Manchu Vishnu jalpally controversy: మంచు మోహన్ బాబు ఇటీవల తరచుగా వార్తలలో ఉంటున్నారు. ఈక్రమంలో సొంత కొడుకు మనోజ్ వర్సెస్ మోహన్ బాబుగా మారిపోయిందని చెప్పుకొవచ్చు.ఈ ఘటన ఒకవైపు ఇండస్ట్రీలో కూడా.. మరోవైపు రాజకీయంగా కూడా తీవ్ర చర్చనీయాంశంగా మారినట్లు తెలుస్తొంది. అయితే.. మంచు మోహన్ మాత్రం కొన్నిరోజులుగా పోలీసులకు చిక్కకుండా ఉన్నట్లు తెలుస్తొంది.
మరో వివాదంలో మంచు విష్ణు సిబ్బంది.
జల్పల్లిలోని అడవిలో అడవి పందులను వేటాడిన మంచు విష్ణు సిబ్బంది
అడవిలోకి వెళ్లి అడవి పందులను వేటాడి తీసుకెళ్లిన మేనేజర్ కిరణ్
వేటాడిన అడవి పందిని బంధించి తీసుకువెళ్లిన ఎలక్ట్రీషియన్ దేవేంద్ర ప్రసాద్ pic.twitter.com/FQmfix1OSD
— Telugu Scribe (@TeluguScribe) December 31, 2024
మంచు మోహన్ బాబు ఇప్పటికే అరెస్ట్ నుంచి మినహాయింపు ఇవ్వాలని హైకోర్టులో దాఖలు చేసిన పిటిషన్ ను కొట్టి వేసింది. ఏ నిమిషమైన ఆయనను పోలీసులు అరెస్ట్ చేస్తారని వార్తలు వస్తున్నాయి. మరొవైపు ఆయన దుబాయ్ కు వెళ్లిపోయారని కూడా వార్తలు జోరుగా ప్రచారంలో ఉంటున్నాయి. ఈ నేపథ్యంలో తాజాగా మంచు ఫ్యామిలీ మరో వివాదంలో ఇరుకున్నట్లు తెలుస్తొంది. మంచు విష్ణు సిబ్బంది జల్ పల్లి ఫారెస్ట్ లో అడవి పందుల్ని వేటాడిన వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి.
మంచు విష్ణు సిబ్బందిలోని మేనేజర్ కిరణ్ చిట్ట అడవిలోకి వెళ్లి అడవి పందులను వేటాడినట్లు తెలుస్తొంది. వేటాడిన అడవి పందిని ఎలక్ట్రిషన్ దేవేంద్ర ప్రసాద్ బంధించి తీసుకువెళ్లినట్లు ఆ వీడియోలో స్పష్టంగా రికార్డు అయ్యింది. అయితే.. అడవి పందుల్ని వేటాడటంపై ఇప్పటికే పలు మార్లు మంచు విష్ణు సిబ్బందికి హెచ్చరించినట్లు తెలుస్తొంది.
Read more: Mohan Babu: అరెస్ట్ భయంతో దుబాయి పారిపోయిన పెదరాయుడు..? ఆ క్లారిటీతోనే అలా చేయాల్సి వచ్చిందా?
ఈ క్రమంలో వైరల్ అవుతున్న ఈ వీడియోపై జంతు ప్రేమికులు మాత్రం మండిపడుతున్నారు. విష్ణు సిబ్బందిపై.. వన్యప్రాణుల చట్ట ఉల్లంఘన కింద చర్యలు తీసుకొవాలని కూడా డిమాండ్ చేస్తున్నారు. దీంతో ప్రస్తుతం ఫారెస్ట్ సిబ్బంది దీనిపై రంగంలోకి దిగనున్నట్లు కూడా తెలుస్తొంది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Facebook, Twitter