Tirumala Ratha Saptami: రథ సప్తమికి ముస్తాబైన తిరుమల..ఈ రోజే అన్ని వాహన సేవలు..

Tirumala Ratha Saptami: ప్రత్యక్ష దైవం సూర్యనారాయణ జన్మదినాన్ని రథ సప్తమిగా జరుపుకోవడం ఆనవాయితీగా వస్తోంది. తెలుగు పంచాంగం ప్రకారం మాఘ శుద్ధ సప్తమిని రథ సప్తమిగా ప్రజలు సూర్య దేవుణ్ణి ఆరాధిస్తారు. ఉత్తరాయణం తర్వాత వచ్చే రథ సప్తమి నుంచి సూర్య భగవానుడు ఉగ్ర రూపం దాల్చే సమయం. ఈ సందర్భంగా తిరుమలలో  ఇవాళ రథసప్తమి వేడుకలు అంగరంగవైభవంగా ప్రారంభమైంది.

Written by - TA Kiran Kumar | Last Updated : Feb 4, 2025, 09:06 AM IST
Tirumala Ratha Saptami: రథ సప్తమికి ముస్తాబైన తిరుమల..ఈ రోజే అన్ని వాహన సేవలు..

Tirumala Ratha Saptami: రథ సప్తమి పర్వదినం సందర్బంగా తిరుమల ఆలయానికి భక్తులు పోటెత్తారు. రథసప్తమి సందర్భంగా ఇవాళ తిరుమల శ్రీవారికి  బ్రహ్మోత్సవాల్లో జరిగే వాహన సేవలు అన్నీ ఉదయం నుంచి రాత్రి వరకూ నిర్వహిస్తారు. దీనిని మినీ బ్రహ్మోత్సవంగా కూడా పిలుస్తారు.  తొలుత తిరుమలలో సూర్యప్రభ వాహనంపై తిరుమాడవీధుల్లో మలయప్ప స్వామిని ఉరేగించనున్నారు. వాయువ్య దిశలో సూర్యప్రభ వాహనాన్ని నిలిపి ఉంచారు. సూర్యకిరణాలు తాకిన వెంటనే వాహన సేవలు ప్రారంభమయ్యాయి.  

రథసప్తమిగాను తిరుమల తిరుపతి దేవస్థానం  సకల ఏర్పాట్లు చేసింది. ఈ మధ్య జరిగిన తొక్కిసలాట నేపథ్యంలో టీటీడీ అధికారులు అప్రమత్తమయ్యారు.  గ్యాలరీల్లోకి వచ్చి వెళ్ళే దారుల్లోకి  భక్తుల ప్రవేశాల సందర్భంగా తగిన జాగ్రత్తలు తీసుకున్నారు.  గ్యాలరీలలో ఉన్న భక్తులకు అందిస్తున్న అన్నప్రసాదాల పంపిణీని టీటీడీ ఛైర్మన్‌, అదనపు ఈవో రాత్రి స్వయంగా పరిశీలించారు. రథసప్తమి రోజున క్రమం తప్పకుండా గ్యాలరీలలోని భక్తులకు ఎలాంటి ఫిర్యాదులకు అవకాశం ఇవ్వకుండా అన్నప్రసాదాలు, తాగునీరు , పాలు అందించేలా ఏర్పాట్లు చేసారు.

ఈ వేడుకకు సుమారు రెండు లక్షల మంది భక్తులు హాజరయ్యే అవకాశం ఉందని టీటీడీ అంచనా వేస్తోంది.  పోలీసులు, టీటీడీతో సిబ్బంది, NDRF భద్రతా బలగాలను వినియోగించే అవకాశం ఉందని తెలుస్తోంది.  తిరుమలలోని మాడవీధుల్లోని గ్యాలరీల్లోకి ప్రవేశించే మార్గాలపై ఫోకస్ పెట్టారు. తొక్కిసలాటలు జరగకుండా తగిన చర్యలు తీసుకున్నారు.

ఇదీ చదవండి:   గడ్డకట్టే చలిలో నాగ సాదువులు నగ్నంగానే ఎందుకు ఉంటారు.. అసలు రహస్యం అదేనా..!

రథసప్తమి సందర్భంగా పలు సేవలు, ప్రివిలేజ్ దర్శనాలను రద్దు చేశారు . అష్టదళ పాద పద్మారాధన, కల్యాణోత్సవం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్ర దీపాలంకార సేవలు రద్దు చేశారు. ఎన్.ఆర్.ఐలు, చంటి బిడ్డల తల్లిదండ్రులు, సీనియర్ సిటిజన్లు, వికలాంగుల ప్రివిలేజ్ దర్శనాలు రద్దు. తిరుపతిలో ఫిబ్రవరి 3 – 5 వరకు స్లాటెడ్ సర్వదర్శనం టోకెన్లు జారీ చేయరు. ప్రోటోకాల్ ప్రముఖులకు మినహా విఐపి బ్రేక్ దర్శనాలను రద్దు చేశారు. బ్రేక్ దర్శనాలకు సంబంధించి ఫిబ్రవరి 3న తేదిన ఎలాంటి సిఫార్సు లేఖలు స్వీకరించరని ప్రకటించింది. ప్రత్యేక ప్రవేశ దర్శనం  టిక్కెట్లు ఉన్న భక్తులు వేచి ఉండకుండా ఉండేందుకు నిర్ణీత సమయంలో మాత్రమే వైకుంఠం క్యూ కాంప్లెక్స్ వద్ద రిపోర్ట్ చేయాలని టీటీడీ భక్తులకు సూచించింది.

ఇదీ చదవండి : ప్రస్తుత మార్కెట్ వాల్యూ ప్రకారం నాగార్జున ‘అన్నపూర్ణ స్టూడియో’ మార్కెట్ విలువ ఎంతో తెలుసా..?

ఇదీ చదవండి : చిరంజీవి, కీర్తి సురేష్ తల్లితో రొమాన్స్ చేసిన ఈ సినిమా తెలుసా..! అందులో మెగాస్టార్ విలన్..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

Trending News