Pushpa2 Success Meet:పుష్ప 2 భారీ సక్సెస్ నేపథ్యంలో పుష్ప 2 టీమ్ మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా అల్లు అర్జున్ మాట్లాడుతూ.. దేశం నలుమూలల నుండి మాకు సపోర్ట్ గా నిలిచిన వారందరికీ ధన్యవాదాలు. వరల్డ్ వైడ్ గా ఉన్న తెలుగు వారికీ, భారతీయులకు, మూవీ యూనిట్ కు, మీడియాకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా పుష్ప 2 మూవీ ప్రీమియర్స్ సందర్బంగా అనుకోకుండా హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లో సంధ్య థియేటర్లో జరిగిన సంఘటన మమ్మల్ని ఎంతగానో కలిచివేసిందన్నారు. గత రెండు దశాబ్దాలుగా సినిమా విడుదల రోజు వస్తున్నాము. కానీ ఆరోజు కొంచం ఎక్కువ జనం రావడంతో ఇబ్బంది అవుతుందని థియేటర్ యాజమాన్యం చెప్పడం వెళ్లిపోయాను. కానీ ఇంటికి వచ్చిన తరువాత రోజు జరిగిన సంఘటనలో ఒక మహిళ చనిపోవడం తెలిసి చాల బాధ పడ్డాను. మరొకసారి చెప్తున్నాను ఆ కుటుంబం కోసం రూ. 25 లక్షలు కేవలం ఒక సాయంగా అనుకుని ఇస్తున్నాము. అయినా ఒక మనిషి లేని లోటు ఎవరు తీర్చలేము. అందుకు ఎంతో విచారిస్తున్నాను. అంత కుదుటపడిన తరువాత పర్సనల్ గా వెళ్లి ఆ ఫ్యామిలీని వెళ్లి కలుస్తానంట ముగించారు.
అంతకు ముందు పుష్ప 2 విజయంపై అల్లు అర్జున్ మాట్లాడుతూ... ఈ సినిమా ఈ రేంజ్ సక్సెస్ కు కారణం దర్శకుడు సుకుమార్. ఈ రోజు నేను ఈ స్టేజ్ లో ఉన్నానంటే దానికి కారణం దర్శకులు సుకుమార్ అని చెబుతున్నాను. ఈ సినిమా సక్సెస్ చేసిన నేపథ్యంలో ప్రజలకు చిత్ర బృందం తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతున్నాను.
పుష్ప 2 సినిమా కోసం టికెట్ రేట్స్ పెంచుకోవడానికి అనుమతులు ఇచ్చిన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి, ముఖ్య మంత్రి రేవంత్ రెడ్డికి, సినిమాటోగ్రఫీ మినిష్టర్ కోమటిరెడ్డి వెంకటరెడ్డికి.. అదే విధంగా ఆంధ్ర ప్రదేశ్ ముఖ్య మంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడుకి, ఉప ముఖ్య మంత్రి పవన్ కళ్యాణ్ బాబాయి కి, సినిమాటోగ్రఫీ కందుల దుర్గేష్ కి ప్రత్యేకంగా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతున్నాను. అలాగే బీహార్ గవర్నమెంట్ కు , పాట్నా ప్రజలకు, బీహార్ పోలీసులకు, తమిళనాడు, కేరళ ప్రభుత్వాలకు, దేశంలో ఈ సినిమాకు అండగా నిలిచిన ఇచ్చిన అన్ని సినిమా ఇండస్ట్రీలకు మనస్పూర్తిగా కృతజ్ఞతులు తెలిపారు.
ఇదీ చదవండి: ముగ్గురు మొనగాళ్లు సినిమాలో చిరంజీవి డూప్ గా నటించింది వీళ్లా.. ఫ్యూజలు ఎగిరిపోవడం పక్కా..
ఇదీ చదవండి: టాలీవుడ్ లో ఎక్కువ ప్రీ రిలీజ్ బిజినెస్ చేసిన చిత్రాలు.. ‘పుష్ప 2’ ప్లేస్ ఎక్కడంటే..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.