Don't know why song: ప్రముఖ నిర్మాణ సంస్థ సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ వైవిధ్యభరిత కథలను ప్రేక్షకులకు అందిస్తూ మంచి విజయాలను సాధిస్తోంది. 'జెర్సీ' వంటి భావోద్వేగభరిత సినిమాతో ప్రేక్షకుల మనసులను గెలుచుకున్న గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో, ప్రస్తుతం 'మ్యాజిక్' అనే కొత్త చిత్రాన్ని నిర్మిస్తోంది. ఈ మ్యూజికల్ డ్రామాలో యువ నటీనటులు ప్రధాన పాత్రల్లో కనిపించనున్నారు.
ఈ చిత్రానికి ప్రముఖ సంగీత దర్శకుడు అనిరుధ్ రవిచందర్ స్వరాలు సమకూరుస్తున్నారు. ప్రేమికుల దినోత్సవాన్ని పురస్కరించుకుని, చిత్ర బృందం 'మ్యాజిక్' నుంచి తొలి పాట 'డోంట్ నో వై' ను విడుదల చేసింది. ప్రతి సంవత్సరం అనిరుధ్ ప్రేమికుల దినోత్సవం సందర్భంగా ఒక ప్రత్యేక గీతాన్ని అందించడం పరిపాటి. ఈ సారి కూడా అదే పరంపరను కొనసాగిస్తూ, ఈ మెలోడియస్ ట్రాక్‌ను అందించారు.
'డోంట్ నో వై' పాటలో అనిరుధ్ తన మ్యూజిక్‌తో అదరగొట్టాడు. పాట విజువల్స్, సంగీతం ప్రేక్షకులను అలరిస్తున్నాయి. ఈ గీతాన్ని అనిరుధ్, ఐశ్వర్య సురేష్ కలిసి ఆలపించారు. తెలుగులో కృష్ణకాంత్, తమిళంలో విఘ్నేష్ శివన్ లిరిక్స్ అందించగా, పాటకు భావోద్వేగాలను చక్కగా మేళవించారు. పాట ఒకసారి వింటే మళ్ళీ మళ్ళీ వినాలనిపించేలా ఉంది.
ఈ సినిమా కథ నలుగురు యువకులు తమ కళాశాల ఫెస్ట్ కోసం ఓ ప్రత్యేకమైన పాటను రూపొందించే ప్రయాణం చుట్టూ తిరుగుతుంది. ఈ ప్రయాణం వారి జీవితాలను ఎలా మార్చిందనే దాని ఆధారంగా ఈ చిత్రం సాగుతుంది.
సాంకేతికంగా కూడా ఈ చిత్రం మంచి ప్రమాణాలను పాటిస్తోంది. ప్రముఖ ఛాయాగ్రాహకుడు గిరీష్ గంగాధరన్ విజువల్స్ అందిస్తుండగా, నవీన్ నూలి ఎడిటింగ్ బాధ్యతలు నిర్వహిస్తున్నారు. శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్లపై నిర్మిస్తున్న ఈ సినిమా మరిన్ని వివరాలు త్వరలో తెలియనున్నాయి.
ఇదీ చదవండి: వై టార్గెట్ చిరంజీవి.. ? మెగా ఫ్యామిలీని కావాలనే టార్గెట్ చేశారా..?
ఇదీ చదవండి: అల్లు అర్జున్ నిజంగానే రామ్ చరణ్ అన్ ఫాలో చేశాడా.. తెర వెనక అసలు స్టోరీ ఇదే..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.