక్తి ఎక్కువగా ఉందన్నారు. అనిల్ రావిపూడితో సినిమాను స్వయంగా చిరంజీవి ప్రకటించడంతో మెగా అభిమానులు ఖుష్ అవుతున్నారు.
Also read: Chiranjeevi: బాలయ్య కాంపౌండ్.. మెగా కాంపౌండ్.. చిరంజీవి ఆసక్తికర వ్యాఖ్యలు..!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి