Dheera: కథ బాగుంటే స్టార్ హీరోల సినిమాలకు సమానంగా సెన్సేషన్ క్రియేట్ చేస్తున్నాయి యువ హీరోల చిత్రాలు. వైవిద్యమైన కథలతో వచ్చి హిట్లు కొడుతున్నారు. ఇక ఇదే ఫాలో అవుతూ టాలీవుడ్ యంగ్ హీరోల్లో లక్ష్ చదలవాడ ప్రస్తుతం ఫుల్ స్పీడు మీదున్నారు. వరుసగా వైవిధ్యమైన కథలను ఎంచుకుంటూ సినిమాలు చేస్తూ ఉన్నారు. వలయం, గ్యాంగ్‌స్టర్ గంగరాజు వంటి హిట్ సినిమాల్లో లక్ష్ తన నటనతో అందరినీ ఆకట్టుకున్నారు. ఇప్పుడు ధీర అనే చిత్రంతో ప్రేక్షకుల ముందుకు త్వరలోనే రాబోతున్నారు.
కొద్దిరోజుల క్రితమే ఈ చిత్రం నుంచి వచ్చిన గ్లింప్స్ అందరినీ ఆకట్టుకున్న సంగతి తెలిసిందే.విక్రాంత్ శ్రీనివాస్ దర్శకత్వం వహిస్తున్న ఈ ప్రాజెక్ట్ మీద అందరిలోనూ అంచనాలు భారీగా ఏర్పడ్డాయి. ఈ సినిమాలు చదలవాడ బ్రదర్స్ సమర్పణలో శ్రీ తిరుమల తిరుపతి వెంకటేశ్వర బ్యానర్ మీద పద్మావతి చదలవాడ నిర్మిస్తున్నారు. కాగా ఈరోజు ఈ సినిమా మేకర్స్ ఈ చిత్రానికి సంబంధించిన ఒక కీలక అప్డేట్ రిలీజ్ చేశారు.
ధీర మూవీ షూటింగ్ కొద్దిరోజుల క్రితమే పూర్తి చేసుకుని నిన్నటి ప్రొడక్షన్ కార్యక్రమాలు కూడా పూర్తి చేసుకుంది. సెన్సార్ కార్యక్రమాలు కూడా పూర్తయ్యాయి. ఇక సినిమాకి సంబంధించిన అన్ని కార్యక్రమాలు ముగియడంతో ఈ చిత్రాం ఫిబ్రవరి 2న గ్రాండ్‌గా విడుదల కానుంది అని ప్రకటించారు ఈ సినిమా మేకర్స్.
ఈ సినిమాలో హీరో లక్ష్ చదలవాడ తో పాటు నేహా పఠాన్, భరణి శంకర్,సోనియా బన్సాల్, మిర్చి కిరణ్, హిమజ, నవీన్ నేని, సామ్రాట్, బాబీ బేడి, వైవా రాఘవ్, భూషణ్, మేక రామకృష్ణ, సంధ్యారాణి తదితరులు కీలక పాత్రలో నటిస్తున్నారు.
ఈ సినిమాకి సంగీతం సాయి కార్తీక్ అందిస్తుండగా సినిమాటోగ్రఫీ కన్నా పీసీ, రచన, దర్శకత్వం విక్రాంత్ శ్రీనివాస్ వహిస్తున్నారు.
Also Read: Sankranthi Special Trains: సంక్రాంతి రద్దీ తట్టుకునేందుకు మరిన్ని ప్రత్యేక రైళ్లు
Also Read: Home Loan Rates: హోమ్ లోన్స్ గుడ్ న్యూస్..వడ్డీ రేట్లు తగ్గబోతున్నాయ్..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook