SBI Alert to Customers: అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకులు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, పంజాబ్ నేషనల్ బ్యాంక్ తమ ఖాతాదారులను అప్రమత్తం చేశాయి. సైబర్ నేరాలు పెరిగిపోతున్నాయని, చిన్న తప్పిదం చేసినా మీ ఖాతాలో నగదు ఖాళీ అవుతుందని కొన్ని విషయాలు చెబుతూ ఖాతాదారులను హెచ్చరించాయి.
మీరు ఎప్పుడైనా సరే అపరిచిత వ్యక్తులు మీకు సూచించే యాప్‌లను untrustworthy source నుంచి మాత్రం డౌన్లోడ్ చేయకూడదు. భారతీయ స్టేట్ బ్యాంక్ (State Bank Of India) ఖాతాదారులు వెరిఫైడ్ సోర్సెస్ నుంచి మాత్రమే యాప్‌లను డౌన్లోడ్ చేసుకుని ఇన్స్టాల్ చేయాలని సూచించింది. ‘అపరిచితులు సూచిస్తే మీరు ఎలాంటి యాప్స్ డౌన్లోడ్ చేసుకోకూడదంటూ ఎస్బీఐ ట్వీట్ చేసింది. అలాంట సందర్బాలలో ఓటీపీ/పిన్/సీవీవీ వంటి వివరాలు ఆటోమేటిక్‌గా వారికి షేర్ అయ్యే అవకాశం ఉందని ఖాతాదారులను ఎస్బీఐ అప్రమత్తం చేసింది.
Also Read: ATM Cash Withdrawal Charges: ఏటీఎం క్యాష్‌విత్‌డ్రా ఛార్జీలు పెంచిన రిజర్వ్ బ్యాంక్
ఎన్ఎఫ్సీ తో కనెక్ట్ అయిన డెబిట్ కార్డ్స్ ద్వారా కాంటాక్ట్‌లెస్ ట్రాన్సాక్షన్స్ చేయవచ్చునని సూచించింది. కార్డు ద్వారా ట్రాన్సాక్సన్ చేసే సమయంలోనూ జాగ్రత్తగా ఉండాలని పేర్కొంది. ఎన్ఎఫ్సీ లేదా ఎస్బీఐ డెబిట్ కార్డ్స్ ఇదివరకే సేవ్ చేసుకున్న యాప్స్ నుంచి లేదా ఇంటర్నెట్ బ్యాంకింగ్ ద్వారా చెల్లింపులు జరపాలంది. పీవోఎస్ మేషీన్ల ద్వారా ట్యాప్ చేసి పే చేయడం (SBI Cash Withdrawal Rules) సరైందని ఖాతాదారులకు ఎస్బీఐ పలు జాగ్రత్తలు సూచించింది.
Also Read: Gold Rate Today In Hyderabad: బంగారం ధరలపై కరోనా సెకండ్ వేవ్ ప్రభావం, భారీగా పెరిగిన వెండి ధరలు
ముఖ్యంగా బ్రౌజర్ల ద్వారా చేసే ట్రాన్సాక్షన్లు అంత సురక్షితమైనవి కాదని, వాటి ద్వారా చేసే లావాదేవిలు ఖాతాదారుల వివరాలు షేర్ చేస్తాయని పంజాబ్ నేషనల్ బ్యాంక్ (Punjab National Bank) కస్టమర్లకు సూచించింది. మీకు ఏదైనా బ్రౌజర్ లింక్ లాంటివి ఎవరైనా అనుమానిత వ్యక్తులు పంపితే సైబర్ క్రైమ్ అధికారులకు https://cybercrime.gov.in ద్వారా ఫిర్యాదు చేయాలి. కానీ అన్ని సందర్భాలలో ప్రయోజనం ఉండదని, జాగ్రత్తలు పాటించడమే మీ నగదుకు భద్రతనిస్తుందని పీఎన్బీ పేర్కొంది.
మీకు ఎప్పుడైనా నెంబర్లు కావాలంటే అధికారిక వెబ్సైట్లో ఉండే కస్టమర్ నెంబర్లకు మాత్రమే కాల్ చేయాలని పంజాబ్ నేషనల్ బ్యాంక్ సూచించింది. అనధికారిక వెబ్సైట్లలోని ఫోన్ నెంబర్లకు కాల్ చేస్తే మీ వ్యక్తిగత వివరాలు, బ్యాంకు వివరాలు తెలుసుకుని బ్యాంకు ఖాతా ఖాళీ చేస్తారని తన ఖాతాదారులను హెచ్చరించింది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee Hindustan App డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook