Chhaava Movie 6th day Box office Collecions: ఛత్రపతి శివాజీ తనయుడు ‘ఛత్రపతి శంభాజీ మహారాజ్’ లైఫ్ స్టోరీతో తెరకెక్కిన ఈ సినిమా పూటకో రికార్డుల తుక్కును ఒదలగొడుతుంది. రష్మిక మందన్న తప్ప పెద్దగా స్టార్ క్యాస్ట్ ఇందులో ఏమి లేదు. కేవలం కథ మాత్రమే ఇందులో హీరో. ఇక ‘ఛావా’ అంటే కుమారుడు అని అర్ధం. ఛత్రపతి శివాజీ మహారాజ్ పెద్ద కుమారుడైన ‘శంభాజీ మహారాజ్’ను ‘ఛావా’ అని ముద్దుగా పిలుస్తుంటారు. అదే ఈ సినిమాకు టైటిల్ గా పెట్టారు. ముఖ్యంగా గత కొన్నేళ్లుగా బాలీవుడ్ చిత్ర పరిశ్రమలో హిందూ వ్యతిరేక చిత్రాల నుంచి హిందూ భావోద్వేగాలను ఒడిసి పట్టే జాతీయ భావన ఉన్న చిత్రాలు తెరకెక్కడం విశేషమనే చెప్పాలి. ఈ సినిమా మల్టీస్టారరా.. అంటే అది కాదు. పెద్ద డైరెక్టర్ తెరకెక్కించాడా అంటే అది లేదు.
ఇక మన సోకాల్డ్ తెలుగు, తమిళ, హిందీ స్టార్ హీరోలెవరు ఈ సినిమా గురించి సామాజిక మాధ్యమాల్లో ఈ సినిమాపై స్పందిచడం కూడా లేదు.ఒక రకంగా విక్కీ కౌశల్ వంటి ఎలాంటి స్టార్ బ్యాక్ గ్రౌండ్ లేని హీరో ఈ కథను యాక్సెప్ట్ చేయడమే కాదు. శంభాజీ మహారాజ్ పాత్రలో నటించాడనే కంటే జీవించాడనే చెప్పాలి. ముఖ్యంగా 2025లో జాతీయ ఉత్తమ చిత్రంతో పాటు ఉత్తమ నటుడు, నటి, క్యారెక్టర్ ఆర్టిస్ట్ ఇలా అన్ని అవార్డులు ఈ సినిమాకు ఇవ్వాల్సిందే అని ప్రేక్షకులు సైతం ముక్త కంఠంతో చెబుతున్నారు. ఈ సినిమా ఏసుబాయ్ పాత్రలో రష్మిక మందన్న నటనకు జోహార్ అనాల్సిందే. అటు ఔరంగజేబు పాత్రలో అక్షయ్ ఖన్నా నటనకు హాట్సాఫ్ చెప్పాల్సిందే. మొత్తంగా ప్రతి నాయకుడి విలనిజంతో హీరో పాత్రకు మంచి పేరు వచ్చిందనే చెప్పాలి.
ఇదీ చదవండి: అల్లు అర్జున్ నిజంగానే రామ్ చరణ్ అన్ ఫాలో చేశాడా.. తెర వెనక అసలు స్టోరీ ఇదే.
ముఖ్యంగా నిన్న ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతి సందర్భంగా ఈ సినిమాకు అదిరిపోయే వసూళ్లు వచ్చాయి. మొత్తంగా రూ. 32.40 కోట్ల నెట్ వసూళ్లతో దుమ్ము దులిపింది. ఆరు రోజుల్లో రాబట్టిన వసూళ్ల విషయానికొస్తే.. మొదటి రోజు రూ. 33.10 కోట్లు..సెకండ్ డే రూ. 39.30 కోట్లు.. ఆదివారం.. రూ. 49.03 కోట్లు.. మండే.. రూ. 24.10 కోట్లు.. మంగళవారం .. రూ. 25.75 కోట్లు.. బుధవారం శివాజీ జయంతి రోజున.. రూ. 32.40 కోట్ల నెట్ వసూళ్లు రాబట్టింది. ఓవరాల్ గా ఇప్పటి వరకు 203.68 కోట్ల నెట్ వసూళ్లను హిందీలో అది కూడా మన దేశంలో రాబట్టింది. ఓవరాల్ గా లెక్కలేసుకుంటే.. ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా ఇప్పటి వరకు రూ. 500 కోట్ల గ్రాస్ మార్క్ ను దాటేసింది. ముఖ్యంగా కామెడీ చిత్రాలను చూస్తే.. ఎలాగైతే ప్రేక్షకులు థియేటర్స్ లో నవ్వుతారో.. ‘ఛావా’ సినిమాలో క్లైమాక్స్ సీన్ చూసిన ప్రతి ఒక్కరు కంట తడి పెట్టుకోని ఆ భావోద్వేగంతో బయటకు వస్తున్నారు. మొత్తంగా ఈ జనరేషన్ లో మొఘల్ పాలకులు చేసిన దురాగతాలు ఏమిటో ఇప్పటి జనరేషన్ కు తెలియాల్సిన అవసరం ఉంది. అంతేకాదు కేంద్రంలో చాలా యేళ్లు అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ.. ఇలాంటి వీర యోధుల కథను ఎందుకు సిలబిస్ లో పెట్టాలేదో తెలియాల్సి ఉంది. మొత్తంగా దేశ భక్తి నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి సంచలనాలు నమోదు చేస్తుందో వెయిట్ అండ్ సీ. ఇక ‘చావా’ సినిమాను మిగతా రీజనల్ లాంగ్వేజ్ అయిన తెలుగు, తమిళం,కన్నడ, మలయాళంలో విడుదల చేస్తే మంచి కలెక్షన్స్ దక్కడం గ్యారంటీ అని చెప్పాలి.
ఇదీ చదవండి: వై టార్గెట్ చిరంజీవి.. ? మెగా ఫ్యామిలీని కావాలనే టార్గెట్ చేశారా..?
ఇదీ చదవండి: తాగుడుకు బానిసై సినీ కెరీర్ నాశనం.. 44 ఏళ్ల వయసులో స్టార్ హీరోయిన్ రెండో పెళ్లి..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.