Stock Market today: స్టాక్ మార్కెట్లు వారాంతంలో (stocks closing bell) స్వల్ప లాభాలను నమోదు చేశాయి. బాంబే స్టాక్ ఎక్స్ఛేంజీ సూచీ- సెన్సెక్స్ (BSE Sensex) 143 పాయింట్లు బలపడి 59,745 వద్దకు చేరింది. నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజీ-నిఫ్టీ (NSE Nify) 67 పాయింట్ల లాభంతో 17,813 వద్ద స్థిరపడింది.
కరోనా భయాలు కొనసాగుతున్నా సూచీలు నేడు ఉత్సాహంగా ముందుకే దూసుకెళ్లాయి. హెవీ వెయిట్ షేర్లు లాభాలకు దన్నుగా నిలిచాయి. ఎఫ్ఎంసీజీ షేర్లు అధికంగా లాభాలను గడించాయి.
ఐటీ షేర్లు నిన్నటి నష్టాల నుంచి తేరుకోవడం కూడా మార్కెట్లకు కలిసొచ్చినట్లు విశ్లేషకులు చెబుతున్నారు.
ఈ రోజు సెషన్ ఎలా సాగిందంటే..
ఇంట్రాడేలో (Intraday) సెన్సెక్స్ 60,130 పాయింట్ల అత్యధిక స్థాయిని తాకింది. అమ్మకాల కారణంగా ఒకానొక దశలో 59,401 కనిష్ఠానికి పడిపోయింది.
నిఫ్టీ కూడా ఇంట్రాడేలో 17,905 పాయింట్ల అత్యధిక స్థాయిని తాకింది. 17,704 పాయింట్ల కనిష్ఠాన్ని తాకింది.
లాభ నష్టాల్లో టాప్-5 షేర్లు..
బీఎస్ఈ 30 షేర్ల ఇండెక్స్‌లో 15 కంపెనీలు లాభాలను నమోదు చేశాయి.. 15 కంపెనీలు డీలా పడ్డాయి.
ఏషియన్ పెయింట్స్ 1.79 శాతం, టీసీఎస్ 1.26 శాతం, నెస్లే 1.23 శాతం, అల్ట్రాటెక్ సిమెంట్ 1.81 శాతం, ఐసీఐసీఐ బ్యాంక్ 1.06 శాతం లాభాలను గడించాయి.
బజాజ్ ఫిన్సర్వ్ 1.39 శాతం, ఎం&ఎం 1.31 శాతం, ఎల్&టీ 1.06 శాతం, బజాజ్ ఫినాన్స్ 1 శాతం, హెచ్డీఎఫ్సీ 0.98 శాతం నష్టాలను నమోదు చేశాయి.
ఆసియాలో ఇతర మార్కెట్లు..
ఆసియాలో ఇతర ప్రధాన మార్కెట్లను పరిశీలిస్తే.. సియోల్ (దక్షిణ కొరియా), హాంగ్ సెంగ్ (హాంకాంగ్) సూచీలు లాభాలను నమోదు చేశాయి.
షాంఘై (చైనా), టోక్యో (జపాన్), థైవాన్ సూచీలు నష్టపోయాయి.
రూపాయి విలువ..
డాలర్‌తో పోలిస్తే రూపాయి 19 పైసలు బలపడింది. ప్రస్తుతం డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ రూ.74.29 వద్ద (Rupee value today) కొనసాగుతోంది.
Also read: Gold Price Today January 7 2022 : తెలుగు రాష్ట్రాల్లో స్వల్పంగా తగ్గిన బంగారం ధరలు...
Also read: Samsung Galaxy S22: అద్దిరిపోయే ఫీచర్లతో కస్టమర్లను టెంప్ట్ చేస్తోన్న స్మార్ట్ ఫోన్
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook