Vishwambhara Movie: సినీ పరిశ్రమలో అతి పెద్ద కుటుంబం కొణిదెల ఫ్యామిలీ. ఈ కుటుంబంలో 20 మందికి పైగా సినీ పరిశ్రమలో కొనసాగుతున్నారు. ఈ కుటుంబం మొత్తం సినీ పరిశ్రమలో కీలక స్థాయిలో ఉన్నాయి. అయితే ఈ కుటుంబం అంతా కలిసి ఒకే సినిమాలో కనిపిస్తే ఎలా ఉంటుంది? మెగా ఫ్యాన్స్ కు పండుగేగా. అయితే అందరూ కాకుండా ఇద్దరు ముగ్గురు కలిసి ఓ సినిమాలో నటిస్తున్నట్లు సమాచారం. చిరంజీవి సినిమాలో అతడి వారసులు తళుక్కున మెరవనున్నారని టాక్. ప్రస్తుతం సినిమాల పరంగా గడ్డు పరిస్థితులు ఎదుర్కొంటున్న నటీనటులకు తన సినిమా ద్వారా వారికి లైఫ్ ఇవ్వాలని భావిస్తున్నట్లు చర్చ జరుగుతోంది. ఇంతకీ ఆ సినిమా ఏంటి? ఆ నటీనటులు ఎవరో తెలుసుకుందాం.
Also Read: Schools Holiday: ఈనెల 19న పాఠశాలలకు సెలవు.. ఎందుకంటే తెలుసా?
చిరంజీవి నటిస్తున్న సోషియో ఫాంటసీ చిత్రం విశ్వంభర. తొలి సినిమా 'బింబిసార’తో హిట్టు కొట్టిన వశిష్ట దర్శకత్వం వహిస్తుండగా.. త్రిష హీరోయిన్ గా రీఎంట్రీ ఇస్తోంది. యూవీ క్రియేషన్స్ బ్యానర్‌పై వంశీ, ప్రమోద్ విక్రమ్ తెరకెక్కిస్తున్న ఈ సినిమాకు ఎంఎం కీరవాణి సంగీతం అందిస్తున్నాడు. శరవేగంగా షూటింగ్ చేసుకుంటున్న ఈ సినిమా దాదాపు 75 శాతం పూర్తయిందని తెలుస్తోంది. ప్రస్తుతం చిరంజీవిపై ఇంట్రో సాంగ్ తీస్తున్నట్లు సమాచారం. కీలక సన్నివేశాలు పూర్తయ్యాయి. అన్ని వేగంగా పూర్తి చేసి ఈ వేసవికి లేదా దసరాకు విడుదల చేయాలని చిత్రబృందం భావిస్తోంది. అయితే ఈ సినిమాలో చిరంజీవికి తోడుగా అతడి కుటుంబం నుంచి ఇద్దరు నటిస్తున్నారని సమాచారం. మెగా వారసులు నటిస్తున్నట్లు తెలుస్తుంది.
Also Read: Govt Holiday: రేపు ప్రభుత్వ ఉద్యోగులకు సెలవు.. ఉత్తర్వులు వెలువరించిన ప్రభుత్వం
ఈ సినిమాలో చిరంజీవి మేనల్లుడు, యువ హీరో సాయిధరమ్ తేజ్‌తో పాటు నాగబాబు కూతురు నిహారిక కొణిదెల నటించబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. వార్తలే కాదు ఇప్పటికే వారిద్దరూ మేకప్ వేసుకున్నారని సమాచారం. ఇప్పటికే సాయి ధరమ్ తేజ్ షూటింగ్‌లో కూడా పాల్గొన్నాడని తెలుస్తోంది. సినిమాలో తేజ్, నిహారిక కీలక పాత్రల్లో నటిస్తున్నారని.. ఈ పాత్రలు సినిమాలో హైలెట్ గా నిలవనున్నాయని ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి. ప్రస్తుతం వీరిద్దరూ సినిమాలపరంగా గడ్డు పరిస్థితులు ఉండడంతో వారికి లైఫ్ ఇచ్చేలా చిరంజీవి వారిని కోరి మరి తన సినిమాలో అవకాశం ఇచ్చినట్లు సమాచారం.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.