Tirupati Mumtaz hotel controversy row: ఆంధ్ర ప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇటీవల సనాతన ధర్మం గురించి ఎక్కువగా ఆసక్తికర వ్యాఖ్యలు చేస్తున్నారు. తిరుమల లడ్డు వివాదం తెరమీదకు వచ్చినప్పటి నుంచి ఆయన హిందు ధర్మం కోసం ఎంత వరకైన వెళ్తానని తెల్చిచెప్పారు. అంతే కాకుండా వారాహి డిక్లరేషన్ అంటూ కూడా ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. ఇదిలా ఉండగా.. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ దీంతో దక్షిణాదిలో ఆధ్యాత్మిక బాట చేపట్టారు. ఆయన ముఖ్యంగా కేరళ, తమిళనాలలోని ముఖ్యమైన ఆలయాలను దర్శనం చేసుకుంటారు.
తిరుపతిలో ముంతాజ్ హోటల్ నిర్మాణానికి సంబంధించి వివాదం రగులుతోంది.
టీటీడీ పరిపాలనా భవనం వద్ద స్వామీజీలు ఆమరణ దీక్ష ప్రారంభించడం, వారాహి డిక్లరేషన్ ప్రకటనపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌పై ఆగ్రహం వ్యక్తం చేయడం దీనికి మరింత ప్రాధాన్యతను తెచ్చింది.సాధు పరిషత్, టీటీడీ అధికారులపై… pic.twitter.com/rIbWj3BEJI
— Aadhan Telugu (@AadhanTelugu) February 12, 2025
ఈ యాత్రలో అరుణాచలం, అగస్థ్య జీవసమాధి కుంభేశ్వర దేవాలయం, అనంత పద్మనాభ స్వామి, మధుర మీనాక్షి, పరుసరామస్వామి, , స్వామిమలైయ్, తిరుత్తై సుబ్రమణ్యేశ్వరస్వామి, కంచి కామాక్షితో అనంత పద్మనాభ స్వామి ఆలయాలను సందర్శిస్తారని సమాచారం. మరోవైపు తిరుపతిలో అలిపిరి మెట్ల మార్గం సమీపంలో ముంతాజ్ హోటల్స్ నిర్మాణం చేపట్టారు. దీనిపై ప్రస్తుతం స్వామిజీలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు.
సుమారు 20ఎకరాల్లో ఈ ఫైవ్ స్టార్ హోటల్ నిర్మాణం చేపట్టారు. ఈ క్రమంలో స్థానిక హిందు సంఘాలు, వివిధ సమితిలకు చెందిన సాధులు ఈ హోటల్ దగ్గరకు చేరుకుని ఫ్లకార్డ్ లు పట్టుకుని నిరసనలు తెలియజేశారు. పవన్ కళ్యాణ్ కు వ్యతిరేకంగా కూడా నిరసనలు తెలిపారు. వారాహి డిక్లరేషన్ అంటే ఇదేనా.. అంటూ నినాదాలు చేశారు. పవిత్రమైన తిరుపతిలో ఇలాంటి హోటల్స్ కు అనుమతి ఇస్తే.. అక్కడ అసాంఘిక కార్యక్రమాలకు అడ్డగా మారుతాయన్నారు. వారాహి డిక్లరేషన్ అంటే.. ఏడు కొండలకు గుండు కొట్టడమా.. అంటూ పవన్ పై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు.
Read more: Pawan Kalyan: దక్షిణాదిలో జనసేనాని సనాతన ధర్మ పరిరక్షణ యాత్ర.. పవన్ యాత్రల వెనక అసలు వ్యూహం అదేనా..
ఈ క్రమంలో 2014 నుంచి 2019 మధ్య చంద్రబాబు సర్కారు దేవలోక్ పేరిట పర్యాటక ప్రాజెక్ట్ కోసం 60 ఎకరాలను కేటాయించింది. దీనిలో గత వైసీపీ సర్కారు మాత్రం.. 20 ఎకరాలను ముంతాజ్ హోటల్ నిర్మాణంకు అనుమతి ఇచ్చినట్లు టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు క్లారిటీ ఇచ్చారు.
దీనిపై తాము.. పాలక మండలి సమావేశంలో ఇప్పటికే దీని అనుమతులు రద్దు చేయాలని ప్రభుత్వానికి కోరాలని తీర్మానించినట్లు పేర్కొన్నారు. అతి త్వరలో ప్రభుత్వాన్ని కలిసి దీనిపై వెంటనే చర్యలు తీసుకునే విధంగా ఒత్తిడి తీసుకొస్తామని కూడా టీటీడీ వెల్లడించింది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.