మూవీ రివ్యూ: గాంధీ తాత చెట్టు
నటీనటులు: సుకృతి వేణి, ఆనంద్ చక్రపాణి, భాను ప్రకాష్, నేహాల్ ఆనంద్ కుంకుమ, రఘురామ్,రాగ్ మయూర్ తదితరులు
సంగీతం: రీ
సినిమాటోగ్రఫీ: శ్రీజిత్ చెర్వుపల్లి, విశ్వ దేవబత్తుల
ఎడిటింగ్: హరి శంకర్ టీఎన్
నిర్మాణ సంస్థలు: మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్, గోపీ టాకీస్
నిర్మాతలు: యలమంచలి రవిశంకర్, నవీన్ ఎర్నేని, శేష సింధురావు
రచన, దర్శకత్వం: మల్లాది పద్మావతి
రిలీజ్ డేట్: 24 జనవరి 2025
తెలుగు సినిమా అంటేనే కమర్షియల్ చిత్రాలకు కేరాఫ్ అడ్రస్. సినిమాలు ప్రారంభమైనప్పటి నుంచి కమర్షియల్ చిత్రాలతో పాటు కళాత్మక చిత్రాలు వస్తూనే ఉన్నాయి. ఈ కోవలో వచ్చిన మరో చిత్రం ‘గాంధీ తాత చెట్టు’. పూర్తి కమర్షియల్ అంశాలకు దూరంగా లేడీ డైరెక్టర్ మల్లాది పద్మావతి తెరకెక్కించిన ఈ సినిమాలో సుకుమార్ కూతురు సుకృతి వేణి నటించింది. మరి ఈ సినిమా ప్రేక్షకులను మెప్పించేలా ఉందా లేదా మన మూవీ రివ్యూలో చూద్దాం..
కథ విషయానికొస్తే..
తెలంగాణలోని నిజామాబాద్ జిల్లా ఆలూరి గ్రామానికి చెందిన రామచంద్రయ్య (ఆనంద్ చక్రపాని)కి 15 ఎకరాల పొలం ఉంటుంది. అందులో చెరుకు పంటను పండిస్తుంటారు. తన తండ్రి నుంచి వారసత్వం గా ఆ భూమితో పాటు అక్కడే ఉన్న వేప చెట్టు అంటే అతనికి ఆరో ప్రాణం. మహాత్మ గాంధీ కన్నుమూసినపుడు ఆయనకు గుర్తుగా ఆ చెట్టును తన తండ్రితో కలిసి నాటుతాడు రామచంద్రయ్య. ఆ చెట్టుకు ఏమైనా తట్టుకోలేడు. అంతేకాదు ఆ తర్వాత పుట్టిన మనవరాలికి మహాత్ముడిపై ప్రేమతో గాంధీ (సుకృతి వేణి) పేరు పెడతాడు. ఆమె అదే ఊళ్లో చదువుకుంటోంది. చెరుకు పంట పండించే ఈ గ్రామంలో ఉన్న స్థానిక మంత్రి కారణంగా షుగర్ ఫ్యాక్టరీ మూత పడటంతో అక్కడి స్థానికులు అప్పుల పాలైవుతారు. దీంతో అప్పుల పాలైన ఆ ఊరి ప్రజల దగ్గర నుంచి ఓ బిజినెస్ మ్యాన్ (రాగమయూర్) పొలాలను కొనే పనిలో పడతాడు. ఈ నేపథ్యంలో రామచంద్రయ్య కుమారుడు ఆ వ్యాపారికి పొలం అమ్మేసి పట్నం పోతానంటాడు. కానీ రామచంద్రయ్య మాత్రం పొలం అమ్మడానికి ససేమిరా అంటాడు. కొడుకు పొలం అమ్మబోతున్నాడని తెలుసుకొని గాంధీ తాత చెట్టు దగ్గరకు వెళ్లి ప్రాణాలు విడుస్తాడు. చనిపోతూ ఈ చెట్టును కాపాడే బాధ్యతను తన మనవరాలికి అప్పగిస్తాడు. తాతకు ఇచ్చిన మాట కోసం గాంధీ ఏం చేసింది. చెట్టుకు కాపాడుకోవడానికి గాంధీ ఎలాంటి ప్రయత్నాలు చేసిందనేదే ‘గాంధీ తాత చెట్టు’ సినిమా స్టోరీ.
ఇదీ చదవండి : చిరంజీవి, కీర్తి సురేష్ తల్లితో రొమాన్స్ చేసిన ఈ సినిమా తెలుసా..! అందులో మెగాస్టార్ విలన్..
కథనం, టెక్నికల్ విషయానికొస్తే..
