Jio Special Plans: జియో యూజర్లకు గుడ్‌న్యూస్, ఆ ప్లాన్‌తో జియో హాట్‌స్టార్ పూర్తిగా ఫ్రీ

Jio Special Plans: రిలయన్స్ జియో యూజర్లకు గుడ్‌న్యూస్. జియో సినిమా, హాట్‌స్టార్ విలీనంతో ఆవిర్భవించిన జియో హాట్‌స్టార్ స్ట్రీమింగ్ అవకాశం లభిస్తోంది. జియో అందించే ఈ ప్లాన్‌తో జియో హాట్‌స్టార్ ఉచిత సబ్‌స్క్రిప్షన్ పొందవచ్చు. ఆ వివరాలు ఇలా ఉన్నాయి. 

Written by - Md. Abdul Rehaman | Last Updated : Feb 17, 2025, 07:29 PM IST
Jio Special Plans: జియో యూజర్లకు గుడ్‌న్యూస్, ఆ ప్లాన్‌తో జియో హాట్‌స్టార్ పూర్తిగా ఫ్రీ

Jio Special Plans: రిలయన్స్ జియో కొత్త ప్రీ పెయిడ్ ప్లాన్ ప్రకటించింది. ఈ ప్లాన్ తీసుకుంటే కొత్తగా ఆవిర్భవించిన జియో హాట్‌స్టార్ సబ్‌స్క్రిప్షన్ ఉచితంగా లభిస్తుంది. ఈ ప్లాన్‌లో రోజుకు 2 జీబీ డేటాతో పాటు అన్‌లిమిటెడ్ వాయిస్ కాలింగ్ కూడా ఉంటుంది. ఈ ప్లాన్ పూర్తి ప్రయోజనాలు ఇలా ఉన్నాయి.

ఇటీవలే జియో సినిమా, డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ విలీన ప్రక్రియ పూర్తయింది. ఇప్పుడు కొత్తగా జియో హాట్‌స్టార్ అందుబాటులో ఉంది. ఈ క్రమంలో ఈ ఓటీటీ ఉచితంగా పొందాలంటే రిలయన్స్ జియో యూజర్లకు మంచి అవకాశం ఉంది. జియో ఇప్పుడు కొత్తగా ప్రీ పెయిడ్ ప్లాన్ లాంచ్ చేసింది.  ఈ ప్లాన్ వ్యాలిడిటీ 84 రోజులు ఉంటుంది. రోజుకు 2 జీబీ డేటా, అన్‌లిమిటెడ్ వాయిస్ కాలింగ్, రోజుకు 100 ఎస్ఎంఎస్‌ల సౌకర్యం ఉంటుంది. అంతేకాకుండా జియో హాట్‌స్టార్ ఓటీటీ ఉచితంగా లభిస్తుంది. ఈ ప్లాన్ టారిఫ్ 84 రోజులకు 949 రూపాయలు.

జియో సినిమా-హాట్‌స్టార్ విలీనం తరువాత జియో యూజర్లు జియో హాట్‌స్టార్ ఉచిత సబ్‌స్క్రిప్షన్ కోసం ఎదురు చూస్తున్న పరిస్థితి ఉంది. అందుకే జియో ఈ కొత్త ప్లాన్ ప్రవేశపెట్టింది. 949 రూపాయలతో రీఛార్జ్ చేసుకుంటే జియో హాట్‌స్టార్ 84 రోజుల వరకూ ఉచితంగా వీక్షించవచ్చు. గతంలో ఇదే ప్లాన్‌లో డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ లభించేది. జియో హాట్‌స్టార్ ఆవిర్భావంతో జియో సినిమా ప్రీమియం, డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ ప్రీమియం కంటెంట్ ఒకే చోట లభిస్తోంది. 

కేవలం జియో హాట్‌స్టార్ ఒక్కటే తీసుకోవాలంటే 299 రూపాయలు సూపర్ ప్లాన్ అందుబాటులో ఉంది. ఇది మూడు నెలలు పనిచేస్తుంది. ఒక మొబైల్, ఒక టీవీకు పనిచేస్తుంది. ఇదే వార్షిక ప్లాన్ 899 రూపాయలకు వస్తుంది. ఇక జియో హాట్‌స్టార్‌లో మరో ప్లాన్ 499 రూపాయలకు ఉంది. ఇది కూడా మూడు నెలలే ఉంటుంది కానీ ఇందులో ప్రకటనలు ఉండవు. 4కే రిజల్యూషన్ ఉంటుంది. ఇందులోనే ఏడాదికైతే 1499 రూపాయలు అవుతుంది. 

Also read: SIP Tricks: మ్యూచ్యువల్ ఫండ్స్‌లో 10 కోట్లు సంపాదించి పెట్టే 3 ఎస్ఐపీ ట్రిక్స్ ఇవే

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News