NBK Recent Movies 1st day Collection: అఖండ నుంచి బాలయ్య కెరీర్ మంచి స్పీడ్ లో ఉంది. బోయపాటి శ్రీను డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ చిత్రంతో వరుస హిట్స్ తో జోరు మీదున్నారు. అంతేకాదు అఖండ నుంచి అపజయం అంటూ లేకుండా తన జైత్రయాత్ర కొనసాగిస్తున్నాడు. తాజాగా ‘డాకు మహారాజ్’ మూవీతో ఆ జైత్ర యాత్ర కంటిన్యూ చేసారు. అంతేకాదు ఆయన సినిమాల ప్రీ రిలీజ్ బిజినెస్ కూడా ఓ రేంజ్ లో పెరిగింది. తాజాగా బాబీ కొల్లి డైరెక్షన్ బాలకృష్ణ హీరోగా నటించిన ‘డాకు మహారాజ్’ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా రూ. 56 కోట్ల గ్రాస్ అందుకుంది. తెలుగు రాష్ట్రాల్లో ఫస్ట్ డే 25.72 కోట్ల షేర్ అందుకుంది. ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా రూ. 32.85 కోట్ల షేర్ అందుకొని రికార్డు క్రియేట్ చేశారు. ఈ సినిమా బాలయ్య కెరీర్ లో రూ. 80.70 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది. బాలకృష్ణ కెరీర్ లో హైయ్యెస్ట్ రూ. 82 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ లో తొలి రోజే 40 శాతం రికవరీ సాధించి రికార్డు క్రియేట్ చేసింది. అంతకు ముందు అనిల్ రావిపూడి దర్శకత్వంలో బాలకృష్ణ తన ఏజ్ కు తగ్గ పాత్రలో యాక్ట్ చేసిన ‘భగవంత్ కేసరి’. ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా రూ.67.35 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది. అంతేకాదు తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా రూ. 14.36 కోట్ల షేర్ సాధించింది.
ఇక 2023 సంక్రాంతికి గోపీచంద్ మలినేని డైరెక్షన్ లో చేసిన ‘వీరసింహారెడ్డి’సినిమా తొలి రోజు తెలుగు రాష్ట్రాల్లో రూ. 25.35 కోట్ల షేర్ రాబట్టింది. అంతేకాదు అప్పటి వరకు బాలయ్య కెరీర్ లో ఫస్ట్ డే అత్యధిక వసూళ్లను రాబట్టి చిత్రంగా రికార్డు క్రియేట్ చేసింది. తాజాగా ‘డాకు మహారాజ్’ ఈ రికార్డు బ్రేక్ చేసింది. ఈ సినిమా రెండేళ్ల క్రితం రూ. 73 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది. ఇక 2021లో నందమూరి బాలకృష్ణ, బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కిన ‘అఖండ’ సినిమా మంచి విజయం సాదించింది. అంతేకాదు బాలయ్య కెరీర్ లో అత్యధికంగా రూ. 53 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసి రికార్డు క్రియేట్ చేసింది. ఈ మూవీ తెలుగు రాష్ట్రాల్లో తొలి రోజు తక్కువ టికెట్ రేట్లతో 15.39 కోట్ల షేర్ రాబట్టింది.
ఇక నందమూరి బాలకృష్ణకే.యస్.రవికుమార్ దర్శకత్వంలో చేసిన ‘రూలర్’సినిమా రీసెంట్ టైమ్ లో అతి తక్కువ ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది. ఈ సినిమా అప్పట్లోనే ప్రపంచ వ్యాప్తంగా రూ. 23.75 కోట్ల బిజినెస్ చేసింది. ఈ సినిమా తొలి రోజు తెలుగు రాష్ట్రాల్లో రూ. 4.25 కోట్ల షేర్ రాబట్టింది.
ఇక నందమూరి బాలకృష్ణ తన తండ్రి నందమూరి తారక రామారావు జీవిత చరిత్రపై చేసిన చిత్రం ఎన్టీఆర్ కథానాయకుడు, ఎన్టీఆర్ మహానాయకుడు. అందులో ‘ఎన్టీఆర్ కథానాయకుడు’ చిత్రం రూ. 70.60 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది. ఈ మూవీ తొలి రోజు తెలుగు రాష్ట్రాల్లో రూ. 7.6 కోట్ల షేర్ రాబట్టింది. ఆ తర్వాత విడుదలైన ‘ఎన్టీఆర్ మహానాయకుడు’ సినిమా తొలి రోజు రూ. 2.12 కోట్ల అత్యల్ప షేర్ రాబట్టి డిజాస్టర్ గా నిలిచింది. ఇపుడు ఆరేళ్లతో ఎన్నో రెట్లతో తొలి రోజు రూ. 56 కోట్ల గ్రాస్ తో సంచలరం రేపడం మాములు విషయం కాదు.
ఇదీ చదవండి: Prabhas Marriage: ప్రభాస్ మ్యారేజ్ ఫిక్స్.. డార్లింగ్ చేసుకోబోయేది ఈమెనే..!
ఇదీ చదవండి: వెంకటేష్ భార్య నీరజా రెడ్డి గురించి ఎవరికీ తెలియని షాకింగ్ నిజాలు..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.