Jio Cinema Premium Plan: ఐపిఎల్ 2023 ని ఉచితంగా వ్యూయర్స్‌కి అందించి భారీ మొత్తంలో సబ్‌స్క్రైబర్స్‌ని పెంచుకున్న జియో సినిమా తాజాగా జియో సినిమా ప్రీమియం అనే సరికొత్త సబ్‌స్క్రిప్షన్ ప్లాన్‌ని ఇంట్రడ్యూస్ చేసింది. ఈ జియో సినిమా ప్రీమియం టారిఫ్ ప్రత్యేకత ఏంటంటే.. హాలీవుడ్ కంటెంట్‌ని ఇష్టపడే వారికి ఎవరికైనా ఈ రీచార్జ్ ప్లాన్‌కి సరిగ్గా కనెక్ట్ అవుతారు. ఈ నేపథ్యంలో జియో సినిమా ప్రీమియం ధర ఎంత, ఎన్ని డివైజెస్‌కి ఇది వర్తిస్తుంది ? , ముఖ్యమైన షోలు ఏంటివి, జియో సినిమా ప్రీమియం సబ్‌స్క్రైబర్స్‌కి లభించే అదనపు బెనిఫిట్స్ ఏంటి ? ఉచితంగా లభించే కంటెంట్ ఏంటో తెలుసుకుందాం రండి.
జియో సినిమా ప్రీమియం ధర ఎంతంటే..
జియో సినిమా ప్రీమియం సబ్‌స్క్రిప్షన్ ప్లాన్ ధర రూ. 999 గా ఉంది. ఏడాది వ్యాలిడిటీ ఉండే ఈ జియో సినిమా ప్రీమియం సబ్‌స్క్రిప్షన్‌తో మరింత మంది సబ్‌స్క్రైబర్స్‌ని సంపాదించుకోవచ్చు అని జియో సినిమా ప్లాన్ చేస్తోంది.
జియో సినిమా ప్రీమియం సబ్‌స్క్రిప్షన్ ప్లాన్ కోసం పేమెంట్ ఎలా చేయాల్సి ఉంటుంది ?
జియో సినిమా ప్రీమియం సబ్‌స్క్రిప్షన్ రీచార్జ్ చేసుకోవాలి అనుకునే వారు యూపీఐ, డెబిట్ కార్డు, క్రెడిట్ కార్డుతో చెల్లింపులు చేసి రీచార్జ్ చేసుకోవచ్చు.
జియో సినిమా ప్రీమియంపై ఎలాంటి కంటెంట్ లభిస్తుందంటే..
HBO లో వచ్చే సక్సెషన్, హ్యారీ పోటర్, బ్యారీ లాంటి ఇంట్రెస్టింగ్ సినిమాలతో పాటు వార్నర్ బ్రదర్స్‌లో వచ్చే సినిమాలు, డాక్యుమెంటరీస్ కూడా ఎంజాయ్ చేయొచ్చు.
జియో సినిమా ప్రీమియంతో డెక్స్‌టర్: న్యూ బ్లడ్, షార్క్ ట్యాంక్ లాంటి వూట్ సెలెక్ట్ ఓటిటి ప్లాట్‌ఫామ్ కంటెంట్ కూడా వీక్షించే అవకాశం లభించనుంది.
జియో సినిమా యూజర్స్ కి ఉచితంగా లభించే కంటెంట్ ఏంటంటే..
జియో సినిమా యూజర్స్‌కి టాటా ఐపిఎల్ 2023 టోర్నమెంట్‌తో పాటు విక్రమ్ వేధ లాంటి రీసెంట్ బ్లాక్‌బస్టర్ మూవీస్ కూడా వీక్షించే అవకాశం లభించనుంది.
జియో సినిమా ప్రీమియంతో ఏకకాలంలో ఎన్ని డివైజెస్ లో సినిమాలు చూడొచ్చంటే
జియో సినిమా ప్రీమియంతో స్మార్ట్ ఫోన్స్, టీవీలు, వెబ్ బ్రౌజర్స్ కలిపి ఒకేసారి నలుగురు యూజర్స్ కనెక్ట్ అయ్యేందుకు అవకాశం ఉంది.
వీడియో, ఆడియో క్వాలిటీ ఎలా ఉండనుందంటే..
జియో సినిమా ప్రీమియంతో సినిమాలు, షోలకు సంబంధించి ఒరిజినల్ వీడియో, ఆడియో క్వాలిటీ ఎంజాయ్ చేయొచ్చు అని జియో సినిమా వెల్లడించింది.