Chhaava Movie 1st day Box office Collecions: ప్రస్తుతం బాలీవుడ్ సహా దేశ వ్యాప్తంగా వివిధ ఇండస్ట్రీల్లో మనకు గత ప్రభుత్వాలు చెప్పని చరిత్రను వెలికితీస్తున్నారు చిత్ర నిర్మాతలు. ఇప్పటి వరకు మొఘల్ ఏ ఆజం, జోదా అక్బర్ వంటి వాటి కథలనే సినిమాలు తీసి ప్రేక్షకులపై రుద్దారు. గత ప్రభుత్వాలు లెఫ్ట్ లిబరల్ ఏకో సిస్టంలో భాగంగా ఎవరో ఏదో అనుకుంటారని మన చరిత్రను తొక్కి పట్టారు.కానీ తరం మారింది. సోషల్ మీడియా పుణ్యామా..అని ఎక్కడో పాతాళంలోకి తొక్కి పడేసిన చరిత్రలను సినిమాలుగా తీసి ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. ఈ కోవలో తానాజీ, ది కశ్మీర్ ఫైల్స్, ది కేరళ స్టోరీ, కేసరి, సామ్రాట్ పృథ్వీరాజ్ వంటి మన దేశ భక్త రాజుల గురించి సినిమాలను తెరకెక్కిస్తూ ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. ఈ కోవలో వచ్చిన మరో దేశ భక్తుడి చిత్రం ‘ఛావా’.
మొఘల్ సామ్రాజ్యాన్ని గడగడ లాడించిన ఛత్రపతి శివాజీ కుమారుడు .. ఛత్రపతి శంభాజీ మహారాజ్ జీవితకథే తెరరూపం ఇచ్చారు. ఛత్రపతి శివాజీకి ఏ మాత్రం తగ్గని పౌరుషం, పరాక్రమం శంభాజీ సొంతం. చరిత్రలో మరుగున పడిన శంభాజీ మహారాజ్ జీవిత కథను తెరరూపం ఇచ్చిన చిత్రమే ‘ఛావా’. ఈ సినిమాలో ‘శంభాజీ మహారాజ్’ పాత్రలో విక్కీ కౌశల్ నటించాడనే కంటే జీవించాడనే చెప్పాలి. ఆ పాత్రలో లీనమై నటించాడు. సినిమా కాదు మన చరిత్ర అని చెప్పాలి.
ఇదీ చదవండి: తాగుడుకు బానిసై సినీ కెరీర్ నాశనం.. 44 ఏళ్ల వయసులో స్టార్ హీరోయిన్ రెండో పెళ్లి..
ఇదీ చదవండి: వై టార్గెట్ చిరంజీవి.. ? మెగా ఫ్యామిలీని కావాలనే టార్గెట్ చేశారా..?
సినిమా విడుదలైన ప్రతి చోటా సూపర్ పాజిటివ్ టాక్ తో దుమ్ము దులుపుతుంది. ఈ సినిమా మొదటి రోజు భారతీయ బాక్సాఫీస్ దగ్గర రూ. 33.10 కోట్ల నెట్ వసూళ్లను రాబట్టింది. ఓవరాల్ గా ప్రపంచ వ్యాప్తంగా రూ. 50 కోట్ల నెట్ వసూల్లు.. ప్రపంచ వ్యాప్తంగా రూ. 88 కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టినట్టు ట్రేడ్ వర్గాలు పేర్కొంటున్నాయి. విక్కీ కౌశల్ గత చిత్రాల విషయానికొస్తే.. బ్యాడ్ న్యూస్ 8.62 కోట్లు నెట్ వసూల్లతో టాప్ లో ఉంది. ఆ తర్వాత ‘యూరీ’ మూవీ.. రూ. 8.20 కోట్ల నెట్ వసూల్లు.. రాజీ మూవీ.. రూ. 7.53 కోట్ల నెట్ వసూల్లు.. సామ్ బహదూర్.. రూ. 6.25 కోట్లు నెట్ వసూల్లు.. జరా హట్కే జరా బచ్చే సినిమా.. రూ. 5.49 కోట్లు.. భూత్.. రూ. 5.10 కోట్లు.. మన్ మార్జియా.. రూ. 3.52 కోట్లు.. రమన్ రాఘవ్ 2.O.. రూ. 1.10 కోట్లు.. రాబట్టింది. ఇందులో సంజు, డంకీ మూవీలు మల్టీస్టారర్ మూవీస్ కాబట్టి ఇందులో యాడ్ చేయలేదు. మరోవైపు శనివారం ఈ సినిమాకు అన్ని చోట్లా సాలిడ్ బుకింగ్స్ ఉన్నాయి. రేపు ఆదివారం కూడా బాక్సాఫీస్ దగ్గర కుమ్మేయడం గ్యారంటీ అని చెబుతున్నారు. మొత్తంగా మూడు రోజుల్లో రూ. 100 కోట్ల గ్రాస్ వసూళ్లను బ్రేక్ చేయడం గ్యారంటీ అని చెప్పొచ్చు. మొత్తంగా 2025లో బాలీవుడ్ లో బిగ్గెస్ట్ ఓపెనర్ గా సాలిడ్ స్టార్ట్ సొంతం చేసుకుంది.
ఇదీ చదవండి: అల్లు అర్జున్ నిజంగానే రామ్ చరణ్ అన్ ఫాలో చేశాడా.. తెర వెనక అసలు స్టోరీ ఇదే..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.