గత కొన్నేళ్లుగా తెలుగులో తెలంగాణ నేపథ్యంలో సినిమాలు తెరకెక్కుతున్నాయి. ఈ నేపథ్యంలో తెలుగులో కమర్షియల్ సినిమాలకు కొత్త దారి చూపించి దర్శకుడు సుకుమార్.. లేడీ డైరెక్టర్ పద్మావతి మల్లాది చెప్పిన కథ విని.. నిర్మాతగా ‘గాంధీ తాత చెట్టు’ వంటి కళాత్మక చిత్రాన్ని నిర్మించడాన్ని మెచ్చుకోవాలి. ఓ దర్శకుడిగా ఆయనకు సినిమా కథపై ఉన్న పట్టును తెలుపుతుంది. ఈ సినిమాలో సుకుమార్ కూతురు సుకృతి వేణు గాంధీ పాత్రలో అత్యద్భుతన నటనను దర్శకురాలు రాబట్టుకొంది. తెలంగాణలో నిజామాబాద్ లో చెరుకు పంట పండించే రైతుల పరిస్థితిని కళ్లకు కట్టించేలా తెరకెక్కించింది. ఎపుడో మహాత్మ గాంధీ చనిపోయినపుడు తన తండ్రితో కలిసి నాటిన చెట్టు అంటే ప్రాణంలా భావించే పెద్ద మనిసి. అప్పులు పాలు కావడంతో ఉన్న పొలాన్ని అమ్మి ఊరికి వెళ్లాలనుకునే కుమారుడు. పుట్టి పెరిగిన స్థలాన్ని విడిచి వేరే ప్రాంతానికి వెళ్లడానికి మనసొప్పనటు వంటి సామాన్య రైతు అంతరంగాన్ని తెరపై చక్కగా ఆవిష్కరించడంలో దర్శకురాలు సఫలమైంది.
ముఖ్యంగా చిత్ర ప్రారంభంలోనే గాంధీ తాత చెట్టు కాన్పెప్ట్ ను చూపెట్డడం. తాతకు ఇచ్చిన మాట కోసం తన పొలంలో ఉన్న చెట్టును కాపాడుకోవడానికి ఎలాంటి పోరాటం చేసిందనేది తెరపై చివరికంటా ఆసక్తి రేకెత్తించేలా దర్శకురాలు ఈ సినిమాను కథను మలచడం ఆసక్తి రేకిస్తోంది. ముఖ్యంగా కార్పోరేట్టు బలిసిన వ్యాపారవేత్తల చేతిలో రైతులు ఎలా అన్యాయం అయిపోతున్నారనే విషయాన్ని ప్రస్తావించడం బాగుంది. అంతేకాదు సుకృతి వేణితో అద్భుత నటన రాబట్టుకొంది. తెలంగాణ పల్లె వాతావరణాన్ని తెరపై చక్కగా ప్రతిబించింది. మొత్తంగా సినిమా దర్శకురాలిగా పద్మావతి గట్స్ ను మెచ్చుకోవాలి. ఇలాంటి సబ్జెక్ట్ ను తెరపై రావడానికి సుకుమార్ చేసిన ప్రయత్నాన్ని మెచ్చుకోవాలి. కమర్షియల్ చిత్ర దర్శకుడిగా భారతీయ చిత్ర పరిశ్రమలో తన కంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న సుకుమార్ ఈ చిత్రాన్ని ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా మైత్రీ మూవీ మేకర్స్ వాళ్లతో నిర్మించడంలో ఎక్కడా కాంప్రమైజ్ కాలేదు. సినిమాటోగ్రఫీ బాగుంది. రీ ఇచ్చిన రీ రికార్డింగ్ బాగుంది.
నటీనటుల విషయానికొస్తే..
సుకుమార్ కూతురు సుకృతి వేణి తన నటనతో ఆకట్టుకుంది. సన్నివేశాలకు తగ్గట్టు తన యాక్టింగ్ తో మెప్పించింది. ఈ క్యారెక్టర్ కోసం గుండు గూయించుకోని ఈ పాత్రపై మమకారాన్ని చూపించింది. అంతేకాదు తాత చనిపోయే సీన్ లో చెట్టును కాపాడుతాననే సీన్స్ లో ఎమోషనల్ గా నటించి మెప్పించింది. మిగిలిన సన్నివేశాల్లో ఆకట్టుకుంది. నటిగా సుకృతి వేణికి మంచి భవిష్యత్తు ఉంది. ఈ సినిమాలో తాత పాత్రలో నటించిన ఆనంద్ చక్రపాణి తన పాత్రకు న్యాయం చేసాడు. మిగిలిన పాత్రల్లో నటించిన నటీనటులు తమ పరిధి మేరకు మెప్పించారు.
పంచ్ లైన్.. ‘గాంధీ తాత చెట్టు’ఎమోషనల్ హార్ట్ టచింగ్ మూవీ
రేటింగ్: 2.75/5
ఇదీ చదవండి: గడ్డకట్టే చలిలో నాగ సాదువులు నగ్నంగానే ఎందుకు ఉంటారు.. అసలు రహస్యం అదేనా..!
ఇదీ చదవండి : ప్రస్తుత మార్కెట్ వాల్యూ ప్రకారం నాగార్జున ‘అన్నపూర్ణ స్టూడియో’ మార్కెట్ విలువ ఎంతో తెలుసా..?